అన్వేషించండి

Year Ender 2023: వన్డేలను ఏలింది మన బ్యాటర్లే, తొలి మూడు స్థానాలు మనవే

Year Ender 2023: పొట్టి క్రికెట్‌లో చాలామంది క్రికెటర్లు ఈ ఏడాది తమ మార్కు ఆటతీరుతో అబ్బురపరిచారు. అలా వన్డే క్రికెట్‌లో టీమిండియా బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు.

కొత్త సంవత్సరం రాబోతుంది. మరో క్రీడా సంవత్సరం కాల గర్భంలో కలిసిపోతోంది. ఈ ఏడాది క్రీడల్లో ఎన్నో అద్భుతాలు.. మరెన్నో మధుర విజయాలు. కొన్ని విజయాలు అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాయి. కొన్ని పరాజయాలు అభిమానులను కంటతడి పెట్టించాయి. పొట్టి క్రికెట్‌లో చాలామంది క్రికెటర్లు ఈ ఏడాది తమ మార్కు ఆటతీరుతో అబ్బురపరిచారు. అలా వన్డే క్రికెట్‌లో టీమిండియా బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ఈ ఏడాది వన్డే క్రికెట్‌లో భారత స్టార్‌ ఓపెనర్‌ శుభ్‌మన్ గిల్ విధ్వంసం సృష్టించాడు. ఈ ఏడాది వన్డే క్రికెట్‌లో అద్భుతాలు సృష్టించిన పది మంది ఆటగాళ్లు ఎవరో ఓసారి మననం చేసుకుందాం. 
 
ఏడాది వన్డే క్రికెట్‌లో అద్భుతాలు సృష్టించిన తొలి పది మంది ఆటగాళ్ల జాబితాలో ముగ్గురు భారత క్రికెటర్లు ఉన్నారు. ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో టీమిండియా దిగ్గజ ఆటగాళ్లే ఉన్నారు. తొలి స్థానంలో గిల్‌ ఉండగా.. రెండో స్థానంలో విరాట్‌ కోహ్లీ.. మూడో స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. స్టార్‌ ఓపెనర్‌ శుభమన్‌ గిల్ ఈ ఏడాది మొత్తం 29 వన్డే మ్యాచ్‌లు ఆడి 63.36 సగటుతో 1584 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2023లో గిల‌్ అత్యధిక స్కోరు 208 పరుగులు. ఈ ఏడాది గిల్ ఒక్కసారి మాత్రమే డకౌట్‌ అయ్యాడు. రెండో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ ఈ ఏడాది 27 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 24 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసి 72.47 సగటుతో 1377 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 8 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2023లో కోహ్లీ అత్యధిక స్కోరు 166 పరుగులు నాటౌట్. ఆ తర్వాత మూడో స్థానంలో ఉన్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ 27 మ్యాచ్‌ల్లో 26 ఇన్నింగ్స్‌ల్లో 52.29 సగటుతో 1255 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు వచ్చాయి. ఈ ముగ్గురు భారత బ్యాట్స్‌మెన్‌లలో రోహిత్ శర్మ  అత్యధికంగా 67 సిక్సర్లు కొట్టాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్‌ ఇక ఈ ఏడాది వన్డే మ్యాచ్‌లు ఆడడం లేదు. దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌కు కూడా ఈ ముగ్గురికి విశ్రాంతి ఇచ్చారు. 
 
2023లో అత్యధిక వన్డే పరుగులు చేసిన టాప్-10లో నాలుగో స్థానంలో న్యూజిలాండ్‌కు చెందిన డారిల్ మిచెల్... అయిదో స్థానంలో శ్రీలంకకు చెందిన పాతుమ్ నిస్సాంక ఉన్నారు.  పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ ఆరో స్థానంలో, పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ ఏడో స్థానంలో, ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ మలన్ ఎనిమిదో స్థానంలో, దక్షిణాఫ్రికాకు చెందిన ఐడెన్ మాక్రమ్‌ తొమ్మిదో స్థానంలో, కేఎల్‌ రాహుల్‌ పదో స్థానంలో స్థానంలో ఉన్నారు. 
 
