(Source: ECI/ABP News/ABP Majha)
INDW vs AUSW: ముగ్గురు హాఫ్ సెంచరీలు కొట్టారు కానీ! ఆసీస్ ఓపెనర్ల దూకుడు
INDW vs AUS W: ఆస్ట్రేలియాతో మ్యాచులో టీమ్‌ఇండియా 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ముగ్గురు క్రికెటర్లు అర్ధశతకాలు చేశారు. కానీ ఆసీస్ దూకుడుగా టార్గెట్ను ఛేదిస్తున్నారు.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా అత్యంత కఠినమైన ప్రత్యర్థితో తలపడుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన మిథాలీ సేన 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (10), షెఫాలీ వర్మ (12) విఫలమైన తరుణంలో యస్తికా భాటియా (59; 83 బంతుల్లో 6x4), మిథాలీ రాజ్ (68; 96 బంతుల్లో 4x4, 1x6), హర్మన్ ప్రీత్ కౌర్ (57 నాటౌట్; 47 బంతుల్లో 6x4) హాఫ్ సెంచరీలతో గట్టెక్కించారు. ఆఖర్లో పూజా వస్త్రాకర్ (34; 28 బంతుల్లో 1x4, 2x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది.
టీమ్‌ఇండియా మంచి స్కోరు చేసినప్పటికీ ఆస్ట్రేలియా భయపడటం లేదు. సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదిస్తోంది. 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 88 పరుగులు చేసింది. ఓపెనర్ అలీసా హేలీ (50; 49 బంతుల్లో) హాఫ్ సెంచరీ కొట్టేసింది. రేచెల్ హెయిన్స్ (34) హాఫ్ సెంచరీ వైపు దూసుకుపోతోంది. భారత బౌలర్లు ఇప్పటి వరకు వికెట్ తీయలేదు. వీరిద్దరూ ఇలాగే ఆడితే మిథాలీ సేనకు విజయం దక్కడం డౌటే! ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్లోనూ ఆసీస్ ఓపెనర్లే టీమ్‌ఇండియాను ఓడించారు.
Innings Break!
— BCCI Women (@BCCIWomen) March 19, 2022
Solid show by #TeamIndia to post 2⃣7⃣7⃣/7⃣ on the board! 👏 👏 #CWC22 | #INDvAUS
6⃣8⃣ for captain @M_Raj03
5⃣9⃣ for @YastikaBhatia
5⃣7⃣* for vice-captain @ImHarmanpreet
3⃣4⃣ for @Vastrakarp25
Over to our bowlers now. 👍
Scorecard ▶️ https://t.co/SLZ4bayb4f pic.twitter.com/EAqhkwqL4O
A superb half-century from Harmanpreet Kaur 👏👏#TeamIndia are 257/6 in 48 overs
— BCCI Women (@BCCIWomen) March 19, 2022
2 overs to go - Final score predictions anyone?#CWC22 | #INDvAUS
Follow the match ▶️ https://t.co/SLZ4bayb4f pic.twitter.com/6qQmNcTp0p
5⃣9⃣ Runs
— BCCI Women (@BCCIWomen) March 19, 2022
8⃣3⃣ Balls
6⃣ Fours
A fine knock comes to an end! @YastikaBhatia departs but not before she scored her second WODI fifty & her maiden half-century in the Women's ODI World Cup. 👏 👏 #TeamIndia | #CWC22 | #INDvAUS
Follow the match ▶️ https://t.co/SLZ4bayb4f pic.twitter.com/t2Iugl3kf0