Ind vs Eng, 2021: కోహ్లీ కోపం చూశారా? డ్రెస్సింగ్ రూమ్ డోర్ పగిలిపోయిందా!
ఇంగ్లాండ్- భారత్ 4వ టెస్టులో విరాట్ కోహ్లీ 44 పరుగులకు ఔటయ్యాడు. అయితే కోహ్లీ ఔటయ్యాక ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
విరాట్ కోహ్లీని రన్ మిషిన్, కింగ్ కోహ్లీ.. ఇలా టీమిండియా ఫ్యాన్స్ ఎన్నో పేర్లతో పిలుస్తుంటారు. అయితే కింగ్ కోహ్లీ ఇటీవల పరుగుల బాటలో వెనుకబడ్డాడు. ముఖ్యంగా 2019 నుంచి ఇప్పటివరకు ఒక్క శతకం కూడా కొట్టకపోవడంతో ఫ్యాన్స్ చాలా నిరాశలో ఉన్నారు. అయితే ఇంగ్లాండ్-భారత్ నాలుగో టెస్ట్ లో కోహ్లీలోనూ ఈ అసహనం కనిపించింది.
Virat Kohli, come back soon King.#ENGvIND pic.twitter.com/ffgRH64FvH
— Neelabh (@CricNeelabh) September 5, 2021
YESSSS Mo! 🙌
— England Cricket (@englandcricket) September 5, 2021
Scorecard/Clips: https://t.co/Kh5KyTSOMS
🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/Weln0WGC9b
Kohli is frustrated. He is upset with himself. I can feel this frustration and anger. Really it's frustrating to see my idol out of his zone. But still I am here and there to support you.
— Nishita Sarma ॐ (@MyLoveVirat18) September 5, 2021
You'll come back stronger, I believe in you Champ @imVkohli ❤️#ViratKohli pic.twitter.com/rTnzcHdknI
డే-4 లంచ్ సెషన్ లో 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. అయితే ఆ టైమ్ లో విరాట్ ఔటడంతో స్టేడియంతో పాటు టీవీ ముందు కూర్చొన్న అభిమానులు కూడా సైలెంట్ అయిపోయారు. కోహ్లీ నిరాశగా పెవిలియన్ చేరాడు. అయితే డ్రెస్సింగ్ రూమ్ లోపలికి వెళ్లే టైంలో కోహ్లీ అక్కడ ఉన్న గ్లాస్ డోర్ ను చేతితో బలంగా కొట్టిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన అభిమానులు కమా బ్యాక్ స్ట్రాంగ్ కోహ్లీ అని ట్వీట్ చేస్తున్నారు.
కోహ్లీ రికార్డ్..
కెప్టెన్ కోహ్లీ ఈ మ్యాచ్ లో మరో అరుదైన రికార్డ్ అందుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 10 వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇంగ్లాండ్ తో జరుగుతోన్న ఓవల్ టెస్ట్ 4వ రోజు ఆటలో 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ ఈ ఘనత సాధించాడు.
తన 210వ ఇన్నింగ్స్ లో కోహ్లీ ఈ మైలురాయిని చేరుకున్నాడు. అయితే సచిన్ తెందూల్కర్, రాహుల్ ద్రవిడ్ ల రికార్డ్ ను మాత్రం బ్రేక్ చేయలేకపోయాడు ఈ రన్ మిషన్.