By: ABP Desam | Updated at : 11 Mar 2023 03:24 PM (IST)
Shubman Gill
IND vs AUS 4h Test: టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (197 బంతుల్లో 103 నాటౌట్, 10x4, 1x6) తాను ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఈ ఏడాది పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యద్భుత ఫామ్ లో ఉన్న ఈ పంజాబీ కుర్రాడు.. తాజాగా బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో కూడా శతకం బాదాడు. టెస్టులలో అతడికి ఇది రెండో శతకం కాగా స్వదేశంలో మొదటిది. తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ నిష్క్రమణ తర్వాత వచ్చిన ఛటేశ్వర్ పుజారా (121 బంతులలో 42) కూడా రాణించాడు. కానీ టీ సమయానికి ఒక్క ఓవర్ కు ముందు భారత్ కు మర్ఫీ షాకిచ్చాడు. టీ విరామానికి భారత్.. 63 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. గిల్ తో పాటు విరాట్ కోహ్లీ క్రీజులో ఉన్నాడు.
గిల్ జిగేల్..
ఈ ఏడాది న్యూజిలాండ్‌తో వన్డేలు, టీ20లలో సెంచరీలతో చెలరేగిన గిల్ ఇప్పుడు ఆస్ట్రేలియాతో కూడా రెచ్చిపోయాడు. తొలి రెండు టెస్టులలో అతడికి అవకాశం రాకున్నా నిరాశపడకుండా టీమ్ లో చోటు కోసం ఎదురుచూసిన గిల్.. బంతి బాగా తిరిగిన ఇండోర్ పిచ్ లో మిగతా బ్యాటర్ల మాదిరిగానే తాను కూడా విఫలమయ్యాడు. కానీ అహ్మదాబాద్ లో మాత్రం కంగారూలను కంగారెత్తిస్తున్నాడు. లంచ్‌కు ముందే హాఫ్ సెంచరీ సాధించిన గిల్.. ఆ తర్వాత కాస్త నెమ్మదించినా సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అర్థ సెంచరీ తర్వాత గిల్ 80లలోకి వచ్చేవరకూ ఆచితూచి ఆడాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా సహనం కోల్పోకుండా నిలబడ్డాడు. ఇక 80లలోకి వచ్చాక కామెరూన్ గ్రీన్ వేసిన 56 వ ఓవర్లో రెండు బౌండరీలు బాది 90 లలోకి వచ్చాడు. అదే ఊపులో మర్ఫీ వేసిన 61 వ ఓవర్లో రెండో బంతిని ఫోర్ కొట్టి సెంచరీ పూర్తి చేశాడు. 194 బంతుల్లో అతడి సెంచరీ పూర్తయింది.
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా..
రోహిత్ నిష్క్రమణ తర్వాత పుజారాతో కలిసి శతాధిక భాగస్వామ్యం (113 పరుగులు) జోడించిన పుజారా టీ విరామానికి ముందు ఔటయ్యాడు. మర్ఫీ వేసిన 62 వ ఓవర్లో చివరి బంతి పూజారా ప్యాడ్స్ కు తాకింది. అంపైర్ అవుటిచ్చినా పుజారా రివ్యూకు వెళ్లాడు. కానీ రివ్యూలో అతడికి వ్యతిరేక ఫలితం వచ్చింది. దీంతో పుజారా నిరాశగా వెనుదిరిగాడు.
భారీ స్కోరుపై కన్ను..
పుజారా నిష్క్రమించిన అనంతరం క్రీజులోకి భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వచ్చాడు. కోహ్లీ - గిల్ ల జోడీ ఈ ఏడాది పరిమిత ఓవర్ల క్రికెట్ లో అద్భుతాలు సృష్టిస్తున్నది. దీనికి న్యూజిలాండ్ తో వన్డే సిరీసే సజీవ సాక్ష్యం. బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న ఈ పిచ్ పై కోహ్లీ నిలదొక్కుకుంటే ఆస్ట్రేలియా చేసిన 480 పరుగులను అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదు. నేడు మరో సెషన్ ఆటలో భారత్ వికెట్లేమీ కోల్పోకుంటే 300 మార్కు చేరుకునే అవకాశాలున్నాయి.
CSK vs GT: చెన్నైకి షాకిచ్చిన గుజరాత్ - ఐదు వికెట్లతో ఘనవిజయం!
Mohammed Shami: ఐపీఎల్‌లో 100 వికెట్లు పడగొట్టిన షమీ - చెన్నైపై అద్భుత బౌలింగ్
Kane Williamson Injury: గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ - కేన్ విలియమ్సన్‌కు తీవ్ర గాయం!
Ruturaj Gaikwad: మొదటి మ్యాచ్‌లో రుతురాజ్ వీర విహారం - 23 బంతుల్లోనే అర్థ సెంచరీ!
CSK vs GT, 1 Innings Highlight: గుజరాత్‌కు చుక్కలు చూపించిన రుతురాజ్ - చెన్నై ఎంత కొట్టిందంటే?
AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి
Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్