IND vs SL, Asia Cup 2022 Live: ఆసియాకప్ నుంచి టీమ్‌ఇండియా ఔట్! లంక చేతిలో ఘోర పరాభవం
IND vs SL asia cup 2022: సూపర్- 4 లో తన రెండో మ్యాచ్ లో నేడు భారత్ శ్రీలంకతో తలపడుతోంది. ఈ మ్యాచ్ టీమిండియాకు కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ఫైనల్ తలుపులు తెరిచి ఉంటాయి.
LIVE
Background
IND vs SL Asia Cup 2022:ఆసియా కప్ 2022లో టీమ్‌ఇండియా, శ్రీలంక తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ రోహిత్ సేనకు అత్యంత కీలకం. ఇందులో ఓడిపోతే దాదాపుగా ఇంటికెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గెలిస్తేనే ఫైనల్‌కు వెళ్లే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
బ్యాటింగ్ ఓకే.. .. కానీ
పాక్ తో మ్యాచ్ లో ఓపెనర్లు ధనాధన్ బ్యాటింగ్ చేశారు. తొలి 6 ఓవర్లలో ఫీల్డింగ్ పరిమితులను ఉపయోగించుకుని వేగంగా పరుగులు రాబట్టారు. అయితే రోహిత్, రాహుల్ మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచాల్సి ఉంది. విరాట్ కోహ్లీ ఫాం అందుకోవడం భారత్ కు కలిసొచ్చే అంశం. ఆడిన 3 మ్యాచ్ ల్లోనూ కోహ్లీ మంచి పరుగులు చేశాడు. అయితే ఇంకా వేగంగా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. పాక్ తో మ్యాచ్ లో మిడిలార్డర్ వైఫల్యం కూడా కొంపముంచింది. పంత్, పాండ్య, దీపక్ హుడా పెద్దగా పరుగులు చేయలేదు. ఈ మ్యాచ్ లో కీపర్ రిషబ్ పంత్ కు బదులు దినేశ్ కార్తీక్ ను తీసుకుంటారేమో చూడాలి.
బౌలింగ్ తీరు మారాలి
బ్యాటింగ్ లో ఫామ్ చూపిస్తున్న భారత్ ను బౌలింగ్ విభాగం కలవరపెడుతోంది. గాయాలతో బుమ్రా, హర్షల్ పటేల్ టోర్నీకి ముందే దూరమవటంతో బౌలింగ్ విభాగం బలహీనపడింది. జడేజా మధ్యలో గాయపడి అందుబాటులో లేకుండా పోయాడు. అర్హదీప్ బాగానే బౌలింగ్ చేస్తున్నా, అవేష్ ఖాన్ అంతగా రాణించట్లేదు. ప్రధాన స్పిన్నర్ చహాల్ వికెట్లు తీయలేకపోతున్నాడు. గత మ్యాచ్ లో ఆరో బౌలర్ లేనిలోటు స్పష్టంగా కనిపించింది. హుడా స్పిన్ వేయగలిగినా రోహిత్ అతన్ని ఉపయోగించుకోలేదు. జడేజా స్థానంలో ఎంపికైన అక్షర్ పటేల్ ను ఈరోజు ఆడిస్తారేమో చూడాలి. అతను టీంలోకి వస్తే రవి బిష్ణోయ్ పెవిలియన్ కే పరిమితం అవ్వాల్సి ఉంటుంది. అలాగే విఫలమవుతున్న చహాల్ స్థానంలో అశ్విన్ ను తీసుకుంటారేమో చూడాలి. ఏదేమైనా బౌలింగ్ విభాగం రాణించకపోతే గెలవడం కష్టమే.
లంక చేతిలో భారత్ ఓడితే పైనల్ దారులు దాదాపు మూసుకుపోయినట్లే. చివరి మ్యాచ్ లో అఫ్గాన్ పై నెగ్గినా చాలా సమీకరణాలు కలిసిరావాలి. కాబట్టి అంతవరకు రాకుండా ఉండాలంటే బలహీనతల్ని అధిగమించి, సమష్టిగా ఆడి శ్రీలంకపై గెలవాలి.
