అన్వేషించండి

India vs Japan: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు చేరుకున్న భారత్ - సెమీస్‌లో జపాన్‌పై 5-0తో విజయం!

హాకీ ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్లో జపాన్‌పై భారత్ 5-0తో విజయం సాధించింది.

India vs Japan Hockey Asian Champions Trophy: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2023 సెమీ ఫైనల్‌లో భారత హాకీ జట్టు 5-0తో జపాన్‌ను ఓడించింది. ఇప్పుడు భారత్ ఫైనల్‌లో మలేషియాతో తలపడనుంది. సెమీఫైనల్‌లో భారత జట్టు ఆరంభం నుంచి ఆధిపత్యాన్ని కొనసాగించింది. మొదటి అర్ధభాగం ముగిసే సమయానికి భారత్ 3-0తో ఆధిక్యం సంపాదించింది. ఆ తర్వాత ద్వితీయార్థంలో కూడా రెండు గోల్స్‌ చేసింది. దీంతో మ్యాచ్‌ను 5-0 భారీ తేడాతో గెలుచుకుంది.

మొదటి నుంచి ఆధిపత్యం
టోర్నీ మొదటి నుంచి భారత్ మంచి ప్రదర్శన కనబరిచింది. సెమీ ఫైనల్‌లోనూ ఏమాత్రం తగ్గలేదు. తొలి క్వార్టర్‌లో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. ఆ తర్వాత 19వ నిమిషంలో అర్ష్‌దీప్‌ సింగ్‌ భారత్‌కు మొదటి గోల్ అందించారు. ఆ వెంటనే 23వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ చేశాడు. అనంతరం మన్‌దీప్ సింగ్, సుమిత్, కార్తీ సెల్వం కూడా ఒక్కో గోల్ చేశారు.

అంతకుముందు రెండేళ్ల క్రితం ఢాకాలో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో జపాన్ 5-3తో భారత్‌ను ఓడించింది. ఈసారి దానికి ప్రతీకారం తీర్చుకుంది టీమ్ ఇండియా. ఈ సెమీఫైనల్‌లో టీమిండియా చాలా దూకుడుగా ఆడింది. అదే సమయంలో జపాన్ జట్టు పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయింది.

ఆగస్టు 3వ తేదీన జరిగిన మ్యాచ్‌లో చైనాను భారత్ ఘోరంగా ఓడించడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో భారత్‌ 7-2తో విజయం సాధించింది. దీని తర్వాత ఆగస్టు 4వ తేదీన జపాన్‌తో జరిగిన మ్యాచ్‌ 1-1తో డ్రాగా ముగిసింది. ఆగస్టు 6వ తేదీన మలేషియాపై టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. భారత్ 5-0తో మలేషియాను ఓడించింది. ఆ తర్వాత కొరియా చేతిలో 3-2తో భారత్ ఓటమి చవి చూసింది.

అంతే కాకుండా టీం ఇండియా ఈ టోర్నమెంట్‌లో 4-0తో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో భారత జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. భారత గోల్ కీపర్ శ్రీజేష్‌కి సెమీ ఫైనల్ మ్యాచ్ చాలా ప్రత్యేకమైనది. అతని కెరీర్‌లో ఇది 300వ మ్యాచ్. మ్యాచ్‌కు ముందు అతడికి సన్మానం కూడా చేశారు.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP vs Janasena: టీడీపీ, జనసేన నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు - చంద్రబాబు, పవన్ ఏం చేస్తున్నారో!
టీడీపీ, జనసేన నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు - చంద్రబాబు, పవన్ ఏం చేస్తున్నారో!
Traffic Diverts For Sadar Sammelan: సదర్ ఉత్సవాలకు సిద్ధమైన హైదరాబాద్‌-  ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు
సదర్ ఉత్సవాలకు సిద్ధమైన హైదరాబాద్‌- ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు
TDP: ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
Srisailam Tour Package: కొండల మధ్య కృష్ణమ్మ ప్రవాహంలో లాంచీ ప్ర‌యాణం షురూ - టికెట్ల ధరలు ఇలా
కొండల మధ్య కృష్ణమ్మ ప్రవాహంలో లాంచీ ప్ర‌యాణం షురూ - టికెట్ల ధరలు ఇలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kithampeta Village No Diwali Celebrations |  70ఏళ్లుగా దీపావళి పండుగకు దూరమైన కిత్తంపేట | ABP DesamKTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP DesamEngland Players Not Retained by IPL Franchises | ఇంగ్లండ్ ప్లేయర్లకు ఫ్రాంచైజీలు ఝలక్ | ABP Desamఇజ్రాయేల్‌లో భారీ సైరన్‌ల మోత, వెంటనే పేలుళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP vs Janasena: టీడీపీ, జనసేన నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు - చంద్రబాబు, పవన్ ఏం చేస్తున్నారో!
టీడీపీ, జనసేన నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు - చంద్రబాబు, పవన్ ఏం చేస్తున్నారో!
Traffic Diverts For Sadar Sammelan: సదర్ ఉత్సవాలకు సిద్ధమైన హైదరాబాద్‌-  ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు
సదర్ ఉత్సవాలకు సిద్ధమైన హైదరాబాద్‌- ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు
TDP: ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
Srisailam Tour Package: కొండల మధ్య కృష్ణమ్మ ప్రవాహంలో లాంచీ ప్ర‌యాణం షురూ - టికెట్ల ధరలు ఇలా
కొండల మధ్య కృష్ణమ్మ ప్రవాహంలో లాంచీ ప్ర‌యాణం షురూ - టికెట్ల ధరలు ఇలా
New Maruti Suzuki Dzire: మారుతి సుజుకి కొత్త డిజైర్ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు రానుందంటే?
మారుతి సుజుకి కొత్త డిజైర్ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు రానుందంటే?
KTR: కాంగ్రెస్ గ్యారెంటీలపై ఖర్గే వ్యాఖ్యలు - కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
కాంగ్రెస్ గ్యారెంటీలపై ఖర్గే వ్యాఖ్యలు - కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
Constable Jobs: కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్ - ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక ప్రకటన
కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్ - ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక ప్రకటన
Mount Everest: ఎవరెస్ట్ అధిరోహించిన ఏపీకి చెందిన బీటెక్ స్టూడెంట్
ఎవరెస్ట్ అధిరోహించిన ఏపీకి చెందిన బీటెక్ స్టూడెంట్
Embed widget