MOR vs POR, FIFA WC 2022: క్రిస్టియానో రొనాల్డోకు షాక్ - పోర్చుగల్‌పై విజయంతో సెమీస్ చేరిన మొరాకో
ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో సెమీ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి ఆఫ్రికన్ జట్టుగా మొరాకో నిలిచింది. క్వార్టర్ ఫైనల్ 1-0 గోల్స్ తేడాతో పోర్చుగల్ పై గెలిచి మొరాకో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది
ఫిఫా వరల్డ్ కప్ 2022లో మొరాకో జట్టు సంచలన విజయం నమోదు చేసింది. ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో సెమీ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి ఆఫ్రికన్ జట్టుగా మొరాకో నిలిచింది. దోహాలో శనివారం రాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 1-0 గోల్స్ తేడాతో పోర్చుగల్ పై మొరాకో గెలిచి, సగర్వంగా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్-ఫైనల్‌కు చేరుకున్న మూడు ఆఫ్రికన్ జట్లుగా 1990లో కామెరూన్, 2002లో సెనెగల్, 2010లో ఘనా నిలిచాయి. తాజా విజయంతో సెమీఫైనల్ చేరిన తొలి ఆఫ్రికా జట్టుగా మొరాకో నిలిచి వరల్డ్ కప్ రేసులో మరో అడుగు ముందుకేసింది.
ఆట 42వ నిమిషంలో మొరాకో ఆటగాడు యూసెఫ్ యెన్ నెస్రి గోల్ కొట్టి 1-0తో ఆఫ్రికా జట్టును ఆధిక్యంలోకి తెచ్చాడు. ఎడమ వైపు నుంచి టీట్ మేట్ తనకు అందించిన పాస్ ను గోల్ గా మలిచాడు యూసెఫ్ యెన్ నెస్రి. కానీ పోర్చుగల్ గోల్ ఖాతా తెరవడంలో విఫలం కావడంతో నిరాశగా వెనుదిరిగింది. పోర్చుగల్ కు ఫిఫా వరల్డ్ కప్ అందించాలన్న కల నెరవేరకుండానే స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో మరోసారి ఇంటి బాట పట్టాడు. పోర్చుగల్ ఓటమిని జీర్ణించుకోలేని రొనాల్డో కన్నీటిపర్యంతమయ్యాడు. కెరీర్‌లో చివరి ఫుట్ బాల్ వరల్డ్ కప్ ఆడేసినట్లేనని అభిమానులు అంటున్నారు.
మరోవైపు పోర్చుగల్ టీమ్ వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ నుంచి నిష్క్రమించింది. గతంలో 1966లో 5-3 v DPR కొరియాపై, 2006లో ఇంగ్లాండ్ పై పెనాల్టీ షూటౌట్‌లో 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించిన పోర్చుగల్ తొలిసారి క్వార్టర్ ఫైనల్ లో ఓటమిపాలై ఇంటిదారి పట్టింది. పోర్చుగల్‌కు చెందిన స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ప్రపంచ కప్‌లో తన ఎనిమిది నాకౌట్ మ్యాచ్‌లలో స్కోర్ చేయడంలో విఫలమయ్యాడు. స్కోర్ చేయకుండా 570 నిమిషాల పాటు మైదానంలో ఉన్న ఆటగాడిగా నిలిచాడు.
MOROCCO ARE HEADING TO THE SEMI-FINALS! 🇲🇦@adidasfootball | #FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) December 10, 2022
ఫిఫా వరల్డ్ కప్ లో యూసఫ్ ఎన్ నెసిరి అత్యధిక గోల్స్ చేసిన మొరాకో ఆటగాడిగా నిలిచాడు. ఫిఫా వరల్డ్ కప్‌లో శనివారం పోర్చుగల్ పై చేసిన గోల్ 3వ వరల్డ్ కప్ గోల్. ఈ మ్యాచ్ ఆడిన పోర్చుగల్ ఆటగాళ్ల సగటు వయస్సు కేవలం 26 సంవత్సరాల 332 రోజులు కాగా, ప్రపంచ కప్ మ్యాచ్‌లో అతి తక్కువ సగటు వయసు కలిగిన జట్టుగా నిలిచింది.
If this is the end of Cristiano Ronaldo's World Cup career, he leaves as one of the most decorated players to not win the tournament.
— ESPN Stats & Info (@ESPNStatsInfo) December 10, 2022
🐐 22 games played (5th-most all-time)
🐐 8 World Cup goals
🐐 1st men's player to score in 5 World Cups pic.twitter.com/Fa1ZrFtpE4