IND vs ENG, 1st Innings Highlights: రాహుల్, జడేజా జోరు.. చివర్లో బుమ్రా మెరుపులు.. అనిల్ కుంబ్లే రికార్డు బద్దలు కొట్టిన అండర్సన్
India vs England, 1st Innings Highlights:
నాటింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచులో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 278 పరుగులకు ఆలౌటైంది. టీమిండియాకు 95 పరుగుల ఆధిక్యం దక్కింది. భారత జట్టులో కేఎల్ రాహుల్(84), రవీంద్ర జడేజా(56) అర్ధ సెంచరీలతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ 4, రాబిన్సన్ 5 వికెట్లు దక్కించుకున్నారు.
191/5తో టీమిండియా లంచ్ విరామానికి వెళ్లింది. మరో 87 పరుగులు చేసి ఆలౌటైంది. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న రాహుల్‌ను పెవిలియన్ పంపాడు అండర్సన్. అప్పటికే రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు రాహుల్. మరో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. క్రీజులో ఉన్న జడేజా ధాటిగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి రాబిన్సన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. చివరిలో బుమ్రా వరుస బౌండరీలతో ఆధిక్యాన్ని మరికొంచెం పెంచాడు.
ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు జడేజా. తన ఖాతాలో సరికొత్త రికార్డును వేసుకున్నాడు. అతి తక్కువ టెస్టుల్లో 200 వికెట్లతో పాటు 2000 పరుగులు చేసిన భారత ఆటగాడిగా ఫీట్ సాధించాడు. ఈ జాబితాలో ఇయాన్ బోథమ్ తొలి స్థానంలో ఉన్నాడు. ఇయాన్ కేవలం 42 టెస్టుల్లోనే ఈ ఘనత వహించాడు. ఆ తర్వాతి స్థానాల్లో కపిల్ దేవ్(50), ఇమ్రాన్ ఖాన్(50), అశ్విన్(51) ఉన్నారు.
Innings Break!#TeamIndia all out for 278.
— BCCI (@BCCI) August 6, 2021
A splendid batting effort from the tail ensures #TeamIndia take a healthy lead of 95 runs.
@klrahul11 top scores with 84, followed by @imjadeja's 56.
Scorecard - https://t.co/TrX6JMiei2 #ENGvIND pic.twitter.com/KMcWH0AseM
అయితే ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో టీమ్‌ఇండియా లెజెండరీ స్పిన్నర్ అనిల్‌కుంబ్లేను అధిగమించాడు. ఈ ఫార్మాట్‌లో ఇప్పటివరకూ అత్యధిక వికెట్లు తీసిన వారిలో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లతో అగ్రస్థానంలో నిలవగా ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ 708 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా దిగ్గజం కుంబ్లే ఇన్నాళ్లూ 619 వికెట్లతో మూడో స్థానంలో నిలిచాడు. అయితే, ఆ రికార్డును అండర్సన్ ఇప్పుడు బద్దలుకొట్టాడు.
The moment Robbo took his first five-wicket haul in Test cricket 👏
— England Cricket (@englandcricket) August 6, 2021
Safe hands @StuartBroad8!
Scorecard/Clips: https://t.co/5eQO5BWXUp@IGcom | #ENGvIND pic.twitter.com/XIcnZY8pNn
A maiden Test five-wicket haul for Robbo!
— England Cricket (@englandcricket) August 6, 2021
Scorecard & Clips: https://t.co/nz2HQMM6bp@IGcom | #ENGvIND pic.twitter.com/j0mnaeefkD