News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

India vs England 2021: మూడో టెస్టు ముందు ఇంగ్లాండ్‌కు భారీ షాక్... గాయంతో మార్క్‌వుడ్ ఔట్

భారత్‌తో మూడో టెస్టుకు ముందు ఆతిథ్య ఇంగ్లాండ్‌కు భారీ షాక్ తగిలింది.

FOLLOW US: 
Share:

భారత్‌తో మూడో టెస్టుకు ముందు ఆతిథ్య ఇంగ్లాండ్‌కు భారీ షాక్ తగిలింది. గాయంతో ఆ జట్టు పేస్ బౌలర్ మార్క్‌వుడ్ మూడో టెస్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. 

ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో భారత్ X ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టెస్టులో ఫీల్డింగ్ చేసే సమయంలో మార్క్‌వుడ్ కిందపడ్డాడు. ఆ సమయంలో అతడి కుడి భుజానికి గాయమైంది. వైద్యుల పర్యవేక్షణలో ఉన్న మార్క్‌వుడ్ కోలుకోలేదు. దీంతో అతడు మూడో టెస్టుకు దూరమయ్యాడు. ఇప్పటికే ఆ జట్టుకు స్టువర్ట్ బ్రాడ్, జోఫ్రా ఆర్చర్ లాంటి ప్రధాన బౌలర్లు లేరు. అలాగే మానసిక సమస్యల కారణంగా బెన్ స్టోక్స్ మొత్తం సిరీస్‌కే దూరమయ్యాడు. 

Also Read: Arshi Khan Engagement: క్రికెటర్‌తో నిశ్చితార్థం రద్దు చేసుకున్న నటి... కాబోయేవాడు భారతీయడై ఉంటాడు

ఇప్పుడు ఈ టెస్టుకు మార్క్‌వుడ్ కూడా దూరం కావడం ఆ జట్టుకు గడ్డుకాలమే. మూడో టెస్టు  అనంతరం మరోసారి మార్క్‌వుడ్‌కి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అప్పటికి పూర్తిగా కోలుకుంటే నాలుగో టెస్టులో ఆడే అవకాశం ఉంటుంది. మూడో టెస్టు కోసం ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టు ప్రకటించింది. మరి ఇప్పుడు మార్క్‌వుడ్ స్థానంలో జట్టులోకి ఎవరు వస్తారో చూడాలి. 

క్రిస్ వోగ్స్ కూడా గాయం కారణంగా దూరమయ్యాడు. అతడు కోలుకుని ఎప్పుడు జట్టులోకి  వస్తాడో తెలియదు. ఇప్పటికే ప్రకటించిన జట్టులో మహ్మూద్, ఓవర్టన్ ఉన్నారు. వీరిద్దరిలో ఒకరు తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో మహ్మూద్ మంచి ప్రదర్శన చేశాడు. దీంతో అతడికే తుది జట్టులో చోటు దక్కే అవకాశం దక్కే అవకాశం ఉందని అనుకుంటున్నారు. 

Published at : 23 Aug 2021 08:56 PM (IST) Tags: IND vs ENG Mark Wood Ind vs Eng 3rd Test mark wood injury Mark Wood news

ఇవి కూడా చూడండి

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం-సత్తా చాటిన ఎయిర్ పిస్టల్ టీమ్

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం-సత్తా చాటిన ఎయిర్ పిస్టల్ టీమ్

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

IND vs AUS 3rd ODI: రోహిత్‌ మెరుపు సిక్సర్లు! కోహ్లీ హాఫ్‌ సెంచరీ - టార్గెట్‌ దిశగా టీమ్‌ఇండియా!

IND vs AUS 3rd ODI: రోహిత్‌ మెరుపు సిక్సర్లు! కోహ్లీ హాఫ్‌ సెంచరీ - టార్గెట్‌ దిశగా టీమ్‌ఇండియా!

IND vs AUS 3rd ODI: చితక్కొట్టిన కంగారూలు! టీమ్‌ఇండియా టార్గెట్‌ 353

IND vs AUS 3rd ODI: చితక్కొట్టిన కంగారూలు! టీమ్‌ఇండియా టార్గెట్‌ 353

టాప్ స్టోరీస్

ACB Court Judge Himabindu: జడ్జి హిమబిందుపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్, అతనెవరంటే?

ACB Court Judge Himabindu: జడ్జి హిమబిందుపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్, అతనెవరంటే?

రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేష్‌ లడ్డు- 27 లక్షలకు దక్కించుకున్న దయానంద్‌ రెడ్డి

రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేష్‌ లడ్డు- 27 లక్షలకు దక్కించుకున్న దయానంద్‌ రెడ్డి

Bigg Boss Updates: ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఫుడ్ లొల్లి - శివాజీ దుమ్ముదులిపిన శోభా శెట్టి, యావర్ హర్ట్!

Bigg Boss Updates: ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఫుడ్ లొల్లి - శివాజీ దుమ్ముదులిపిన శోభా శెట్టి, యావర్ హర్ట్!

Hyderabad Ganesh Laddu Auction 2023: కోటి 26 లక్షలు పలికిన గణేష్ లడ్డూ, బాలాపూర్‌ రికార్డు బ్రేక్‌, ఎక్కడో కాదండోయ్ మన హైదరాబాదులోనే!

Hyderabad Ganesh Laddu Auction 2023: కోటి 26 లక్షలు పలికిన గణేష్ లడ్డూ, బాలాపూర్‌ రికార్డు బ్రేక్‌, ఎక్కడో కాదండోయ్ మన హైదరాబాదులోనే!