News
News
X

IND vs AUS 4h Test: శుభ్‌మన్ అదిరెన్.. సెంచరీతో కదం తొక్కిన గిల్.. భారీ స్కోరు దిశగా టీమిండియా

అహ్మదాబాద్ టెస్టులో భారత జట్టు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో కదం తొక్కాడు.

FOLLOW US: 
Share:

IND vs AUS 4h Test: టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (197 బంతుల్లో 103 నాటౌట్, 10x4, 1x6) తాను  ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఈ ఏడాది పరిమిత ఓవర్ల క్రికెట్‌లో  అత్యద్భుత ఫామ్ లో ఉన్న ఈ పంజాబీ కుర్రాడు.. తాజాగా బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో కూడా శతకం బాదాడు.  టెస్టులలో అతడికి ఇది రెండో శతకం కాగా  స్వదేశంలో మొదటిది.   తొలి ఇన్నింగ్స్ లో  రోహిత్ నిష్క్రమణ తర్వాత వచ్చిన  ఛటేశ్వర్  పుజారా  (121 బంతులలో  42, )  కూడా  రాణించాడు.  కానీ టీ సమయానికి ఒక్క ఓవర్ కు ముందు  భారత్ కు మర్ఫీ షాకిచ్చాడు. టీ విరామానికి భారత్..  63 ఓవర్లలో  2 వికెట్ల నష్టానికి  188 పరుగులు చేసింది.  గిల్ తో పాటు విరాట్ కోహ్లీ క్రీజులో ఉన్నాడు. 

గిల్ జిగేల్.. 

ఈ ఏడాది న్యూజిలాండ్‌తో వన్డేలు, టీ20లలో సెంచరీలతో చెలరేగిన  గిల్ ఇప్పుడు ఆస్ట్రేలియాతో కూడా రెచ్చిపోయాడు. తొలి రెండు టెస్టులలో అతడికి అవకాశం రాకున్నా  నిరాశపడకుండా  టీమ్ లో చోటు కోసం ఎదురుచూసిన గిల్.. బంతి బాగా తిరిగిన ఇండోర్ పిచ్ లో  మిగతా బ్యాటర్ల మాదిరిగానే తాను కూడా విఫలమయ్యాడు. కానీ  అహ్మదాబాద్ లో మాత్రం కంగారూలను కంగారెత్తిస్తున్నాడు.  లంచ్‌కు ముందే హాఫ్ సెంచరీ సాధించిన గిల్.. ఆ తర్వాత  కాస్త నెమ్మదించినా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

అర్థ సెంచరీ తర్వాత  గిల్ 80లలోకి వచ్చేవరకూ ఆచితూచి ఆడాడు.  ఆస్ట్రేలియా కెప్టెన్  స్టీవ్ స్మిత్ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా  సహనం కోల్పోకుండా నిలబడ్డాడు. ఇక 80లలోకి వచ్చాక కామెరూన్ గ్రీన్ వేసిన  56 వ ఓవర్లో రెండు బౌండరీలు బాది  90 లలోకి వచ్చాడు.   అదే ఊపులో  మర్ఫీ వేసిన  61 వ ఓవర్లో   రెండో బంతిని ఫోర్ కొట్టి  సెంచరీ పూర్తి చేశాడు.  194 బంతుల్లో అతడి సెంచరీ పూర్తయింది. 

రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. 

రోహిత్ నిష్క్రమణ తర్వాత   పుజారాతో కలిసి శతాధిక భాగస్వామ్యం (113 పరుగులు) జోడించిన పుజారా  టీ విరామానికి ముందు   ఔటయ్యాడు. మర్ఫీ వేసిన  62 వ ఓవర్లో చివరి బంతి పూజారా ప్యాడ్స్ కు తాకింది.  అంపైర్ అవుటిచ్చినా పుజారా రివ్యూకు వెళ్లాడు. కానీ రివ్యూలో అతడికి వ్యతిరేక ఫలితం వచ్చింది. దీంతో   పుజారా నిరాశగా వెనుదిరిగాడు. 

భారీ స్కోరుపై కన్ను.. 

పుజారా నిష్క్రమించిన అనంతరం  క్రీజులోకి భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వచ్చాడు.  కోహ్లీ - గిల్ ల జోడీ ఈ ఏడాది పరిమిత  ఓవర్ల క్రికెట్ లో అద్భుతాలు సృష్టిస్తున్నది. దీనికి న్యూజిలాండ్  తో వన్డే  సిరీసే సజీవ సాక్ష్యం.   బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న ఈ పిచ్ పై  కోహ్లీ నిలదొక్కుకుంటే ఆస్ట్రేలియా  చేసిన 480 పరుగులను అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదు. నేడు మరో సెషన్ ఆటలో భారత్ వికెట్లేమీ కోల్పోకుంటే  300 మార్కు  చేరుకునే అవకాశాలున్నాయి. 

Published at : 11 Mar 2023 03:26 PM (IST) Tags: Shubman Gill ROHIT SHARMA Border Gavaskar Trophy Ahmedabad Test IND vs AUS 4h Test IND vs AUS Live Score

సంబంధిత కథనాలు

Suryakumar Yadav: సూర్యకుమార్‌ 3 వన్డేల్లో 3 డక్స్‌! మర్చిపోతే మంచిదన్న సన్నీ!

Suryakumar Yadav: సూర్యకుమార్‌ 3 వన్డేల్లో 3 డక్స్‌! మర్చిపోతే మంచిదన్న సన్నీ!

IPL 2023: రెస్ట్‌ గురించి అడిగితే.. ఆటగాళ్లు ఫ్రాంచైజీల సొంతమంటున్న రోహిత్‌!

IPL 2023: రెస్ట్‌ గురించి అడిగితే.. ఆటగాళ్లు ఫ్రాంచైజీల సొంతమంటున్న రోహిత్‌!

‘సూర్య’కుమార్ కాదు, ‘శూణ్య’కుమార్- 3 డకౌట్లతో మిస్టర్ 360ని ఆటాడుకుంటున్న నెటిజన్లు

‘సూర్య’కుమార్ కాదు, ‘శూణ్య’కుమార్- 3 డకౌట్లతో మిస్టర్ 360ని ఆటాడుకుంటున్న  నెటిజన్లు

అనుమానమే నిజమయ్యేట్టుంది- కేకేఆర్‌‌తోపాటు భారత్‌కూ షాక్ తప్పేట్టులేదుగా!

అనుమానమే నిజమయ్యేట్టుంది- కేకేఆర్‌‌తోపాటు భారత్‌కూ షాక్ తప్పేట్టులేదుగా!

IPL: ఐపీఎల్‌లో కొత్త రూల్స్- ఈ సీజన్ నుంచే అమలు- అవేంటంటే..!

IPL: ఐపీఎల్‌లో కొత్త రూల్స్- ఈ సీజన్ నుంచే అమలు- అవేంటంటే..!

టాప్ స్టోరీస్

Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి

Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి  బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి

KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం

KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం

Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!

Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!

Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?

Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?