By: ABP Desam | Updated at : 11 Jan 2022 02:08 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ind-vs-sa-3rd-test
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమ్‌ఇండియా టాస్ గెలిచింది. కేప్‌టౌన్ ఆతిథ్యమిస్తున్న ఈ మ్యాచులో కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జట్టులో రెండు మార్పులు జరగాయని చెప్పాడు. తాను ఫిట్‌గా ఉన్నానని పేర్కొన్నాడు. హనుమ విహారి స్థానంలో తాను, మహ్మద్ సిరాజ్ బదులు ఉమేశ్ యాదవ్ జట్టులోకి వచ్చారని వెల్లడించాడు. ఈ మ్యాచు కోహ్లీ కెరీర్లో 99వది. మూడు టెస్టుల సిరీసులో తొలి మ్యాచులో భారత్, రెండో మ్యాచులో సఫారీ జట్టు గెలిచాయి. సిరీస్ 1-1తో సమం కావడంతో గెలిచిన వారు విజేతగా ఆవిర్భవిస్తారు. టీమ్‌ఇండియా ఈ సిరీసులో వరుసగా మూడో టాస్ గెలవడం ప్రత్యేకం.
🚨 Toss Update from Cape Town 🚨
— BCCI (@BCCI) January 11, 2022
Virat Kohli has won the toss & #TeamIndia have elected to bat against South Africa in the third #SAvIND Test.
Follow the match ▶️ https://t.co/rr2tvBaCml pic.twitter.com/d4pwOM8OyF
'ఆకాశంలో మబ్బులను మనం నియంత్రించలేం. పిచ్‌పై పచ్చిక ఉంది. మాకా విషయం తెలుసు. పరుగులు చేస్తే ఫలితం వస్తుంది. మా బౌలర్ల ప్రతిభను ఉపయోగించుకొనే ముందు మేం పరుగుల వరద పారించాలి. అదృష్టవశాత్తు నా వెన్నునొప్పి త్వరగానే తగ్గిపోయింది. రెండో టెస్టురోజు ఉదయమే దాని గురించి తెలిసింది. దాంతో విహారి జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా ఈ టెస్టులో సిరాజ్ ఆడటం లేదు. ఉమేశ్ చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. మా రిజర్వు బెంచీ బలంగా ఉంది' అని కోహ్లీ అన్నాడు.
A look at #TeamIndia's Playing XI for the third Test 🔽
— BCCI (@BCCI) January 11, 2022
Follow the game here - https://t.co/rr2tvBaCml #SAvIND pic.twitter.com/7Z8Ms8a82w
స్నేహితులు, కుటుంబ సభ్యులు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినందుకు టీమ్‌ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ కృతజ్ఞతలు తెలిపాడు. వయసును గుర్తు చేయడం బాగుందన్నాడు. 'చివరి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 240 పరుగులను ఛేదించడం కష్టమైన లక్ష్యమే! పిచ్ మేం అనుకున్నట్టు ప్రవర్తించలేదు. మా బౌలర్ల ఎత్తూ ఒక విధంగా ప్రభావం చూపింది. ఏదేమైనా సఫారీ జట్టు తెలివిగా ఆడింది. మేం తొలి ఇన్నింగ్స్‌లో ఎక్కువ పరుగులు చేస్తే రెండో ఇన్నింగ్స్‌లో షాట్ల ఎంపిక బాగుండాలి. మా బౌలర్లు ఏదైనా సాధించగలరు' అని ద్రవిడ్ అన్నాడు.
Also Read: ప్రపంచకప్ గెలిపించినోడు..! ఆఖరి బంతిని చూడలేక వణికిపోయాడు!!
Also Read: ధోనిని కించపరుస్తూ కేకేఆర్ ట్వీట్.. జడ్డూ దిమ్మదిరిగే రిప్లై.. అది కేవలం షో ఆఫ్ మాత్రమే!
🚨 TEAM ANNOUNCEMENT
— Cricket South Africa (@OfficialCSA) January 11, 2022
No changes made to the line-up as Kagiso Rabada earns his 50th Test cap for the #Proteas👏
📺 Catch the action live on SuperSport Grandstand and SABC 3
📝 Ball by Ball: https://t.co/LeAMM1NVtM#SAvIND #FreedomTestSeries #BetwayTestSeries #BePartOfIt pic.twitter.com/4qX8IDlC76
IND VS AUS: రెండో సెషన్లో ఆస్ట్రేలియా పైచేయి - అర్థ సెంచరీ సాధించిన ట్రావిస్ హెడ్!
WTC Final 2023: టీమ్ఇండియాతో ఆసీస్ టఫ్ ఫైట్ - లంచ్ టైమ్‌కు కంగారూలు 73/2
WTC Final 2023: ఫైనల్ టాస్ టీమ్ఇండియాదే! ఆసీస్ తొలి బ్యాటింగ్
WTC Final 2023: కింగ్ కోహ్లీ ఏంటీ! వార్నర్‌ను ఇంతలా పొగిడేస్తున్నాడు..!
WTC Final: ప్రతిసారీ స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ అవసరం లేదు - సచిన్ నోట ఇలాంటి మాటా!!
Lokesh Rayalaseema Declaration : రాయలసీమ అభివృద్ధికి టీడీపీ డిక్లరేషన్ - అవన్నీ చేస్తే రత్నాల సీమే !
YS Viveka Case : వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి
కోలీవుడ్ కాలింగ్ - శ్రీలీల డేట్స్ కోసం తమిళ నిర్మాతలు వెయిటింగ్
Noise Buds Trance: రూ. వేయి లోపే ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్ - లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్ నాయిస్!