IND vs AUS: ఇండోర్ టెస్టుకు కీలక ఆటగాళ్లు దూరం - అయినా మెరుగైన ఆస్ట్రేలియా విజయావకాశాలు - ఎలా అంటే?
ఇండోర్ టెస్టుకు పలువురు కీలక ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూరం అయ్యారు. కానీ వారి విజయావకాశాలు మెరుగయ్యాయి.
IND vs AUS 3rd Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో మూడో టెస్టు ఇండోర్‌లో జరగనుంది. ఈ నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఆస్ట్రేలియా జట్టు, మూడో టెస్టుకు ముందు కాస్త కష్టాలు ఎదుర్కొంటుంది. వాస్తవానికి ఈ జట్టులోని ఇద్దరు ఆటగాళ్లు గాయం కారణంగా ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లారు. స్పిన్నర్ అష్టన్ అగర్ కూడా దేశవాళీ టోర్నీ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. వీరితో మరికొందరు ఆటగాళ్లు కూడా ఆస్ట్రేలియాకు తిరిగొచ్చారు. మరి ఇండోర్ టెస్టులో ఆస్ట్రేలియా విజయావకాశాలు ఎలా ఉన్నాయి?
ఆస్ట్రేలియా టెస్టు జట్టు నుంచి డేవిడ్ వార్నర్, జోస్ హేజిల్‌వుడ్, అష్టన్ అగర్‌లను పక్కకి తప్పించారు. జోష్ హాజిల్‌వుడ్, ఆస్టన్ అగర్ గత రెండు టెస్టుల్లో ఎలాగూ తుది జట్టులో భాగం కాలేకపోయారు. డేవిడ్ వార్నర్ మొదటి రెండు టెస్టుల్లోనూ విఫలం అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ముగ్గురు ఆటగాళ్లు ఆస్ట్రేలియాకు తిరిగి రావడం కంగారూ జట్టుపై పెద్దగా ప్రభావం చూపదు.
కెప్టెన్ పాట్ కమిన్స్, మిచెల్ స్వెప్సన్ వ్యక్తిగత కారణాల వల్ల ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చారు. వీరు త్వరలో తిరిగి భారతదేశానికి రానున్నారు. అటువంటి పరిస్థితిలో ఆస్ట్రేలియాకు తుది జట్టు ఎంపిక చేసుకోవడంలో పెద్దగా సమస్య ఉండదు. ఎందుకంటే వారికి తగినన్ని ఆప్షన్లు కూడా ఉన్నాయి. మిచెల్ స్టార్క్, కామెరాన్ గ్రీన్ మూడో టెస్టు ఆడేందుకు ఫిట్‌గా ఉండటం ఆస్ట్రేలియాకు మంచి విషయం. అటువంటి పరిస్థితిలో ఆస్ట్రేలియా జట్టు గత రెండు టెస్టుల కంటే పటిష్టంగా కనిపిస్తుంది.
ఇండోర్ టెస్టులో ఆస్ట్రేలియా గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయి?
నాగ్‌పూర్, ఢిల్లీలో జరిగిన గత రెండు టెస్టుల మాదిరిగానే ఇండోర్‌లో కూడా స్పిన్నర్లకు వికెట్లు పడతాయని భావిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో ఇది ఆస్ట్రేలియాకు ఇబ్బంది కలిగించే అంశం. అయితే ఈ జట్టు గత రెండు టెస్ట్ మ్యాచ్‌ల నుండి చాలా నేర్చుకుంది.
ఇండోర్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా తిరిగి పుంజుకునే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా టాప్-7లో పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడగల అనేక మంది బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు. ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్, పీటర్ హ్యాండ్స్‌కాంబ్‌లలో ఒక్కరు భారీ ఇన్నింగ్స్ ఆడినా ఇండోర్ టెస్టుపై ఆస్ట్రేలియా పట్టు సాధించగలదు.
భారత టాప్ ఆర్డర్‌లో రెగ్యులారిటీ కొరవడిందనే అంశం కూడా ఉంది. గత రెండు టెస్టుల్లో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌ల బ్యాటింగ్ సామర్థ్యం భారత్‌ను ఆదుకుంది. అయితే కచ్చితంగా ఈ ముగ్గురిని పెవిలియన్‌కు పంపేందుకు ఇండోర్‌లోని కంగారూ బౌలర్లు ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేసి ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా కమ్‌బ్యాక్‌ను మనం ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు.
అప్పుడు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ కూడా భారత వికెట్లను బాగా అర్థం చేసుకుని బాగా ఆడగలరు. కాబట్టి ఇండోర్ పిచ్ వారికి కొత్తేమీ కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా నుంచి ఒకట్రెండు భారీ ఇన్నింగ్స్‌లు వస్తే భారత జట్టు కష్టాల్లో పడే అవకాశం ఉంది. కాబట్టి ఇండోర్ టెస్టులో ఫలితం ఎలా అయినా రావచ్చు.