Kohli 100 Test Match: వందో టెస్టు వీరుడికి రాహుల్ ద్రవిడ్ స్పెషల్ గిఫ్ట్ - థాంక్స్ చెప్పిన కోహ్లీ
Virat Kohli 100th test: వంద టెస్టుల విరాట్ కోహ్లీకి (Virat Kohli) కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) ప్రత్యేకంగా తయారు చేసిన క్యాప్‌ను (100th test match cap) బహూకరించాడు.
Virat Kohli 100th Test: వంద టెస్టుల ఘనత అందుకున్న విరాట్ కోహ్లీకి (Virat Kohli) టీమ్‌ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) అరుదైన బహుమతి అందించాడు. ప్రత్యేకంగా తయారు చేసిన అతడి వందో టెస్టు మ్యాచు క్యాప్‌ను (100th test match cap) బహూకరించాడు. ఈ గొప్ప సందర్భంలో అనుష్క శర్మ సైతం కోహ్లీ పక్కనే నిలబడి మురిసిపోయింది. మొహాలిలోని ఐఎస్ బింద్రా స్టేడియం ఇందుకు వేదికగా మారింది. మొత్తంగా వందో టెస్టు ఆడుతున్న 12వ భారతీయుడిగా విరాట్ నిలిచాడు.
భారత్, శ్రీలంక మొహాలి వేదికగా తొలి టెస్టులో (IND vs SL frist test) తలపడుతున్నాయి. ఇది కోహ్లీ కెరీర్లో వందో టెస్టు మ్యాచ్. ఈ సందర్భంగా విరాట్‌ను టీమ్‌ఇండియా క్రికెటర్లు, యాజమాన్యం, బీసీసీఐ ప్రత్యేకంగా సత్కరించింది.
బీసీసీఐకి థాంక్స్
'ఇదో ప్రత్యేక సందర్భం. నా కుటుంబ సభ్యులంతా ఇక్కడే ఉన్నారు. బీసీసీఐకి (BCCI) నా ధన్యవాదాలు. చిన్నప్పుడు నేను హీరోగా భావించే వ్యక్తి నుంచి వందో టెస్టు మ్యాచు టోపీ అందుకోవడం నిజంగా అద్భుతం' అని రాహుల్ ద్రవిడ్ నుంచి క్యాప్ అందుకున్నాక కోహ్లీ అన్నాడు. ఎక్కువ మంది టీ20 క్రికెట్‌కు ప్రాధాన్యం ఇస్తున్న వేళ విరాట్ వందో టెస్టు ఆడుతుండటం ప్రత్యేకం. ఈ సమయంలో జట్టు సభ్యులంతా అతడి వెనకే నిలబడి చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేశారు.
దేవుడి దయ
వందో టెస్టుకు ముందు విరాట్ కోహ్లీ మాట్లాడిన వీడియోను బీసీసీఐ గురువారం సోషల్ మీడియాలో ఉంచిన సంగతి తెలిసిందే. 'వంద టెస్టులు (Virat Kohli 100th Test) ఆడతానని అస్సలు అనుకోలేదు. ఇదో సుదీర్ఘ ప్రయాణం. ఆ వంద టెస్టుల మైల్‌స్టోన్ కోసం మేమెంతో క్రికెట్ ఆడాం. ఎంతో అంతర్జాతీయ క్రికెట్ ఆడాను. వందో టెస్టు ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కృతజ్ఞతా భావంతో ఉన్నాను. దేవుడు నాపై దయ చూపించాడు. నా ఫిట్‌నెస్ కోసం ఎంతో శ్రమించాను. ఇది నాకు, నా కుటుంబానికి, నా కోచ్‌కు అత్యంత గొప్ప సందర్భం. ఇందుకు వారెంతో సంతోషిస్తారు. గర్వపడతారు' అని విరాట్ అన్నాడు.
టీమ్ఇండియా తరఫున 100 టెస్టు మ్యాచులు ఆడిన ఆటగాళ్లు ఎవరంటే?
12వ ఆటగాడు
ఇప్పటి వరకు టీమ్‌ఇండియా తరఫున 11 మంది వంద టెస్టులు ఆడారు. సునిల్ గావస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, కపిల్ దేవ్, సచిన్ తెందూల్కర్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ఇషాంత్ శర్మ ఈ రికార్డు సృష్టించారు.
విరాట్ కోహ్లీ 2011లో వెస్టిండీస్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. రెండు ఇన్నింగ్సుల్లో వరుసగా 4, 15 పరుగులు చేశాడు. ఆ తర్వాత అతడి బ్యాటు నుంచి పరుగుల వరద పారింది. 50.39 సగటుతో 7,962 పరుగులు చేశాడు. వందో టెస్టు ఆడుతున్న విరాట్‌కు మాజీ క్రికెటర్లు అభినందనలు తెలియజేశారు.
What a moment to commemorate his 100th Test appearance in whites 🙌🏻
— BCCI (@BCCI) March 4, 2022
Words of appreciation from the Head Coach Rahul Dravid and words of gratitude from @imVkohli👏🏻#VK100 | #INDvSL | @Paytm pic.twitter.com/zfX0ZIirdz
Virat Kohli with Anushka Sharma in the Stadium ❤️
— 🇮🇳A.V.D.H.E.S.H.🕉 (@PlayBoldVk18) March 4, 2022
BCCI Presented a Special Cap to King Kohli on occasion of his 100th Test 👑@imVkohli #VK100 #100thTestForKingKohli pic.twitter.com/9h7Dd4YHgq