By: ABP Desam | Updated at : 28 Sep 2021 11:27 AM (IST)
Edited By: Eleti Saketh Reddy
ఐపీఎల్‌లో నేడు మధ్యాహ్నం జరగనున్న మ్యాచ్‌లో కోల్‌కతాతో ఢిల్లీ తలపడనుంది.
ఐపీఎల్‌లో నేడు మధ్యాహ్నం మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఇది ఈ సీజన్‌లో 41వ మ్యాచ్. షార్జాలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. ఢిల్లీ పాయింట్ల పట్టికలో తిరిగి అగ్రస్థానానికి చేరనుంది. చెన్నై చేతిలో ఓటమి ఎదురవడంతో కోల్‌కతా కూడా ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని కసిగా ఉంది.
ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 26 మ్యాచ్‌లు జరిగాయి. 14 మ్యాచ్‌ల్లో కోల్‌కతా విజయం సాధించగా, 12 మ్యాచ్‌ల్లో ఢిల్లీ గెలిచింది. అయితే కేకేఆర్‌తో జరిగిన గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు సార్లు ఢిల్లీ గెలిచింది.
Also Read: షాకిచ్చిన మొయిన్ అలీ! టెస్టులకు గుడ్‌బై.. మూడో బెస్ట్ బౌలర్ అతడే!
యూఏఈలో ఇప్పటివరకు కోల్‌కతా మంచి ప్రదర్శనే చేసింది. అయితే చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో డెత్ ఓవర్లలో చతికిలపడటంలో కోల్‌కతా కొద్ది తేడాలో ఓటమి పాలైంది. టాప్ ఆర్డర్‌లో యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి మంచి ఫాంలో ఉన్నారు. బౌలింగ్‌లో కూడా వరుణ్ చక్రవర్తి, ప్రసీద్ కృష్ణ, సునీల్ నరైన్, లోకి ఫెర్గూసన్ పరుగులు కట్టడి చేయడంతో పాటు వికెట్లు కూడా తీయగలుగుతున్నారు. ఆల్ రౌండర్ రసెల్ కూడా జట్టులో కీలకమైన ఆటగాడు.
ఇక ఢిల్లీ విషయానికి వస్తే.. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో కేవలం ముగ్గురు విదేశీ ఆటగాళ్లతోనే ఢిల్లీ బరిలోకి దిగింది. మార్కస్ స్టాయినిస్ స్థానంలో లలిత్ యాదవ్ బరిలోకి దిగాడు. ఢిల్లీ కూడా బ్యాటింగ్, బౌలింగ్‌ల్లో తిరుగు లేకుండా దూసుకుపోతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి తిరిగి తమ టాప్ ప్లేస్ అందుకోవాలనేది ఢిల్లీ లక్ష్యం.
తుది జట్లు(అంచనా)
కోల్‌కతా నైట్‌రైడర్స్: శుభ్‌మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), నితీష్ రాణా, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, లోకి ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, ప్రసీద్ కృష్ణ
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), లలిత్ యాదవ్, షిమ్రన్ హెట్‌మేయర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబడ, ఆన్రిచ్ నోర్జే, అవేష్ ఖాన్
Also Read: హర్షల్ పటేల్ హ్యాట్రిక్.. ముంబై ఇండియన్స్ పతనాన్ని శాసించిన ఆర్సీబీ బౌలర్
MI Vs DC Highlights: ముంబై గెలిచింది - బెంగళూరు నవ్వింది - ఐదు వికెట్లతో ఓడిన ఢిల్లీ!
MI Vs DC: కీలక మ్యాచ్‌లో తడబడ్డ ఢిల్లీ - ముంబై టార్గెట్ ఎంతంటే?
MI Vs DC Toss: బెంగళూరుకు గుడ్‌న్యూస్ - టాస్ గెలిచిన ముంబై!
Thailand Open: ప్చ్.. సింధు! చెన్‌యూఫీ అనుకున్నంత పనీ చేసేసింది!
IPL 2022 TV Ratings: ఐపీఎల్ టీవీ రేటింగ్స్ ఢమాల్! పరిహారం డిమాండ్ చేస్తున్న అడ్వర్టైజర్లు
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం
Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి
KCR Delhi Schools : తెలంగాణలోనూ ఢిల్లీ విద్యా విధానం - కేజ్రీవాల్‌పై కేసీఆర్ ప్రశంసల జల్లు !
Petrol Diesel Prices down: పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గింపు - గుడ్‌న్యూస్ చెప్పిన నిర్మలమ్మ