పిచ్ పరిస్థితి
దుబాయ్ పిచ్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉంది. మొదట టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ కు మొగ్గుచూపొచ్చు.
గత రికార్డు
ఇప్పటివరకూ శ్రీలంక- భారత్ 25 టీ20ల్లో తలపడ్డాయి. అందులో 17 మ్యాచుల్లో టీమిండియా గెలిచింది. ఏడింట్లో లంక విజయం సాధించగా.. ఒక దాంట్లో ఫలితం తేలలేదు.
భారత్ తుది జట్టు (అంచనా)
రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్, పంత్ దినేశ్ కార్తీక్, పాండ్య, భువనేశ్వర్ కుమార్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్ రవి బిష్ణోయ్, అర్హదీప్ సింగ్, చహాల్ అశ్విన్.
శ్రీలంక తుది జట్టు (అంచనా)
నిశాంక్, కుశాల్ మెండిస్, అసలంక, గుణతిలక, భానుక రాజపక్స, దసున్ శనక (కెప్టెన్), హసరంగ, చామిక కరుణరత్నే, తీక్షణ, దిల్షాన్, మదుశంక.
ఆసియాకప్ నుంచి టీమ్‌ఇండియా ఔట్! లంక చేతిలో ఘోర పరాభవం
కోరుకున్నది ఒకటి! జరిగింది మరొకటి! ఆసియాకప్‌ను 8వ సారి గెలవాలన్న టీమ్‌ఇండియా ఆశలు నెరవేరలేదు. శ్రీలంకతో జరిగిన సూపర్-4 మ్యాచులో హిట్‌మ్యాన్ సేన ఊహించని రీతిలో ఓటమి పాలైంది. 173 పరుగుల్ని కాపాడుకోలేక 6 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది.
12 బంతుల్లో 21 కొట్టాలి! టీమ్‌ఇండియా దడ!
టీమ్‌ఇండియా పరిస్థితి అటో.. ఇటో తేలిపోనుంది. 18 ఓవర్లకు శ్రీలంక 153-4తో నిలిచింది. దసున్ శనక (22), రాజపక్స (19) దూకుడుగా ఆడుతున్నారు. ఆ జట్టు 12 బంతుల్లో 21 పరుగులు చేస్తే గెలిచేస్తుంది. ఇక ఆశలన్నీ భువీపైనే ఉన్నాయి.
అటా.. ఇటా! మ్యాచులో టెన్షన్ టెన్షన్!
16 ఓవర్లకు లంక 132-4తో నిలిచింది. భానుక రాజపక్స (17) సిక్సర్లు బాదుతున్నాడు. శనక (4) అతడికి తోడుగా ఉన్నాడు. ఆ జట్టుకు 24 బంతుల్లో 42 పరుగులు కావాలి. టీమ్‌ఇండియా కట్టుదిట్టంగా బంతులు వేయకపోతే గెలవడం చాలా కష్టం.
మరో వికెట్ పడింది! ఆశలు చిగురిస్తున్నాయి
14 ఓవర్లకు లంక 110-3తో ఉంది. 13.5వ బంతికి గుణతిలక (1)ను అశ్విన్ ఔట్ చేశాడు. భానుక రాజపక్స (0), మెండిస్ (57) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ ఏదైనా చేయగల సమర్థులే! వీరున్నంత వరకు భారత్‌కు గెలుపుపై ఆశలు తక్కువే!
చాహల్ ఓవర్లో 2 వికెట్లు: 12 ఓవర్లకు లంక 98-2
కొద్దిగా ఆశలు చిగురిస్తున్నాయి. చాహల్ వేసిన 12వ ఓవర్లో శ్రీలంక 2 వికెట్లు చేజార్చుకుంది. తొలి బంతికి ఓపెనర్ పాథుమ్ నిసాంక (52), నాలుగో బంతికి చరిత్ అసలంక (0) ఔటయ్యారు. ప్రమాదకర కుశాల్ మెండిస్ (46), దనుష్క గుణతిలక (౦) క్రీజులో ఉన్నారు.