అన్వేషించండి

Pakistan Cricket: పాక్‌ క్రికెట్‌లో మహా సంక్షోభం, పీసీబీ ఛైర్మన్‌ రాజీనామా

Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డు చైర్మన్ జ‌కా అష్రఫ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ప‌ద‌వి చేప‌ట్టి ఏడాది కాక‌ముందే పీసీబీ మేనేజ్‌మెంట్ క‌మిటీ నుంచి అష్రఫ్ వైదొలిగాడు.

వరుస ఓటములతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన పాకిస్థాన్‌ జట్టు(Pakistan Cricket team)కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గత 76 రోజులుగా ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేక చతికిల పడ్డ దాయాది జట్టులో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. వన్డే వరల్డ్‌కప్‌లో ఓటమితో పాక్‌ కెప్టెన్సీ పదవికి బాబార్‌ ఆజమ్‌ రాజీనామా చేసినప్పుడు మొదలైన ఈ రాజీనామాల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. పాక్‌లో విజయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న వేళ.. ఇప్పటికే ముగ్గురు సిబ్బంది రాజీనామా చేయగా తాజాగా పాక్‌ క్రికెట్‌ బోర్డులో పెద్ద తలకాయ కూడా రాజీనామా చేయడం సంచలనం రేపుతోంది.

పీసీబీ ఛైర్మన్‌ రాజీనామా 
పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డు( Pakistan Cricket board)  చైర్మన్ జ‌కా అష్రఫ్‌(Zaka Ashraf) తన పదవికి రాజీనామా చేశారు. ప‌ద‌వి చేప‌ట్టి ఏడాది కాక‌ముందే పీసీబీ మేనేజ్‌మెంట్ క‌మిటీ నుంచి అష్రఫ్ వైదొలిగాడు. పాక్ జ‌ట్టు వ‌రుస వైఫ‌ల్యాల నేప‌థ్యంలో అష్రఫ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒక్క విజయం కోసం సుమారు రెండున్నర నెలలుగా పాక్‌ అభిమానులు కళ్లు కాయాలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అయినా ఒక్క విజయం కూడా నమోదు కాలేదు. పాక్‌ జట్టు ఆటతీరు సహా పీసీబీ అధ్యక్షుడిగా అష్రఫ్ ప‌నితీరుపై కొంద‌రు అసంతృప్తిగా ఉన్నార‌ు. పాక్ క్రికెట్‌ను వృద్ధిలోకి తెద్దామ‌నుకున్నాను కానీ ఆ విధంగా ప‌ని చేయ‌డం తనకు సాధ్యం కాలేదని... తన స్థానంలో పీసీబీ ఛైర్మన్‌గా ఎవ‌రిని నామినేట్ చేయాల‌నేది ప్రధాన మంత్రి నిర్ణయం తీసుకుంటారని రాజీనామా అనంతరం అష్రఫ్ తెలిపాడు. గ‌డిచిన రెండేళ్ల కాలంలోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ముగ్గురు అధ్యక్షులు మారారు. ర‌మిజ్ రాజా, న‌జం సేథీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి వైదొలగగా... తాజాగా అష్రఫ్‌ కూడా పదవికి రాజీనామా చేశాడు. 

ముగ్గురు రాజీనామా
పాకిస్థాన్ జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచ కప్‌లో ఓటమి తర్వాత పాకిస్థాన్ క్రికెట్‌లో భారీ మార్పులు చేయగా.. తాజాగా కీలక పదవుల నుంచి మిక్కీ ఆర్థర్, గ్రాంట్ బ్రాడ్‌ బర్న్, ఆండ్రూ పుట్టిక్‌ నుంచి వైదొలిగారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వీరు రాజీనామా చేసినట్లు అధికారికంగా ధృవీకరించింది. ప్రపంచకప్‌లో పాక్‌ క్రికెట్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన మికీ ఆర్థర్‌, గ్రాంట్ బ్రాడ్‌బర్న్‌, ఆండ్రూ పుట్టిక్‌ రాజీనామా చేశారు. పీసీబీ వారి రాజీనామాలను ఆమోదించినట్లు పేర్కొంది. గతేడాది ఏప్రిల్‌లో మికీ ఆర్థర్‌ పాక్‌ క్రికెట్‌ డైరెక్టర్‌గా ఎంపికయ్యాడు. బ్రాడ్‌బర్న్‌ను ప్రధాన కోచ్‌, పుట్టిక్‌ను బ్యాటింగ్‌ కోచ్‌గా పీసీబీ నియమించింది. వరల్డ్‌ కప్‌లో జట్టు దారుణంగా ఆడటంతో ఈ ముగ్గురూ కొనసాగేందుకు ఇష్టపడక రాజీనామాలు సమర్పించేశారు. 2016 నుంచి 2019 మధ్య పాకిస్థాన్‌ జట్టుకు మిక్కీ ఆర్థర్ కోచ్ గా పని చేశాడు. ఏప్రిల్ 2023లో పాక్ జట్టులో డైరెక్టర్‌గా చేరారు. ఆర్థర్ 2016 నుంచి 2019 వరకు పాకిస్తాన్ మెన్స్ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. ఇతను కోచ్ గా ఉన్న సమయంలో పాకిస్తాన్ ICC టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడంతో పాటు 2017 ICC ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆర్థర్ దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లకు ప్రధాన కోచ్‌గా కూడా పనిచేశాడు.

టాప్ హెడ్ లైన్స్

Shapoor Zadran Passes Away News: భారత్‌లో చికిత్స తీసుకుంటూ కన్నుమూసిన ఆఫ్ఘన్‌ మాజీ బౌలర్ షాపూర్ జద్రాన్! విచారం వ్యక్తం చేసిన ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు!
భారత్‌లో చికిత్స తీసుకుంటూ కన్నుమూసిన ఆఫ్ఘన్‌ మాజీ బౌలర్ షాపూర్ జద్రాన్!
Captain Cool MS Dhoni Birthday: లెజెండ్ ఎంఎస్ ధోని 45వ బర్త్ డే.. టికెట్ కలెక్టర్ నుంచి ఇండియాస్ బిగ్గెస్ట్ ట్రోఫీ కలెక్టర్‌గా మారిన 'మహి' మైండ్ బ్లోయింగ్ సక్సెస్ జర్నీ!
లెజెండ్ ఎంఎస్ ధోని 45వ బర్త్ డే.. టికెట్ కలెక్టర్ నుంచి ఇండియాస్ బిగ్గెస్ట్ ట్రోఫీ కలెక్టర్‌గా మారిన 'మహి' మైండ్ బ్లోయింగ్ సక్సెస్ జర్నీ!
Sanju Samson Dropped: జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
ICC Dream Team: ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్ టీమ్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ల హవా.. ఇండియా నుంచి కేవ‌లం ఒక్క ప్లేయ‌ర్ కే చోటు.. ఆ తెలుగు స్టార్ ఎవ‌రంటే..?
ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్ టీమ్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ల హవా.. ఇండియా నుంచి కేవ‌లం ఒక్క ప్లేయ‌ర్ కే చోటు.. ఆ తెలుగు స్టార్ ఎవ‌రంటే..?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Pawan Kalyan: అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Embed widget