అన్వేషించండి

Year Ender 2023: వన్డేలో విరాట్ విశ్వరూపం , ఈ ఏడాదంతా కోహ్లీ నామస్మరణే

Year Ender 2023 Virat Kohli: ఎన్నో రికార్డులను ఈ ఏడాది టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ కింగ్‌ కోహ్లీ తన పేరిట లిఖించుకుని ఈ ఏడాదిని మరచిపోలేని జ్ఞాపకంగా చేసుకున్నాడు.

మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరం రాబోతోంది. 2023ఏడాది భారత క్రీడా ప్రతిష్ఠను మరింత పెంచింది. ఈ ఏడాది క్రీడల్లో ఎన్నో అద్భుతాలు.. మరెన్నో మధుర విజయాలు. కొన్ని విజయాలు అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాయి. క్రికెట్‌లో కొన్ని రికార్డులు చిరస్మరణీయంగా మారాయి. అలాంటి ఎన్నో రికార్డులను ఈ ఏడాది టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ కింగ్‌ కోహ్లీ తన పేరిట లిఖించుకుని ఈ ఏడాదిని మరచిపోలేని జ్ఞాపకంగా చేసుకున్నాడు. విరాట్ కోహ్లీకి 2023 సంవత్సరం చాలా ప్రత్యేకమైంది.  విరాట్ కోహ్లీకి క్రికెట్‌లో ఈ ఏడాది  అద్భుతంగా గడిచింది.

భారత్‌ వేదికగా ముగిసిన ప్రపంచకప్‌లో విరాట్‌ కోహ్లీ అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అద్భుత ఆటతీరుతో ఆ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నవ చరిత్ర లిఖించాడు. సచిన్‌‌కు దరిదాపుల్లో నిలిచే బ్యాటర్ రావడం కష్టమని క్రీడా పండితులు తేల్చేశాక తానున్నానని దూసుకొచ్చిన విరాట్‌ కింగ్‌ కోహ్లీ... ఆ క్రికెట్‌ దేవుడి రికార్డును సగర్వంగా దాటేశాడు. ప్రపంచకప్‌ సెమీఫైనల్లో తీవ్ర ఒత్తిడిలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అద్భుత శతకంతో సచిన్‌ రికార్డును అధిగమించేశాడు. సచిన్‌ సృష్టించిన రికార్డులను తన పరుగుల ప్రవాహంతో బద్దలు కొట్టిన కోహ్లీ వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును కూడా తిరగరాసి తన పేరిట లిఖించుకున్నాడు. ఇదే ప్రపంచకప్‌లో సచిన్‌ 49 వన్డే సెంచరీల రికార్డును సమం చేసిన కోహ్లీ... 50 సెంచరీలతో దానిని అధిగమించాడు. తాను ఎంతటి గొప్ప ఆటగాడినో మరోసారి క్రికెట్‌ ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇప్పుడు కోహ్లీ ఖాతాలో అరుదైన ఘనత మరొకటి చేరింది. ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఈ రన్‌ మెషిన్‌ ఇప్పుడు మరో కలికితురాయిని తన కీర్తి కిరీటంలో ఇమడ్చుకున్నాడు.

ఈ ఏడాది భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 95.62 సగటుతో 765 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ప్రపంచకప్‌లలో ఏ బ్యాట్స్‌మెన్ కూడా 700 మార్కును దాటలేదు. వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఈ ఏడాది వరకు విరాట్ కోహ్లీ టాప్-5లో ఉన్నాడు. ఈ ఏడాది విరాట్‌ వన్డేల్లో  మొత్తం 1377 పరుగులు చేశాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లీ ఈ ఏడాది 27 వన్డే మ్యాచ్‌లు ఆడాడు.  72.47 సగటు.... 99 స్ట్రైక్ రేట్‌తో 1377 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు చేశాడు. ఈ ఏడాది తన కెరీర్‌లో అత్యధిక స్కోరు 166 పరుగులను సాధించాడు. టెస్టుల్లోనూ బాగా బ్యాటింగ్ చేసినా టీ20లో మాత్రం ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ఈ ఏడాది 7 టెస్టు మ్యాచ్‌లు ఆడిన అతను 55.70 బ్యాటింగ్ సగటుతో 557 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతను రెండు సెంచరీలు చేశాడు. టెస్టు క్రికెట్‌లో మొత్తం 8676 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ ఈ ఏడాది ఒక్క టీ 20 మ్యాచ్‌ కూడా ఆడలేదు. క్రికెట్‌లో ఆరంగేట్రం చేసినప్పటి నుంచి విరాట్‌ కోహ్లీ ఒక్క టీ 20 మ్యాచ్‌ కూడా ఆడకుండా ముగిసిన తొలి ఏడాది ఇదే. 

టాప్ హెడ్ లైన్స్

IND vs SL Test Series Updates: లంకలో ల్యాండైన టీమ్ ఇండియా.. ఫ్లైట్ ఎక్కని టాపార్డ‌ర్ బ్యాటర్, తొలి టెస్టు ఆడ‌టంపై సందిగ్ధం !
లంకలో ల్యాండైన టీమ్ ఇండియా.. ఫ్లైట్ ఎక్కని టాపార్డ‌ర్ బ్యాటర్, తొలి టెస్టు ఆడ‌టంపై సందిగ్ధం !
BCCI Pension Rules: రహానే రిటైర్మెంట్ డెసిషన్ తో మళ్లీ చర్చల్లోకి బిసిసిఐ పెన్షన్ స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లో పడే అమౌంట్ ఎంతో తెలిస్తే షాకే
రహానే రిటైర్మెంట్ డెసిషన్ తో మళ్లీ చర్చల్లోకి బిసిసిఐ పెన్షన్ స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లో పడే అమౌంట్ ఎంతో తెలిస్తే షాకే
BCCI Message To Shami : బుమ్రా ప్లేస్ లో ఆకిబ్ నబీ ఎంట్రీ.. షమీ ఆశలపై  నీళ్లు, టీమ్ ఇండియా తలుపులు మూసుకుపోయినట్లేనా!
బుమ్రా ప్లేస్ లో ఆకిబ్ నబీ ఎంట్రీ.. షమీ ఆశలపై  నీళ్లు, టీమ్ ఇండియా తలుపులు మూసుకుపోయినట్లేనా!
New Fielding Coach: టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
Supreme Court On Vehicle Insurance:బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
Embed widget