Indonesia Masters 2022: శ్రమించినా వరించని అదృష్టం! ఇండోనేషియా క్వార్టర్స్‌లో లక్ష్యసేన్ ఓటమి
Indonesia Masters 2022: ఇండోనేషియా మాస్టర్స్-2022లో భారత యువ కెరటం లక్ష్య సేన్ ఓటమి పాలయ్యాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో చైనీస్ థైపీ షట్లర్ చౌ టీన్ చెన్ చేతిలో పోరాడి ఓడాడు.
ఇండోనేషియా మాస్టర్స్-2022లో భారత యువ కెరటం లక్ష్య సేన్ ఓటమి పాలయ్యాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో చైనీస్ థైపీ షట్లర్ చౌ టీన్ చెన్ చేతిలో పోరాడి ఓడాడు. గంట రెండు నిమిషాల పాటు సాగిన పోరులో 16-21, 21-12, 14-21 తేడాతో పరాజయం చవిచూశాడు.
🙇🏿♂️💔
— BAI Media (@BAI_Media) June 10, 2022
🇮🇳 @lakshya_sen puts up a commendable effort against World no 4- Chou Tien Chen of Chinese Taipei before ending his #IndonesiaMasters2022 campaign.
Comeback stronger, champ! 🙌#IndonesiaMastersSuper500 #Badminton pic.twitter.com/tZf7TRni4q
తొలి గేమ్‌లో లక్ష్య సేన్ వేగంగా ఆడలేకపోయాడు. కోర్టులో కదల్లేకపోయాడు. దాంతో ప్రత్యర్థి 11-9తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే ఊపులో 21-16తో గేమ్ గెలిచేశాడు. కీలకమైన రెండో గేమ్‌లో ప్రపంచ కాంస్య పతక విజేత లక్ష్యసేన్ పుంజుకున్నాడు. ముందుగానే ఆధిక్యం సంపాదించాడు. 11-5తో దుమ్మురేపాడు. 21-12తో మ్యాచ్‌ను 1-1తో సమం చేశాడు.
నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సేన్ తేలిపోయాడు. చెన్ 3-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆపై మరింత జోరు పెంచి 11-5తో ఆధిపత్యం చెలాయించాడు. చివరికి 21-14తో గేమ్‌తో పాటు మ్యాచ్ గెలిచేశాడు. ఇంటర్నేషనల్ కెరీర్లో లక్ష్య సేన్‌పై 2-0తో చెన్‌దే పైచేయి.
Indonesia Masters 2022: Lakshya Sen loses to Chou Tien-chen in QF
— ANI Digital (@ani_digital) June 10, 2022
Read @ANI Story | https://t.co/WYoN91p1Y0#LakshyaSen #IndonesiaMasters #Badminton pic.twitter.com/wEckOTWPV2
𝙌𝙐𝘼𝙍𝙏𝙀𝙍𝙁𝙄𝙉𝘼𝙇𝙎 ! ⚔️@Pvsindhu1 🆚 Ratchanok Intanon@lakshya_sen 🆚 Chou Tien Chen
— BAI Media (@BAI_Media) June 10, 2022
⏰- 11:30 am IST onwards
🔴Live: @VootSelect | @Sports18 #IndonesiaMaster2022 #IndiaontheRise #Badminton pic.twitter.com/vM8HkRILVm
Into the Quarters! 💪🔥#IndonesiaMasters2022#BWFWorldTour#IndiaontheRise#Badminton pic.twitter.com/Ql9pbmQsr7
— BAI Media (@BAI_Media) June 9, 2022