X

Ind vs NZ, 2nd Test Match Highlights: ఇంకొక్క 5 వికెట్లే..! WTC-2లో తొలి విజయానికి చేరువైన కోహ్లీసేన

మరో ఐదు వికెట్లు తీస్తే న్యూజిలాండ్‌పై కోహ్లీసేన గెలుపు బావుటా ఎగరేస్తుంది. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌-2లో బోణీ చేయనుంది.

FOLLOW US: 

ముంబయి టెస్టులో టీమ్‌ఇండియా విజయం ఖాయమే. ఈ మ్యాచులో కోహ్లీసేన విజయాన్ని అడ్డుకోవాలంటే న్యూజిలాండ్‌ అద్భుతమే చేయాలి. రోజులు బ్యాటింగ్‌ చేయాలి. మిగిలిన వికెట్లను కాపాడుకోవాలి. టీమ్‌ఇండియాకు మాత్రం మరో ఐదు వికెట్లు చాలు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌-2లో తొలి విజయం దక్కుతుంది. గెలుపు బోణీతో అభిమానులను మురిపించనుంది.

రెండో ఇన్నింగ్స్‌లో 540 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన న్యూజిలాండ్‌ను రవిచంద్రన్‌ అశ్విన్‌ (3/27) భారీ దెబ్బకొట్టాడు. అతడు కీలకమైన వికెట్లు తీయడంతో మూడో రోజు ఆట ముగిసే సరికి కివీస్‌ 140/5తో నిలిచింది. రచిన్‌ రవీంద్ర (2 బ్యాటింగ్‌; 23 బంతుల్లో), హెన్రీ నికోల్స్‌ (36 బ్యాటింగ్‌; 86 బంతుల్లో 7x4) అజేయంగా నిలిచారు.

డరైల్‌ మిచెల్‌ (60; 92 బంతుల్లో 7x4, 2x6) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. టామ్‌ లేథమ్‌ (6), రాస్‌ టేలర్‌ (6), టామ్‌ బ్లండెల్‌ (0) నిరాశ పరిచారు. విల్‌ యంగ్‌ (20) ఫర్వాలేదనిపించాడు. కివీస్‌ గెలవాలంటే చివరి రెండు రోజుల్లో 400 పరుగులు చేయాలి. డ్రా చేసుకోవాలంటే 5 వికెట్లను రెండు రోజులు కాపాడుకోవాలి. అది జరిగే పనికాదు!

ఫామ్‌లోకి వచ్చినట్టే!

ఓవర్‌నైట్ స్కోరు 69/0తో మూడోరోజు టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ ఆరంభించింది. 38 పరుగులతో క్రీజులోకి వచ్చిన ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (62; 108 బంతుల్లో 9x4, 1x6) అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన అతడు రెండో ఇన్నింగ్స్‌ అర్ధశతకం సాధించాడు. అతడికి తోడుగా 29 పరుగులతో బ్యాటింగ్‌ చేపట్టిన చెతేశ్వర్‌ పుజారా (47; 97 బంతుల్లో 6x4, 1x6) త్రుటిలో అర్ధశతకం చేజార్చుకున్నాడు. ఈ ఇద్దరినీ కివీస్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేలే ఔట్‌ చేయడం గమనార్హం. జట్టు స్కోరు 107 వద్ద మయాంక్‌, 115 వద్ద పుజారాను అతడు పెవిలియన్‌ పంపించాడు.

ఓపెనర్లు ఔటయ్యాక శుభ్‌మన్‌ గిల్‌ (47; 75 బంతుల్లో 4x4, 1x6), విరాట్‌ కోహ్లీ (36; 84 బంతుల్లో 1x4, 1x6) కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. మూడో వికెట్‌కు 144 బంతుల్లో 84 పరుగుల భాగస్వామ్యం అందించారు. వీరిద్దరూ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. కీలక సమయంలో అర్ధశతకం ముందు గిల్‌ను రచిన్‌ రవీంద్ర ఔట్‌ చేయడంతో ఈ జోడీ విడిపోయింది. ఆ తర్వాత ఆరు పరుగుల వ్యవధిలోనే శ్రేయస్‌ అయ్యర్‌ (14), విరాట్‌ కోహ్లీ ఔటయ్యారు. అయితే అక్షర్‌ పటేల్‌ (41*; 26 బంతుల్లో 3x4, 4x6)  వేగంగా ఆడి సిక్సర్లు బాదేయడంతో టీమ్‌ఇండియా 276/7కి డిక్లేర్‌ చేసింది. మొత్తంగా కివీస్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ ఈ మ్యాచులో 14 వికెట్లు తీశాడు.

