IND vs ENG, 1st Innings Highlights: టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చిన అండర్సన్... మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ భారత్ 78 ఆలౌట్
India vs England, 1st Innings Highlights: ఇంగ్లండ్‌తో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ సేన ఘోరంగా విఫలమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ సేన కేవలం 78 పరుగులకే ఆలౌటైంది.
లీడ్స్ వేదికగా ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరుగుతోన్న మూడో టెస్టులో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే కుప్పకూలింది. తొలి సెషన్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసిన టీమ్‌ఇండియా..రెండో సెషన్‌లో 22 పరుగులు చేసి కూప్పకూలింది. రోహిత్ శర్మ(19) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత రహానె (18) ఉన్నాడు. కేఎల్ రాహుల్(0), పుజారా (1), కోహ్లీ(7), పంత్(2), జడేజా(4) సింగిల్ డిజిట్ పరుగులే చేసి తీవ్ర నిరాశ పరిచారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ 3, ఓవర్టన్ 3, రాబిన్సన్ 2, సామ్ కరన్ 2 వికెట్లు పడగొట్టారు.
Innings Break!#TeamIndia are all out for 78 in the first innings of the 3rd Test.
— BCCI (@BCCI) August 25, 2021
Scorecard - https://t.co/FChN8SV3VR #ENGvIND pic.twitter.com/HR8lhyCyyI
అండర్సన్ అదరహో
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు అండర్సన్ తన బౌలింగ్తో బెంబేలెత్తించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను పెవిలియన్ పంపించిన అండర్సన్ ఆ తర్వాత అదే జోరుతో టాప్ ఆర్డర్‌ను కుప్ప కూల్చాడు.
A well-deserved standing ovation for @jimmy9 and the boys at lunch 👏
— England Cricket (@englandcricket) August 25, 2021
Scorecard/Clips: https://t.co/6l7rCQ2ACi
🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/DzgVX5mXVx
కసితో ఆడారు
ప్రతిష్టాత్మక లార్డ్స్ టెస్టులో ఘోర పరాజయం తర్వాత ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఎంతో కసిగా కనిపించారు. మ్యాచ్‌ని చూసిన వారు ఎవరైనా ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఎంతో కసితో ఆడారో వాళ్లకి స్పష్టంగా కనిపించింది. అండర్సన్ నిప్పులు చెరిగే బంతులు వేస్తూ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. ఆ తర్వాత రాబిన్ సన్, సామ్ కరన్ కూడా అండర్సన్ బాటలోనే నడిచారు. చివర్లో ఓవర్టన్ కూడా ఆఖరి వికెట్లను తీసి టీమిండియాను వరుసగా పెవిలియన్ బాట పట్టించారు. దీంతో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 40.4 ఓవర్లలోనే ఆలౌటవడం గమనార్హం.
What is going on!! 🔥
— England Cricket (@englandcricket) August 25, 2021
Scorecard/Videos: https://t.co/UakxjzUrcE#ENGvIND pic.twitter.com/ldCg1723uv
రోహిత్ ఒంటరి పోరాటం
ఓపెనర్ రోహిత్ శర్మ ఒంటరి పోరాటం చేశాడు. కానీ, అతడికి తోడుగా ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. 105 బంతుల్లో 19 పరుగులు చేశాడంటే... అతడు ఎంత సహనంతో ఆడాడో తెలుస్తుంది.
A hugely deserved ovation for the lads walking off 👏#ENGvIND pic.twitter.com/6zVs2cJed3
— England's Barmy Army (@TheBarmyArmy) August 25, 2021