French Open 2022: వరల్డ్ నెంబర్ 1కు షాక్, రికార్డు స్థాయిలో 15వ సారి ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్లోకి రఫెల్ నాదల్
Rafael Nadal beats Novak Djokovic: ఫ్రెంచ్ ఓపెన్‌లో తనకు తిరుగులేదని నిరూపించాడు రఫెల్ నాదల్. స్పెయిన్ ఆటగాడు నాదల్ రికార్డు స్థాయిలో 15సారి ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లాడు.
Rafael Nadal beats World No.1 Novak Djokovic: ఫ్రెంచ్ ఓపెన్‌లో మరోసారి ఊహించిందే జరిగింది. మట్టి కోర్టులో రారాజు, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్.. వరల్డ్ నెంబర్ వన్‌కు షాకిచ్చి.. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో 6-2, 4-6, 6-2, 7-6 (7-4) తేడాతో వరల్డ్ నెంబర్ వన్ నొవాక్ జకోవిచ్‌పై విజయం సాధించాడు నాదల్. సెర్బియాకు చెందిన జకోవిచ్ ప్రస్తుతం పురుషుల టెన్నిస్ సింగిల్స్‌లో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్. అయితే, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ లో నాదల్‌ను కొట్టేటోడు లేడు.
🎥 Check out the best moments of @RafaelNadal 's thrilling four-set win over No.1 Novak Djokovic with Highlights by @emirates#RolandGarros | #EmiratesFlyBetterMoments pic.twitter.com/3F2oFCSD00
— Roland-Garros (@rolandgarros) June 1, 2022
ఇంట్రెస్టింగ్ మ్యాచ్..
నాదల్, జకోవిచ్ మధ్య జరిగిన క్వార్టల్ ఫైనల్ మ్యాచ్ మే నెలలో మొదలై జూన్ నెలలో ముగిసిందని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. ఎంతో ఆసక్తికరంగా జరుగుతుందని భావించిన క్వార్టర్ ఫైనల్ సాధారణంగా ముగిసింది. తొలి సెట్ 6-2తో నెగ్గి వరల్డ్ నెంబర్ వన్ జకోవిచ్‌పై నాదల్ పైచేయి సాధించాడు. రెండో సెట్‌లో పుంజుకుని 4-6తో నెగ్గి జకోవిచ్ గేమ్ సమం చేశాడు. అయితే ఆపై వరుసగా రెండు సెట్లను మట్టి కోర్టు రారాజు నాదల్ నెగ్గడంతో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. నాలుగో సెట్‌లో మాత్రం జకోవిచ్ శక్తి మేర పోరాడినా, నాదల్ ఏస్‌లకు, ఫాస్ట్ రిప్లైలకు నెంబర్ వన్ బదులివ్వలేకపోయాడు. తనకు అచ్చొచ్చిన ఫ్రెంచ్ ఓపెన్‌లో మరో టైటిల్ పై కన్నేసిన నాదల్ రికార్డు స్థాయిలో 15వ సారి సెమీఫైనల్ చేరుకున్నాడు. గత ఏడాది సెమీఫైనల్లో ఓటమికి జకోవిచ్‌పై ఈ మ్యాచ్ విజయంతో ప్రతీకారం తీర్చుకున్నాడు నాదల్.
జ్వెరెవ్‌ను ఢీకొట్టనున్న నాదల్..
ఫ్రెంచ్ ఓపెన్ 2022లో మరో క్వార్టర్స్ లో కార్లోస్ అల్కరాస్‌పై విజయంతో అలెగ్జాండర్ జ్వెరేవ్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లోకి ప్రవేశించాడు. ఫైనల్ బెర్త్ కోసం తొలి సెమీఫైనల్లో నాదల్, జ్వెరేవ్ తలపడనున్నారు. నాదల్ ఇదివరకే 13 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ నెగ్గగా.. ఓవరాల్ కెరీర్‌లో 21 టైటిల్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. రోజర్ ఫెదరర్ 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్‌తో తరువాతి స్థానంలో కొనసాగుతున్నాడు.
Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్య - స్టేడియంలో తిరగబడిన సంగ్రామం వాడే!
Also Read: Sanju Samson: నేనేమీ ఎంఎస్ ధోనీ, రాహుల్ ద్రవిడ్‌ను కాదు!