(Source: ECI/ABP News/ABP Majha)
IND vs ENG, 1st Innings Highlights: దుమ్మురేపిన భారత బౌలర్లు.. 183 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్
India vs England, 1st Innings Highlights
ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా బుధవారం టీమిండియాతో ప్రారంభం అయిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు దుమ్ము లేపారు. వరుస విరామాల్లో చెలరేగడంతో ఆతిథ్య జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది.
టీమిండియా బౌలర్లు చెలరేగడంతో 65.4 ఓవర్లలో 183 పరుగులకే ఆథిత్య ఇంగ్లండ్ జట్టు ఆలౌట్ అయింది. బుమ్రా నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. షమీ మూడు వికెట్లు, శార్దూల్ రెండో వికెట్లు తీశారు. మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీసుకున్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ 64 పరుగులతో సాధించాడు. శామ్ కర్రన్ బ్యాట్ ఝళిపించడంతో ఇంగ్లండ్ జట్టు ఆ స్కోరైనా చేయగలిగింది.
టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టుకు మెుదట్లోనే భారీ షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే పరుగుల ఖాతా తెరవకుండానే.. ఓపెనర్ రోరీ బర్న్స్ ఔటయ్యాడు. టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఐదో బంతికి బర్న్స్ ఎల్బీగా ఔటయ్యాడు.
భారత బౌలర్ల కట్టుదిట్టమైన బంతులేయడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు పరుగులు చేయడానికి కష్టాలు పడ్డారు. డొమినిక్ సిబ్లీ నిదానంగా ఆడగా.. జాక్ క్రాలే కాస్త బ్యాట్ చేలరేగాడు. సిరాజ్ వేసిన 21 ఓవర్ చివరి బంతికి క్రాలే క్యాచ్ ఔట్ అయ్యాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
రోహిత్ శర్మకు జోడీగా కేఎల్ రాహుల్
భారత జట్టులో రోహిత్ శర్మకు జోడీగా ఎవరు ఓపెనర్‌గా వస్తారని ఆసక్తి నెలకొంది. టాస్ అనంతరం కోహ్లీ ప్రకటించిన జట్టులో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. కాంకషన్‌కి గురైన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ స్థానంలో కేఎల్ రాహుల్‌కి ఓపెనర్‌గా ఛాన్స్ ఇచ్చాడు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై వేటు వేశాడు. అలాగే పేసర్ ఇషాంత్ శర్మని పక్కనపెట్టి హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కి చోటిచ్చాడు. ఇక పేస్ ఆల్‌రౌండర్‌గా శార్ధూల్ ఠాకూర్ ఎంపికవగా.. స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై మరోసారి నమ్మకం ఉంచి తుది జట్టులో చోటిచ్చాడు.
మొత్తం 62... ఇంగ్లాండ్ 34... భారత్ ఒకటి
ఇంగ్లాండ్ గడ్డపై భారత్ X ఇంగ్లాండ్ జట్లు ఇప్పటి వరకు 62 సార్లు తలపడ్డాయి. ఇందులో ఆతిథ్య ఇంగ్లాండ్ ఏకంగా 34 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక మిగిలిన 28కిగానూ భారత్ ఏడింట్లో విజయం సాధించగా.. 21 మ్యాచ్‌లు డ్రాగా ముగించింది. చివరిగా జరిగిన ఐదు టెస్టుల్లో ఏకంగా నాల్గింటిలో ఇంగ్లాండ్ విజయం సాధించగా.. కేవలం ఒకే ఒక టెస్టులో భారత్ విజయం సాధించింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు అంత ఫామ్‌లో లేదు. ఇటీవల సొంతగడ్డపై జరిగిన టెస్టులో ఆ జట్టు పరాజయం పాలైంది. ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కూడా కొంతకాలం క్రికెట్ కి విరామం ప్రకటించాడు. ఈ అంశాలన్నీ భారత్ కు కలిసొచ్చేయే. మరి భారత్ ఈ అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకుని టెస్టు సిరీస్ చేజెక్కించుకుంటుందో లేదో చూడాలి.
India (Playing XI): Rohit Sharma, KL Rahul, Cheteshwar Pujara, Virat Kohli(c), Ajinkya Rahane, Rishabh Pant(w), Ravindra Jadeja, Shardul Thakur, Jasprit Bumrah, Mohammed Shami, Mohammed Siraj
England (Playing XI): Rory Burns, Dominic Sibley, Zak Crawley, Joe Root(c), Jonny Bairstow, Daniel Lawrence, Jos Buttler(w), Sam Curran, Ollie Robinson, Stuart Broad, James Anderson