By: ABP Desam | Updated at : 30 Jul 2022 07:26 PM (IST)
Edited By: Ramakrishna Paladi
గురు రాజ్ పుజారీ ( Image Source : ANI )
Gururaj Pujari Wins Bronze: కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు రెండో పతకం వచ్చింది. పురుషుల 61 కిలోల వెయిట్ లిఫ్టింగ్‌లో పి.గురురాజా కాంస్యం సాధించాడు. హోరాహోరీగా జరిగిన పోటీలో 269 కిలోలు ఎత్తాడు. స్నాచ్‌లో 118, క్లీన్ అండ్ జర్క్‌లో 151 కిలోలు ఎత్తి చరిత్ర సృష్టించాడు.
కామన్వెల్త్‌లో గురురాజాకు వరుసగా ఇది రెండో పతకం కావడం గమనార్హం. పోటీ జరుగుతున్నంత సేపు అతడు రెండో స్థానంలోనే కొనసాగాడు. అయితే క్లీన్ విభాగంలో ఆఖరి ప్రయత్నంలో విఫలమవ్వడం రజతం అవకాశాలను దెబ్బతీసింది. అతడిడి కర్ణాటకలోని ఉడిపి జిల్లా. 61 కిలోల విభాగంలో అతడు స్టార్ లిఫ్టర్‌గా బరిలోకి దిగాడు.
బర్మింగ్‌హామ్‌లో తొలిరోజు భారత్‌కు పతకాలేమీ రాలేదు. రెండో రోజు వెయిట్ లిఫ్టర్లు వరుసగా రెండు పతకాలు అందించారు. మొదట 55 కిలోల విభాగంలో సంకేత్ మహాదేవ్ రజతం కొల్లగొట్టాడు. మరికొన్ని గంటలకే గురురాజా కాంస్యం అందించాడు. కాగా మలేసియాకు చెందిన అజ్నిల్ బిన్ బిదిన్ మహ్మద్ రెండు రౌండ్లలోనూ 285 కిలోలు ఎత్తి స్వర్ణం ముద్దాడాడు. కామన్వెల్త్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు.
వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్ మరికొన్ని పతకాలను ఆశిస్తోంది. మహిళల విభాగంలో స్టార్ లిఫ్టర్ మీరాబాయి చాను రాత్రి 8 గంటల తర్వాత బరిలోకి దిగనుంది. 49 కిలోల విభాగంలో పోటీ పడుతోంది. టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె రజతం గెలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడే అదే ప్రదర్శనతో ఆమె పతకం తీసుకురావాలని ఆశిస్తున్నారు. 55 కిలోల విభాగంలో బింద్యా రాణి పైనా అంచనాలు ఉన్నాయి.
2️⃣nd medal for 🇮🇳 at @birminghamcg22 🤩
— SAI Media (@Media_SAI) July 30, 2022
What a comback by P. Gururaja to bag 🥉 with a total lift of 269 Kg in the Men's 61kg Finals🏋♂️ at #B2022
Snatch- 118kg
Clean & Jerk- 151kg
With this Gururaj wins his 2nd consecutive CWG medal 🙂
Congratulations Champ!#Cheer4India pic.twitter.com/UtOJiShUvS
My hearty congratulations to Indian weightlifter Gururaj Poojary for winning a bronze medal in 61kg weight lifting event.
— Aravind Limbavali (@ArvindLBJP) July 30, 2022
It is a great matter of pride to all of us that Poojary is from Udupi dist of our Karnataka.
Congratulations Champ. You have made the country& state proud. pic.twitter.com/jom4tBNgvj
South Africa Squad vs India: భారత్‌తో సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన, బవూమాకు బిగ్ షాక్
IND v AUS: టీం ఇండియా ఆనవాయతీ కొనసాగించిన స్కై , విన్నింగ్ ట్రోఫీ ఎవరికి ఇచ్చాడంటే..
Virat Kohli: కింగ్ కోహ్లీ అంటే అట్లుంటది మరి, ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు
Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్ అరుదైన రికార్డు , ఆసిస్‌పై అన్ని పరుగులు చేయటం తొలిసారట
Sports Award selection committee: క్రీడా పురస్కారాల ఎంపికకు కమిటీ , 12 మంది దిగ్గజాలతో ఏర్పాటు
Janagama ZP Chairman Died: జనగామ జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి మృతి, బీఆర్ఎస్ పార్టీలో విషాదం
Telangana State Corporation Chairmans: తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ల ముకుమ్మడి రాజీనామాలు, సీఎస్ కు లేఖ
Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం
Hyundai Price Hike: 2024లో పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు - ఎందుకు పెరగనున్నాయి? ఎంత పెరగనున్నాయి?
/body>