అన్వేషించండి

French Open 2024: విజయం మనదే, అదరగొట్టిన స్టార్‌ జోడి సాత్విక్‌- చిరాగ్‌

Satwiksairaj Rankireddy and Chirag Shetty: ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో భాగంగా జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో భారత జోడీ విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టుపై సంపూర్ణ ఆధిపత్యాన్ని చెలాయించింది.

Satwiksairaj Rankireddy-Chirag Shetty Clinch Second Title: భారత స్టార్ షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్ శెట్టి (Satwiksairaj Rankireddy-Chirag Shetty) జోడీ ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ 2024 టైటిల్‌ను కైవసం చేసుకుంది. పురుషుల డబుల్స్‌లో చైనీస్‌ తైపీకి చెందిన లీ జే-హువే-యాంగ్‌ పో-హ్సువాన్‌ జోడీపై 21-13, 21-16 తేడాతో విజయం సాధించారు. మ్యాచ్‌లోని రెండు సెట్లలో ఆధిపత్యం ప్రదర్శించింది భారత్ డబుల్స్ జోడీ.. 37 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జోడీ ఆసియా గేమ్స్‌ ఛాంపియన్‌ లీ, యాంగ్‌ జంటపై వరుస సెట్లలో విజయం సాధించి 21-11, 21-17 పాయింట్ల తేడాతో గెలుపొందారు.  సాత్విక్-చిరాగ్‌ జోడికి ఇది 7వ బీడబ్ల్యూఎఫ్ టైటిల్ కాగా ఫ్రెంచ్ ఓపెన్‌ సూపర్ 750 టైటిల్‌ని గెలవడం రెండవసారి. 2019లో కూడా వీరిద్దరూ ఈ టైటిల్‌ని గెలిచారు.

ఫ్రెంచ్ ఓపెన్‌(French Open)లో ప్రపంచ ఛాంపియన్లను సెమీస్‌లో మట్టికరిపించిన భారత జోడి.. సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీఫైనల్లో కంగ్ మిన్‌హైక్, సీయో సుఎంగ్జే జోడిపై సునాయసంగా విజయం సాధించింది. 21-13, 21-16తేడాతో  వరుస సెట్లలో గెలుపొంది ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ గెలుపుతో వ‌రుస‌గా మూడోసారి ఫ్రెంట్‌ ఓపెన్‌ ఫైనల్‌లో అడుగు పెట్టిన జోడీగా రికార్టు సృష్టించింది. 

నెంబర్‌ వన్‌ జోడీ
భారత స్టార్‌ షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి ర్యాంకింగ్స్‌లో మరోసారి సత్తా చాటారు. ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌(World no1 badminton ranking) కైవసం చేసుకుని తమకు  తిరుగులేదని ఇంకొకసారి నిరూపించారు. ఇటీవల నిలకడగా రాణిస్తున్న ఈ జోడీ  బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ ప్రకటించిన డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం దక్కించుకుచుంది. ఈ సీజన్‌లో ఆడిన మలేషియా ఓపెన్‌, ఇండియా ఓపెన్‌లల్లో ఈ జోడి రన్నరప్‌గా నిలిచిన ఈ జంట ఏడాదిన్నర తర్వాత తిరిగి టాప్‌కు చేరింది. సింగిల్స్‌లో ప్రణయ్‌ 8వ ర్యాంక్‌ దక్కించుకోగా లక్ష్యసేన్‌ 19వ స్థానంలో నిలిచాడు.

ఇండియా ఓపెన్‌ టోర్నమెంట్‌లో....
భారత డబుల్స్‌ స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి సొంతగడ్డపై జరుగుతున్న ఇండియా ఓపెన్‌ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచారు. టైటిల్‌ను కైవసం చేసుకునేందుకు ఒక్క అడుగు దూరంలోనే ఆగిపోయినా అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నారు. పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో సాత్విక్‌-చిరాగ్‌ జోడి విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టారు. డబుల్స్‌ సెమీఫైనల్లో టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేతలు... మలేషియాకు చెందిన ఆరోన్ చియా-సోహ్ వూయ్ యిక్‌లపై సాత్విక్‌-చిరాగ్‌ జోడి విజయం సాధించింది. 21-18 21-14తో వరుస సెట్లలో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టారు. ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్ పోరులో రెండో గేమ్‌లో చివరి 12 పాయింట్లలో 11 పాయింట్లు గెలిచిన సాత్విక్‌-చిరాగ్‌ జోడి విజయం సాధించింది. పైనల్లో సాత్విక్‌-చిరాగ్‌ జోడి... మూడో సీడ్‌, కొరియాకు చెందిన కాంగ్ మిన్ హ్యూక్- సియో సీయుంగ్ జేలతో తలపడతారు.

