IND vs WI 1st T20 Highlights: బౌలర్ల దెబ్బకు విండీస్ ఫట్! 68 రన్స్‌తో టీమ్‌ఇండియా హిట్!
IND vs WI 1st T20 Highlights: ఐదు టీ20ల సిరీసులో టీమ్‌ఇండియా శుభారంభం చేసింది. బ్రయన్ లారా స్టేడియం వేదికగా జరిగిన తొలి మ్యాచులో ఘన విజయం సాధించింది. వెస్టిండీస్‌ను 68 రన్స్ తేడాతో చిత్తు చేసింది.
![IND vs WI 1st T20 Highlights: బౌలర్ల దెబ్బకు విండీస్ ఫట్! 68 రన్స్‌తో టీమ్‌ఇండియా హిట్! IND vs WI 1st T20 Highlights India won by 68 runs against west indies Brian Lara Cricket Academy IND vs WI 1st T20 Highlights: బౌలర్ల దెబ్బకు విండీస్ ఫట్! 68 రన్స్‌తో టీమ్‌ఇండియా హిట్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/29/16484d89533744488cf12558659ae0a51659116443_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IND vs WI 1st T20 Highlights: ఐదు టీ20ల సిరీసులో టీమ్‌ఇండియా శుభారంభం చేసింది. బ్రయన్ లారా స్టేడియం వేదికగా జరిగిన తొలి మ్యాచులో ఘన విజయం సాధించింది. వెస్టిండీస్‌ను 68 రన్స్ తేడాతో చిత్తు చేసింది. 191 టార్గెట్ ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టును 122/8 పరుగులకే పరిమితం చేసింది. షమ్రా బ్రూక్స్ (20) టాప్ స్కోరర్. అంతకు ముందు భారత్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (64; 44 బంతుల్లో 7x4, 2x6) హాఫ్ సెంచరీ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ (24; 16 బంతుల్లో 3x4, 1x6) రాణించాడు. దినేశ్ కార్తీక్ (41*; 19 బంతుల్లో 4x4, 2x6) ఫినిషింగ్ టచ్‌తో అలరించాడు.
బౌలింగ్ అదుర్స్
భారీ లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌కు టీమ్‌ఇండియా బౌలర్లు చుక్కలు చూపించారు. కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్తుల్లో బంతులు విసిరారు. పవర్ ప్లే ముగిసే సరికే 3 వికెట్లు పడగొట్టారు. కైల్ మేయర్స్ (15)ను అర్షదీప్, జేసన్ హోల్డర్ (0)ను జడేజా, షమ్రా బ్రూక్స్ (20)ను భువీ పెవిలియన్ పంపించారు. ఈ క్రమంలో నికోలస్ పూరన్ (18), రోమన్ పావెల్ (14), హెట్‌మైయర్ (14) ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నించారు. కానీ భారత బౌలర్లు వారి ఆటలు సాగనివ్వలేదు. కీలక సమయాల్లో ఔట్ చేయడంతో విండీస్ 13.2 ఓవర్లకు 86/7తో నిలిచింది. ఇన్నింగ్స్ వేగం తగ్గడంతో సమీకరణం 30 బంతుల్లో 93గా మారింది. కాసేపు అకేల్ హుస్సేన్ (11), కీమో పాల్ (19) ప్రతిఘటించినా ఏం చేయలేకపోయారు. అర్షదీప్, అశ్విన్, బిష్ణోయ్ తలో 2 వికెట్లు పడగొట్టారు.
హిట్‌మ్యాన్ ఈజ్ బ్యాక్
మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా చిన్న సర్‌ప్రైజ్ ఇచ్చింది! రిషభ్ పంత్ (14)కు బదులుగా సూర్యకుమార్ యాదవ్ ఓపెనింగ్‌కు వచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో (Rohit Sharma) కలిసి దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 28 బంతుల్లో 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 4.4వ బంతికి సూర్యను హుస్సేన్ ఔట్ చేశాడు. మరికాసేపటికే శ్రేయస్ (0)ను మెకాయ్ పెవిలియన్‌కు పంపించాడు. పంత్ సైతం కాసేపే అలరించాడు. హార్దిక్ (1) నిరాశపరిచాడు.
డీకే మెరుపుల్
ఒకవైపు వికెట్లు పడుతున్నా హిట్‌మ్యాన్ మాత్రం మంచి టచ్‌లో కనిపించాడు. సునాయసంగా బౌండరీలు బాదేశాడు. జట్టు స్కోరు 127 వద్ద అతడిని హోల్డర్ ఔట్ చేశాడు. ఆఖర్లో రవిచంద్రన్ అశ్విన్ (13)తో కలిసి దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) రెచ్చిపోయాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు అజేయంగా 25 బంతుల్లో 52 పరుగుల భాగస్వామ్యం అందించాడు. నిలదొక్కుకొనేందుకు కొన్ని బంతులు తీసుకున్న అతడు ఆఖరి రెండు ఓవర్లు సిక్సర్లు, బౌండరీలతో స్కోరును 190/6కు చేర్చాడు.
A commanding performance from India in the first T20I 💪
— ICC (@ICC) July 29, 2022
Watch #WIvIND for FREE on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺 | 📝 Scorecard: https://t.co/2MDSoy6W3V pic.twitter.com/mjU8nFoiB1
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)