By: ABP Desam | Updated at : 22 Mar 2022 07:41 PM (IST)
Edited By: Ramakrishna Paladi
బంగ్లాపై గెలుపు బిగ్ బూస్టే! కానీ తర్వాతి మ్యాచులో ఇండియా ఓడితే సెమీస్ పరిస్థితి ఏంటి?
India Women Cricket Team: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో (ICC Womens Worldcup) మిథాలీ సేన ఆశలు నిలబెట్టుకొంది! సెమీస్ అవకాశాలను పటిష్ఠం చేసుకుంది. బంగ్లాదేశ్‌పై 110 పరుగుల తేడాతో విజయం సాధించడం ఇందుకు దోహదం చేసింది. ఇండియా అమ్మాయిలు (India Womens team) మెగాటోర్నీలో మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ పోరులో ఓడితే పరిస్థితి ఏంటో చూద్దాం?
ఇప్పటివరకు ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా (India Womens cricket team) ఆరు మ్యాచులు ఆడింది. మూడు గెలిచి మూడు ఓడింది. అయితే విజయం సాధించిన మూడింట్లోనూ భారీ తేడాతో గెలవడం మిథాలీ సేనకు కలిసొచ్చింది. తొలి మ్యాచులో పాక్‌పై 107 పరుగులతో ఇండియా దుమ్మురేపింది. వెస్టిండీస్‌నైతే ఏకంగా 155 తేడాతో ఓడించింది. తాజాగా బంగ్లాను 110తో చిత్తు చేసింది. ఇలా భారీ తేడాతో గెలవడం కివీస్ చేతిలో 62 తేడాతో ఓడటం, ఇంగ్లాండ్, ఆసీస చేతిలో వరుసగా 4, 6 వికెట్ల తేడాతో ఓడిన ప్రభావాన్ని తగ్గించింది. + 0.768 తేడాతో మూడో స్థానంలో నిలిచేలా చేసింది.
Koo AppYastika Bhatia scored a half-century, while Sneh Rana came up with all-round heroics (27 and 4/30) in a must-win situation as #India secure a convincing 110-run victory over #Bangladesh in the #ICCWomensWorldCup2022 league match at Seddon Park. Photo: ICC Cricket World Cup/Twitter - IANS (@IANS) 22 Mar 2022
భారత్ లీగ్ దశలో మరొక్క మ్యాచ్ మాత్రమే ఆడాలి. 28న దక్షిణాఫ్రికాతో తలపడాల్సి ఉంది. అందులో గెలిస్తే ఎలాంటి ఫికర్ లేకుండా సెమీస్ దూసుకెళ్లొచ్చు. లేదంటే మన సెమీస్ ఆశలకు అడ్డంగా నిలిచేది కేవలం వెస్టిండీస్ మాత్రమే. ఈ జట్టు ఆరింట్లో మూడు గెలిచి 6 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. వీరికి నెగెటివ్ రన్‌రేట్ (-0.885) ఉండటం టీమ్‌ఇండియాకు అదృష్టంగా మారింది. విండీస్ 24న దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఇప్పటికే ఐదింట్లో 4 గెలిచిన సఫారీలు 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఈ మ్యాచులో సఫారీ జట్టు గెలిస్తే మిథాలీ సేన గెలుపోటములతో సంబంధం లేకుండా సెమీస్ చేరుకుంటుంది.
.@YastikaBhatia notched up her second half-century in the #CWC22 & bagged the Player of the Match award as #TeamIndia beat Bangladesh. 👏 👏 #INDvBAN
— BCCI Women (@BCCIWomen) March 22, 2022
Scorecard ▶️ https://t.co/ZOTtBWYPMe pic.twitter.com/rjMactEHZd
ఒకవేళ విండీస్ గెలిస్తే మాత్రం ఇంగ్లాండ్ తర్వాతి రెండు మ్యాచుల్లో ఓడిపోవాలి. బంగ్లా, పాక్ వారిని ఓడించాలి. అప్పుడు మనం నిశ్చింతగా సెమీస్‌కు వెళ్తాం. లేదా ఒక్కదాంట్లోనైనా ఓడిపోతే రన్‌రేట్‌ను బట్టి పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ ఇవేవీ వద్దనుకుంటే దక్షిణాఫ్రికాను ఓడిస్తే బెటర్! పైగా వారిపై మనకు మంచి రికార్డే ఉంది. అయితే ఈ టోర్నీలో మాత్రం సఫారీలు జోరుగా ఆడుతున్నారు కాబట్టి పక్కాగా ప్లాన్ చేసి గెలవాలి.
మ్యాచులో ఏం జరిగిందంటే: తప్పక గెలవాల్సిన మ్యాచులో అమ్మాయిలు అద్భుతం చేశారు! సెమీస్‌కు వెళ్లాలంటే గెలవాల్సిన మ్యాచులో దుమ్మురేపారు! ఐసీసీ మహిళల వన్డే మ్యాచులో మిథాలీ సేన మూడో విజయం అందుకుంది. బంగ్లాదేశ్‌ను ఏకంగా 110 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 230 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ప్రత్యర్థిని 40.౩ ఓవర్లకు 119కే కుప్పకూల్చింది. స్నేహ్‌రాణా (4/30) తన స్పిన్‌తో బంగ్లా పతనాన్ని శాసించింది. లతా మొండల్ (24), సల్మా ఖాటూన్ (32) టాప్ స్కోరర్లు. అంతకు ముందు టీమ్‌ఇండియాలో యస్తికా భాటియా (50; 80 బంతుల్లో 2x4), షెఫాలీ వర్మ (42; 32 బంతుల్లో 6x4, 1x6) అదరగొట్టారు.
Also Read: బంగ్లా టైగర్స్‌ను చిత్తు చేసిన అమ్మాయిలు - సెమీస్‌కు మంచి ఛాన్స్!
IND VS AUS: ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియా - భారత్ ముందు 444 పరుగుల లక్ష్యం!
IND VS AUS: నాలుగో రోజు లంచ్‌కు భారీ ఆధిక్యంలో ఆస్ట్రేలియా - భారత్ గెలవాలంటే అద్భుతం జరగాల్సిందే!
IND vs AUS, WTC Final 2023: 300కు చేరిన ఆసీస్ ఆధిక్యం - డబ్ల్యూటీసీ ఫైనల్‌పై పట్టు బిగించిన కంగారూలు
WTC Final 2023: నన్ను పెళ్లి చేసుకుంటావా! - గిల్‌కు మ్యాచ్ జరుగుతుండగానే మ్యారేజ్ ప్రపోజల్
Shardul Thakur Record: లార్డ్ శార్దూల్ అంటార్రా బాబూ - దిగ్గజాలకు సొంతమైన రికార్డును సమం చేసిన ఠాకూర్
నేను చూడలా- నేను వినలా..! హాట్ టాపిక్ గా మంత్రి జోగి రమేష్ కామెంట్స్
Telangana News : కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !
భగవంత్ కేసరి టీజర్, రజనీ, అమితాబ్ కాంబినేషన్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
BJP Purandeswari: మోదీ హయాంలో ఈ 9 ఏళ్లలో ఒక్క స్కాం కూడా జరగలేదు: పురంధేశ్వరీ