అన్వేషించండి

PM Modi: ‘గెలిచినా, ఓడినా మీరు మా హీరోలు’ -  టీమిండియాకు మద్దతుగా ప్రధాని మోదీ ట్వీట్

World Cup 2023 Final: ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్‌కు అభిమానులు అండగా నిలుస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం భారత్ ఓటమిపై స్పందించారు. 

IND vs AUS Final: ప్రపంచకప్ ఫైనల్లో (World Cup 2023 Final) ఆస్ట్రేలియా (Australia) చేతిలో ఓడిన భారత్‌ (Team India)కు అభిమానులు అండగా నిలుస్తున్నారు. గెలిచినా ఓడినా భారత్‌కు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెబుతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సైతం భారత్ ఓటమిపై స్పందించారు. సోషల్ మీడియా ఎక్స్ (Twitter)లో ఆయన భారత జట్టుకు మద్దతుగా ట్వీట్ చేశారు.  ‘యావత్ దేశం మీతోనే ఉంటుంది.. ఈరోజు, రేపు, ఎలప్పుడూ..’ అని ప్రధాని మోదీ అన్నారు.

ఆటలో గెలుపోటములు సహజం అని, ఓటమి పాలైనంత మాత్రాన నిరుత్సాహ పడిపోవాల్సిన అవసరం లేదని చెబుతూ ప్రధాని మోదీ స్పందించారు. ‘డియర్ టీమిండియా.. ప్రపంచ కప్ లో గొప్ప ప్రదర్శన కనబరిచారు. ఈ టోర్నీ మొత్తం మీ ప్రతిభ, సంకల్పం అద్భుతం, అమోఘం. మీరు గొప్ప స్ఫూర్తితో ఆడారు. దేశం గర్వించేలా చేశారు. ఈ దేశ ప్రజలు ఈరోజు, ఎల్లప్పుడూ మీతో పాటు ఉంటారు’ అంటూ ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 

అలాగే వన్డే వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియాను అభినందించారు ప్రధాని మోదీ. ‘ప్రపంచ కప్ లో అద్భుతమైన విజయం సాధించిన ఆస్ట్రేలియాకు అభినందనలు. ఈ టోర్నమెంట్ లో ప్రశంసనీయమైన ప్రదర్శన చూపారు. అద్భుతమైన విజయాన్ని సాధించారు. ఈరోజు అద్వితీయమైన ఆట ఆడిన ట్రావిస్ హెడ్‌కు నా ప్రత్యేక అభినందనలు’ అని ప్రధాని మోదీ మరొక ట్వీట్‌లో ఆస్ట్రేలియాకు శుభాకాంక్షలు తెలిపారు.

భారత్ ఓటమికి ప్రధాన కారణం ఆసీస్ ఓపెనర్ హెడ్. అద్భుతమైన సెంచరీతో హెడ్ మ్యాచ్‌ను పూర్తిగా కంగారుల వైపు తిప్పేశాడు. ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయినా పట్టు వదలని విక్రమార్కుడిలా హెడ్ క్రీజులో పాతుకు పోయాడు. 120 బంతుల్లో 137 పరుగులు (15*4, 4*6)  చేసి జట్టుకు ఆరో ప్రపంచకప్‌ను అందించాడు. మరో ఎండ్‌లో లబూ షేన్ హాఫ్ సెంచరీతో(110 బంతుల్లో 58 పరుగులు నాటౌట్) అదరగొట్టాడు.

సెప్టెంబర్‌లో సౌతాఫ్రికాలో ట్రావిస్ హెడ్‌కి తీవ్ర గాయమైంది. అతడి చెయ్యి విరిగింది. ఆ గాయం కారణంగా అతడు వరల్డ్ కప్ కు దూరం కావాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, ఆస్ట్రేలియా జట్టు హెడ్‌పై నమ్మకాన్ని వదులుకోలేదు. అతడు ఫిట్‌గా మారి జట్టు కోసం ఆడే వరకు అలాగే అంటిపెట్టుకుంది. తనపై జట్టు ఉంచిన నమ్మకాన్ని హెడ్ వమ్ము చేయలేదు. ఫైనల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టును విశ్వవిజేతగా నిలిపాడు.

టైటిల్ పోరులో ఆసీస్ బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. మిచెల్ స్టార్క్(3-55), పాట్ కమిన్స్(2-34) టీమిండియాను 240 పరుగులకే కట్టడి చేశారు. భారత విజయాలకు బ్రేక్ వేసి కప్ ఎగరేసుకెళ్లారు. 2023 ఛాంపియన్ షిప్, వరల్డ్ కప్ వరకు హెడ్, లబు షేన్ భారత్ ఆశలపై నీరు చల్లుతూనే ఉన్నారు. ఇక వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీ చేసిన ఆస్ట్రేలియా ఆటగాళ్లలో హెడ్ 3వ వాడు. గతంలో 2003 వరల్ కప్ ఫైనల్లో భారత్ పై రికీ పాంటింగ్ శతకం(140) బాదాడు. ఇక 2007 వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంకపై ఆడమ్ గిల్ క్రిస్ట్ సెంచరీ(149) చేశాడు. వారిద్దరి తర్వాత వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీ చేసిన ఆసీస్ క్రికెటర్‌గా ట్రావిస్ హెడ్ ఘనత సాధించాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Look Back 2024: 151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024
151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024
Weather Today : తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
Keerthy Suresh: సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
Embed widget