IND vs ENG, 2nd Innings Highlights: ముగిసిన రెండో రోజు ఆట... భారత్ 2nd ఇన్నింగ్స్ 43/0 ...56 పరుగుల వెనుకంజలో భారత్
India vs England, 2nd Innings Highlights: ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా రెండో రోజు ఆట పూర్తయ్యే సమయానికి వికెట్ ఏమీ నష్టపోకుండా 43 పరుగులు చేసింది.
ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా రెండో రోజు ఆట పూర్తయ్యే సమయానికి వికెట్ ఏమీ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(20), కేఎల్ రాహుల్(22) నాటౌట్‌గా నిలిచారు. టీమ్‌ఇండియా ఇంకా 56 పరుగుల వెనుకంజలో ఉంది. అంతకుముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్, రాహుల్ వికెట్ కాపాడుకుంటూ జాగ్రత్త పడుతూ రెండో రోజు ఆట ముగించారు.
Also Read: Virat Kohli Instagram: సోషల్ మీడియాలో కోహ్లీ సూపర్ ఫామ్.. ఆ ఘనత సాధించిన తొలి ఆసియన్ సెలబ్రిటీ
That's Stumps on Day 2 of the fourth Test at The Oval! #TeamIndia move to 43/0. @klrahul11 2⃣2⃣*@ImRo45 2⃣0⃣*
— BCCI (@BCCI) September 3, 2021
We will see you tomorrow for Day 3⃣ action. #ENGvIND
Scorecard 👉 https://t.co/OOZebP60Bk pic.twitter.com/FyGHxd2SNW
అంతకుముందు ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేయడంలో ఓలీ పోప్ (81; 159 బంతుల్లో 6x4), క్రిస్‌వోక్స్ (50; 60 బంతుల్లో 11x4) అర్ధ శతకాలతో రాణించగా వీరికి జానీ బెయిర్‌స్టో (37; 77 బంతుల్లో 7x4), మొయిన్ అలీ (35; 71 బంతుల్లో 7x4) జత కలిశారు. దీంతో భారత బౌలర్లపై వీరిదే ఆధిపత్యం. దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగుల ఆధిక్యం సాధించింది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 3, బుమ్రా, జడేజా చెరో రెండు వికెట్లు తీసుకోగా... శార్దూల్, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు. టాస్ ఓడిన భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
Also Read: Ind vs Eng: జార్వో మళ్లీ వచ్చాడు... ఈ సారి బౌలర్‌గా... ఎవర్ని ఔట్ చేసేందుకు అంటూ అభిమానుల కామెంట్స్
రోహిత్ శర్మ @ 15000
రోహిత్ శర్మ అరుదైన మైలు రాయిని అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతడు 15వేల పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు
Milestone 🔓 - @ImRo45 breaches the 15K run mark in International Cricket.#TeamIndia pic.twitter.com/st5U454GS6
— BCCI (@BCCI) September 3, 2021