By: ABP Desam | Updated at : 22 Mar 2023 08:44 PM (IST)
మ్యాచ్‌లో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (Image Credits: BCCI)
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ లక్ష్యం వైపుగా సాగుతుంది. 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 25 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 123 పరుగులు సాధించింది. వన్ డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (37 నాటౌట్: 44 బంతుల్లో, ఒక ఫోర్లు, ఒక సిక్సర్), కేఎల్ రాహుల్ (17 నాటౌట్: 41 బంతుల్లో) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో సీన్ అబాట్, ఆడం జంపా చెరో వికెట్ తీసుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌట్ అయింది.
ఓ మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (37: 49 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), రోహిత్ శర్మ (30: 17 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) మొదటి వికెట్‌కు 9.1 ఓవర్లలోనే 65 పరుగులు జోడించారు. రోహిత్ అయితే బౌండరీలు, సిక్సర్లతో చెలరేగాడు. రోహిత్ శర్మను అవుట్ చేసి సీన్ అబాట్ ఆస్ట్రేలియాకు మొదటి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత కాసేపటికే శుభ్‌మన్ గిల్ కూడా ఆడం జంపా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. దీంతో భారత్ 77 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.
అనంతరం విరాట్ కోహ్లీ (37 నాటౌట్: 44 బంతుల్లో, ఒక ఫోర్లు, ఒక సిక్సర్), కేఎల్ రాహుల్ (17 నాటౌట్: 41 బంతుల్లో) కలిసి ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. బౌండరీల కోసం ప్రయత్నించకుండా సింగిల్స్‌తో స్కోరును ముందుకు నడిపించారు. ఇప్పటికి వీరు మూడో వికెట్‌కు అజేయంగా 46 పరుగులు జోడించారు.
అదరగొట్టిన ఆస్ట్రేలియా బ్యాటర్లు
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (33: 31 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), మిషెల్ మార్ష్ (47: 47 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) ఆస్ట్రేలియాకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరు మొదటి వికెట్‌కు కేవలం 10.5 ఓవర్లలోనే 68 పరుగులు జోడించారు. ఈ దశలో ఆస్ట్రేలియాను భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దెబ్బ తీశాడు. ట్రావిస్ హెడ్ వికెట్‌ను తీసి భారత్‌కు మొదటి బ్రేక్ ఇచ్చాడు. అనంతరం తన వరుస ఓవర్లలో మరో ఓపెనర్ మిషెల్ మార్ష్, వన్ డౌన్ బ్యాటర్, కెప్టెన్ అయిన స్టీవ్ స్మిత్‌లను (0: 3 బంతుల్లో) కూడా వెనక్కి పంపాడు. దీంతో ఆస్ట్రేలియా 14.3 ఓవర్లలోనే 85 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరు నాలుగో వికెట్‌కు 40 పరుగులు జోడించారు. క్రమంగా ఇద్దరూ క్రీజులో కుదురుకుంటున్న దశలో ఈసారి కుల్‌దీప్ యాదవ్ ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చాడు. డీప్ మిడ్ వికెట్ వైపు లాఫ్టెడ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన డేవిడ్ వార్నర్ లాంగాఫ్‌లో హార్దిక్ పాండ్యా చేతికి చిక్కాడు. దీంతో ఆస్ట్రేలియా 25 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు నష్టపోయి 126 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మార్నస్ లబుషేన్ (20 నాటౌట్: 35 బంతుల్లో, ఒక సిక్సర్), అలెక్స్ కారీ (1 నాటౌట్: 3 బంతుల్లో) ఉన్నారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యాకు మూడు, కుల్దీప్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కాయి.
Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్
ENG Vs IRE: సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టిన జో రూట్ - ఏ విషయంలో అంటే?
Pat Cummins: 2021 డబ్ల్యూటీసీ ఫైనల్‌పై ప్యాట్ కమిన్స్ వ్యాఖ్యలు - అందుకే ఫైనల్స్‌కు రాలేదంటూ!
ENG vs IRE: బ్యాటింగ్‌కు రాలె - బౌలింగ్ చేయలె - అయినా మ్యాచ్ గెలిచాడు - బెన్ స్టోక్స్ అరుదైన ఘనత
Ben Stokes: ఐర్లాండ్ టెస్టులో బెన్ స్టోక్స్ ప్రత్యేక రికార్డు - ఇప్పటి వరకు ఏ కెప్టెన్ చేయనిది?
Chandrababu Delhi Tour: ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ - పొత్తు కుదురుతుందా?
KCR Nirmal Tour: నేడు నిర్మల్ జిల్లాలో సీఎం కేసీఆర్ టూర్, బహిరంగ సభ కూడా
Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!
Weather Latest Update: తెలంగాణలో ఈవారం ఠారెత్తనున్న ఎండ, ఐఎండీ హెచ్చరిక - ఏపీలో ఈ జిల్లాల్లో వడగాడ్పులు!