Ind vs SA, 2 Innings Highlights: పంత్ వన్ మ్యాన్ షో.. ఆలౌటైన టీమిండియా.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఇదే!
IND vs SA, 3rd Test, Newlands Cricket Ground: కేప్‌టౌన్ టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో దక్షిణాఫ్రికా ముందు 212 పరుగుల లక్ష్యం నిలిచింది.
![Ind vs SA, 2 Innings Highlights: పంత్ వన్ మ్యాన్ షో.. ఆలౌటైన టీమిండియా.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఇదే! IND vs SA, 3rd Test: South Africa need 212 runs to win against India Lunch Day 3 Newlands Cricket Ground Ind vs SA, 2 Innings Highlights: పంత్ వన్ మ్యాన్ షో.. ఆలౌటైన టీమిండియా.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఇదే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/13/91a5446ecdd7749151b26555e7ab6ff2_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కేప్‌టౌన్ టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో దక్షిణాఫ్రికా ముందు 212 పరుగుల లక్ష్యం నిలిచింది. రిషబ్ పంత్ (100 నాటౌట్: ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) సెంచరీ సాధించాడు. ఇన్నింగ్స్‌లో తనే టాప్ స్కోరర్. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ నాలుగు వికెట్లు తీయగా.. కగిసో రబడ, లుంగి ఎంగిడి మూడేసి వికెట్లు తీశారు.
13 పరుగుల స్వల్ప ఆధిక్యంతో భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆరు ఓవర్లలోనే ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (7: 15 బంతుల్లో, ఒక ఫోర్), కేఎల్ రాహుల్ (10: 22 బంతుల్లో, రెండు ఫోర్లు) అవుటయ్యారు. ఆ తర్వాత పుజారా, కోహ్లీ కలిసి మరో వికెట్ పడకుండా రెండో రోజును ముగించారు.
మూడో రోజు ఆట ప్రారంభం కాగానే.. మొదటి రెండు ఓవర్లలో చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే అవుటయ్యారు. ఈ దశలో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 94 పరుగులు జోడించిన అనంతరం విరాట్ కోహ్లీని అవుట్ చేసి లుంగి ఎంగిడి భారత్‌ను గట్టి దెబ్బ కొట్టాడు.
ఒకవైపు రిషబ్ పంత్ నిలకడగా ఆడుతున్నా.. మరో ఎండ్‌లో సహకారం అందించేవారు కరువయ్యారు. తొమ్మిది వికెట్లు పడ్డాక రిషబ్ పంత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత బుమ్రా కూడా అవుట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్‌కు తెర పడింది.
The rest of the Indian batters 👉 70 runs
— ICC (@ICC) January 13, 2022
Rishabh Pant 👉 100*
What a knock 👏
Watch #SAvIND live on https://t.co/CPDKNxpgZ3 (in select regions)#WTC23 | https://t.co/Wbb1FE2mW1 pic.twitter.com/cj8oyz7Dsl
That will be Tea on Day 3 of the 3rd Test.@RishabhPant17 brings up a fantastic ton as #TeamIndia post a total of 198 in the second innings.
— BCCI (@BCCI) January 13, 2022
Over to the bowlers now.
Scorecard - https://t.co/yUd0D0YyB7 #SAvIND pic.twitter.com/aegWfv554C
Also Read: IPL New Sponsor: వివో ఔట్! ఇకపై 'టాటా ఐపీఎల్'! చైనా కంపెనీకి గుడ్‌బై!!
Also Read: IPL Auction 2022 Date: క్రికెటర్లూ కాచుకోండి! ఇక డబ్బుల పండగే!! ఫిబ్రవరి 12, 13న ఐపీఎల్ మెగా వేలం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)