2023లో వన్డేల్లో టాప్‌ టెన్‌ రన్‌ స్కోర్లు
 
శుభ్‌మన్ గిల్- 1584 (29 మ్యాచ్‌లు)
విరాట్ కోహ్లీ- 1377 (27 మ్యాచ్‌లు)
రోహిత్ శర్మ- 1255 (27 మ్యాచ్‌లు)
డారిల్ మిచెల్- 1204 (26 మ్యాచ్‌లు)
పాతుమ్ నిస్సంక- 1151 (29 మ్యాచ్‌లు)
బాబర్ ఆజం- 1065 (25 మ్యాచ్‌లు)
మహ్మద్ రిజ్వాన్- 1023 (25 మ్యాచ్‌లు)
డేవిడ్ మలన్- 995 (18 మ్యాచ్‌లు)
ఐడెన్ మార్క్రామ్- 983 (21 మ్యాచ్‌లు)
కేఎల్ రాహుల్- 983 (24 మ్యాచ్‌లు).
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
Nara Lokesh Sudden Visit: మైలవరం స్కూల్‌లో నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు - పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం - ఏం తేలిందంటే?
మైలవరం స్కూల్‌లో నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు - పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం - ఏం తేలిందంటే?
Tamil Nadu Elections 2026: నాకు నయనతార కలలోకి వస్తుంది..స్టాలిన్ ఇస్తారా? - అన్నాడీఎంకే నేత ప్రశ్న - ఇదేం డిమాండ్?
నాకు నయనతార కలలోకి వస్తుంది..స్టాలిన్ ఇస్తారా? - అన్నాడీఎంకే నేత ప్రశ్న - ఇదేం డిమాండ్?
Pawan Kalyan Tamil Interview: విజయ్ ఎన్డీఏ కూటమిలోకి వస్తే ఆహ్వానిస్తా - కానీ ప్రతిపాదన పెట్టలేదు - తమిళ ఇంటర్యూలో పవన్ కీలక వ్యాఖ్యలు
విజయ్ ఎన్డీఏ కూటమిలోకి వస్తే ఆహ్వానిస్తా - కానీ ప్రతిపాదన పెట్టలేదు - తమిళ ఇంటర్యూలో పవన్ కీలక వ్యాఖ్యలు

వీడియోలు

GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
Vaibhav Suryavanshi Chat With Rahul Dravid | ద్రవిడ్ కు వైభవ్ షాకింగ్ రిప్లై | ABP Desam
Abhishek about Mahesh Babu & Allu Arjun | తెలుగు సినిమాలపై అభిషేక్ శర్మ క్రేజీ కామెంట్స్ | ABP Desam
IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
Nara Lokesh Sudden Visit: మైలవరం స్కూల్‌లో నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు - పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం - ఏం తేలిందంటే?
మైలవరం స్కూల్‌లో నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు - పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం - ఏం తేలిందంటే?
Tamil Nadu Elections 2026: నాకు నయనతార కలలోకి వస్తుంది..స్టాలిన్ ఇస్తారా? - అన్నాడీఎంకే నేత ప్రశ్న - ఇదేం డిమాండ్?
నాకు నయనతార కలలోకి వస్తుంది..స్టాలిన్ ఇస్తారా? - అన్నాడీఎంకే నేత ప్రశ్న - ఇదేం డిమాండ్?
Pawan Kalyan Tamil Interview: విజయ్ ఎన్డీఏ కూటమిలోకి వస్తే ఆహ్వానిస్తా - కానీ ప్రతిపాదన పెట్టలేదు - తమిళ ఇంటర్యూలో పవన్ కీలక వ్యాఖ్యలు
విజయ్ ఎన్డీఏ కూటమిలోకి వస్తే ఆహ్వానిస్తా - కానీ ప్రతిపాదన పెట్టలేదు - తమిళ ఇంటర్యూలో పవన్ కీలక వ్యాఖ్యలు
Drug Test in Telangana Assembly: డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్‌ రెడ్డి రెడీ.. మరి కేసీఆర్, కేటీఆర్‌ వస్తారా ? మండలిలో మహేష్ గౌడ్ ఛాలెంజ్
డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్‌ రెడ్డి రెడీ.. మరి కేసీఆర్, కేటీఆర్‌ వస్తారా ? మండలిలో మహేష్ గౌడ్ ఛాలెంజ్
Self Murder: రీల్ కోసం సెల్ఫ్ మర్డర్ చేసుకున్న యవకుడు - ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోతుంది!
రీల్ కోసం సెల్ఫ్ మర్డర్ చేసుకున్న యవకుడు - ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోతుంది!
Jaripey Song: లిరిక్స్‌లో డబుల్ మీనింగ్స్... ఆ వల్గర్ స్టెప్పులేంటి? - యూట్యూబ్‌లో సాంగ్ డిలీట్
లిరిక్స్‌లో డబుల్ మీనింగ్స్... ఆ వల్గర్ స్టెప్పులేంటి? - యూట్యూబ్‌లో సాంగ్ డిలీట్
Ustaad Bhagat Singh: 'ఉస్తాద్...' కోసం 'తొలిప్రేమ' సాంగ్ రీమిక్స్... ట్రైలర్‌లో హింట్
'ఉస్తాద్...' కోసం 'తొలిప్రేమ' సాంగ్ రీమిక్స్... ట్రైలర్‌లో హింట్
Embed widget