మలేసియా ఓపెన్‌ వరల్డ్‌ టోర్నీలోనూ....
మలేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నీ(Malaysia Open Super 1000 tournament) ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జోడికి ఓటమి ఎదురైంది. ఫైనల్ వరకూ అద్భుతంగా ఆడిన ఈ ద్వయం తుదిమెట్టుపై బోల్తా పడింది. ప్రపంచ రెండో సీడ్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌ శెట్టి జోడి... 21-9, 18-21 17-21 తేడాతో చైనాకు చెందిన వరల్డ్‌ నెంబర్‌ వన్‌ జోడీ వాంగ్‌ – లియాంగ్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఓటమితో భారత జోడి రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Myanmar Earthquake : మయన్మార్ లో భయంకరమైన భూకంపం- 7.2 తీవ్రతతో కంపించిన భూమి
మయన్మార్ లో భయంకరమైన భూకంపం- 7.2 తీవ్రతతో కంపించిన భూమి
Bangkok Earthquake : బ్యాంకాక్‌లో కుప్పకూలిన భవనాలు- పరుగులు పెట్టిన జనాలు- థాయ్‌లాండ్‌లో భూకంప విధ్వంసం
బ్యాంకాక్‌లో కుప్పకూలిన భవనాలు- పరుగులు పెట్టిన జనాలు- థాయ్‌లాండ్‌లో భూకంప విధ్వంసం
China Earthquake: చైనాలో 7.9 తీవ్రతతో భూకంపం- ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు
చైనాలో 7.9 తీవ్రతతో భూకంపం- ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు
Polavaram Project: పోలవరం నిర్వాసితుల్లో కొందరికి 6 లక్షలు, మరికొందరికి 10 లక్షలు.. తేడా ఎందుకో తెలుసా?
పోలవరం నిర్వాసితుల్లో కొందరికి 6 లక్షలు, మరికొందరికి 10 లక్షలు.. తేడా ఎందుకో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kavya Maran Goenka Different Emotions SRH vs LSG IPL 2025 | ఇద్దరు ఓనర్లలో.. డిఫరెంట్ ఎమోషన్స్ | ABP DesamSRH vs LSG Match Strategy Highlights IPL 2025 | హైప్ ఎక్కించుకుంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది | ABP DesamShardul Thakur Bowling Strategy vs SRH IPL 2025 | కాన్ఫిడెన్స్ తోనే సన్ రైజర్స్ కు పిచ్చెక్కించాడుShardul Thakur 4Wickets vs SRH | IPL 2025 లో పర్పుల్ క్యాప్ అందుకున్న శార్దూల్ విచిత్రమైన కథ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Myanmar Earthquake : మయన్మార్ లో భయంకరమైన భూకంపం- 7.2 తీవ్రతతో కంపించిన భూమి
మయన్మార్ లో భయంకరమైన భూకంపం- 7.2 తీవ్రతతో కంపించిన భూమి
Bangkok Earthquake : బ్యాంకాక్‌లో కుప్పకూలిన భవనాలు- పరుగులు పెట్టిన జనాలు- థాయ్‌లాండ్‌లో భూకంప విధ్వంసం
బ్యాంకాక్‌లో కుప్పకూలిన భవనాలు- పరుగులు పెట్టిన జనాలు- థాయ్‌లాండ్‌లో భూకంప విధ్వంసం
China Earthquake: చైనాలో 7.9 తీవ్రతతో భూకంపం- ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు
చైనాలో 7.9 తీవ్రతతో భూకంపం- ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు
Polavaram Project: పోలవరం నిర్వాసితుల్లో కొందరికి 6 లక్షలు, మరికొందరికి 10 లక్షలు.. తేడా ఎందుకో తెలుసా?
పోలవరం నిర్వాసితుల్లో కొందరికి 6 లక్షలు, మరికొందరికి 10 లక్షలు.. తేడా ఎందుకో తెలుసా?
Nagababu Latest News: నాగబాబుకు మంత్రి పదవి మరికొంత ఆలస్యం?
నాగబాబుకు మంత్రి పదవి మరికొంత ఆలస్యం?
Nara Lokesh News: ప్రాణం నిలిపిన లోకేష్ - సొంత డబ్బుతో ప్రత్యేక విమానంలో గుండె తరలింపు 
ప్రాణం నిలిపిన లోకేష్ - సొంత డబ్బుతో ప్రత్యేక విమానంలో గుండె తరలింపు 
Tirumala News: తిరుమల భక్తులకు ప్రత్యేక ఐడీ- గూగుల్‌ ఏఐతో టీటీడీ ఒప్పందం
తిరుమల భక్తులకు ప్రత్యేక ఐడీ- గూగుల్‌ ఏఐతో టీటీడీ ఒప్పందం
Telangana Crime News: డిన్నర తర్వాత నిద్రలోనే ముగ్గురు చిన్నారులు మృతి- కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన తల్లి
డిన్నర తర్వాత నిద్రలోనే ముగ్గురు చిన్నారులు మృతి- కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన తల్లి
Embed widget