India vs West Indies 3rd ODI Live Streaming: విండీస్‌తో మూడో వన్డే టైమింగ్ మారిందా? జియోలో ఫ్రీ లైవ్ స్ట్రీమింగ్!!
India vs West Indies 3rd ODI Live Streaming: వెస్టిండీస్‌పై వరుసగా రెండు వన్డేలు గెలిచిన టీమ్‌ఇండియా దూకుడు మీదుంది. నేటి మ్యాచ్ వేదిక, టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు మీకోసం!
India vs West Indies 3rd ODI Live Streaming: వెస్టిండీస్‌పై వరుసగా రెండు వన్డేలు గెలిచిన టీమ్‌ఇండియా దూకుడు మీదుంది. థ్రిల్లింగ్ విక్టరీలతో అభిమానులను మురిపించింది. ఇప్పుడు మూడే వన్డేను కైవసం చేసుకొని సిరీస్ క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది. మరోవైపు ఒక్క విజయమైనా అందుకోవాలని కరీబియన్లు తపన పడుతున్నారు. నేటి మ్యాచ్ వేదిక, టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు మీకోసం!
When Does India vs West Indies 3rd ODI match Begin (Date and Time in India)?
భారత్, వెస్టిండీస్ మూడో వన్డే ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరుగుతోంది. వేదిక క్వీన్ పార్క్ ఓవల్. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:00 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. 6:30 గంటలకు టాస్ వేస్తారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
Where to Watch India vs West Indies 3rd ODI match?
భారత్, వెస్టిండీస్ సిరీస్‌ను దూరదర్శన్ స్పోర్ట్స్‌లో వీక్షించొచ్చు. ప్రైవేటు ఛానళ్లు ఈ సిరీస్‌ను ప్రసారం చేయడం లేదు.
How to Watch India vs West Indies 3rd ODI match Live Streaming Online for Free in India?
భారత్, వెస్టిండీస్ మూడో వన్డేను లైవ్ స్ట్రీమింగ్‌లో వీక్షించొచ్చు. ఫ్యాన్‌కోడ్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ వస్తుంది. సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లు నేరుగా లైవ్ స్ట్రీమింగ్‌ను ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని టెలికాం సంస్థలు సైతం స్ట్రీమింగ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. జియో టీవీలో ఉచితంగా చూడొచ్చు.
India vs West Indies Series schedule
వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్ జులై 22న 27న ముగుస్తుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోనే మూడు వన్డేలు జరుగుతాయి. ఆ తర్వాత జులై 29 నుంచి ఐదు టీ20ల సిరీసు మొదలవుతుంది. ఆగస్టు 7న ముగుస్తుంది. తొలి మ్యాచ్‌కు ట్రినిడాడ్‌లోని బ్రయన్ లారా స్టేడియం వేదిక. ఆ తర్వాతి రెండు మ్యాచులకు సెయింట్ కీట్స్‌లోని వార్నర్ పార్క్ ఆతిథ్యం ఇవ్వనుంది. చివరి రెండు మ్యాచులు అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగుతాయి.
India vs West Indies 3rd ODI match Probable XI
భారత్: శిఖర్ ధావన్ (కె), రుతురాజ్ గైక్వాడ్ / ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, అవేశ్ ఖాన్ / ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్
వెస్టిండీస్: షై హోప్, బ్రాండన్ కింగ్, షామ్రా బ్రూక్స్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్, రోమన్ పావెల్, జేసన్ హోల్డర్, అకేల్ హుస్సేన్, అల్జారీ జోసెఫ్, గుడాకేశ్ మోటీ, జేడెన్ సీల్స్
The T20I squad members have arrived here in Trinidad 👋
— BCCI (@BCCI) July 26, 2022
The 5-match T20I series is all set to commence on July 29.#WIvIND #TeamIndia pic.twitter.com/pZLECGOtUu