Also Read: Ajaz Patel: అభిమానం అంటే భారత్‌దే.. అజాజ్‌కు స్టాండింగ్ ఒవేషన్.. అశ్విన్ కూడా!

Also Read: IND vs NZ , Ajaz patel: అజాజ్‌ అదరహో..! ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన భారత సంతతి స్పిన్నర్‌

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Virat Kohli Indian Cricket Team Tom Latham Ind Vs NZ New Zealand cricket team IND vs NZ 2021 IND vs NZ Test series wankhade stadium

సంబంధిత కథనాలు

Ravi shastri on Virat Kohli: విరాట్‌ 3 నెలలు విరామం తీసుకుంటే చాలు.. సెంచరీల వరదే!

Ravi shastri on Virat Kohli: విరాట్‌ 3 నెలలు విరామం తీసుకుంటే చాలు.. సెంచరీల వరదే!

IND vs WI: అనిల్‌ సర్‌ పాఠాలతోనే ఎదిగానన్న రవి బిష్ణోయ్‌! విండీస్‌తో తలపడే టీ20, వన్డే జట్లివే

IND vs WI: అనిల్‌ సర్‌ పాఠాలతోనే ఎదిగానన్న రవి బిష్ణోయ్‌! విండీస్‌తో తలపడే టీ20, వన్డే జట్లివే

Rohit Sharma Health: రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌ టెస్టు పాస్‌.. ఇక 'హిట్టింగే హిట్టింగు'!

Rohit Sharma Health: రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌ టెస్టు పాస్‌.. ఇక 'హిట్టింగే హిట్టింగు'!

Hardik's Pushpa Dance: బామ్మతో శ్రీవల్లి స్టెప్ వేయించిన హార్దిక్.. వైరల్ అవుతున్న వీడియో!

Hardik's Pushpa Dance: బామ్మతో శ్రీవల్లి స్టెప్ వేయించిన హార్దిక్.. వైరల్ అవుతున్న వీడియో!

IPL 2022: ఇండియన్‌ క్రికెట్లో నెక్స్ట్‌ బిగ్‌థింగ్‌ అతడే! కేఎల్‌ రాహుల్‌ జోస్యం నిజమయ్యేనా?

IPL 2022: ఇండియన్‌ క్రికెట్లో నెక్స్ట్‌ బిగ్‌థింగ్‌ అతడే! కేఎల్‌ రాహుల్‌ జోస్యం నిజమయ్యేనా?
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Stock Markets Crash: రక్త మోడుతోంది! సెన్సెక్స్‌ 1300, నిఫ్టీ 400 డౌన్‌.. మదుపర్ల కంటనీరు!!

Stock Markets Crash: రక్త మోడుతోంది! సెన్సెక్స్‌ 1300, నిఫ్టీ 400 డౌన్‌.. మదుపర్ల కంటనీరు!!

Plastic Surgery Tragedy : 75 ఏళ్ల వయసులో ప్లాస్టిక్ సర్జరీ.. బ్రాట్ పిట్ అవుతాడనుకుంటే "ఐ"లో విక్రమ్ అయ్యాడు ! ఇప్పుడు దారేంటి ?

Plastic Surgery Tragedy :  75 ఏళ్ల వయసులో ప్లాస్టిక్ సర్జరీ..  బ్రాట్ పిట్ అవుతాడనుకుంటే

Hyderabad: విడాకులిచ్చినా వదలని మాజీ భర్త.. దగ్గరి బంధువుతో అఫైర్.. కొడుకును తీసుకెళ్లడంతో..

Hyderabad: విడాకులిచ్చినా వదలని మాజీ భర్త.. దగ్గరి బంధువుతో అఫైర్.. కొడుకును తీసుకెళ్లడంతో..

Telangana Govt Vs Governer : ఎంపీ అర్వింద్‌కు ఫోన్ చేసి దాడిపై వాకబు చేసిన గవర్నర్ తమిళిశై ! ప్రభుత్వంతో పెరుగుతున్న దూరం.. బెంగాల్ తరహా పరిస్థితులు వస్తాయా ?

Telangana Govt Vs Governer :  ఎంపీ అర్వింద్‌కు ఫోన్ చేసి దాడిపై వాకబు చేసిన గవర్నర్ తమిళిశై ! ప్రభుత్వంతో పెరుగుతున్న దూరం..  బెంగాల్ తరహా పరిస్థితులు వస్తాయా ?