UPW vs DCW: ఆఖరి లీగు మ్యాచులో టాస్ డీసీదే - యూపీపై గెలిస్తే ఫైనల్‌కే!
UPW vs DCW: బ్రబౌర్న్ వేదికగా యూపీ వారియర్జ్, దిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన దిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది.
![UPW vs DCW: ఆఖరి లీగు మ్యాచులో టాస్ డీసీదే - యూపీపై గెలిస్తే ఫైనల్‌కే! WPL 2023 UPW vs DCW Delhi Capitals Women have won the toss and have opted to field UPW vs DCW: ఆఖరి లీగు మ్యాచులో టాస్ డీసీదే - యూపీపై గెలిస్తే ఫైనల్‌కే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/21/de103bc09c68735e528e7043c3641c711679405998687251_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
UPW vs DCW:
విమెన్ ప్రీమియర్ లీగులో 20వ మ్యాచ్ జరుగుతోంది. బ్రబౌర్న్ వేదికగా యూపీ వారియర్జ్, దిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన దిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో మంచి రన్‌రేట్‌తో గెలిస్తే 12 పాయింట్లు, మెరుగైన రన్‌రేట్‌తో డీసీ ఫైనల్ చేరుకుంటుంది. 'మేం మొదట బౌలింగ్ చేస్తాం. చివరి రెండు మ్యాచుల్లో ఛేదన మాకు అచ్చొచ్చింది. నేడూ మేం బాగా ఆడాలి. తీవ్రమైన పోటీ నెలకొన్న ఈ టోర్నీలో ఎప్పుడైనా ఎవ్వరైనా గెలవొచ్చు' అని లానింగ్ తెలిపింది.
Team updates ‼️
— Women's Premier League (WPL) (@wplt20) March 21, 2023
Look at the Playing XIs from both teams
What do you make of them? 🤔
Follow the match ▶️ https://t.co/r4rFmhENd7#TATAWPL | #UPWvDC pic.twitter.com/sOgRj60IPP
'టాస్ ఓడినా ఫర్వాలేదు. మొదట బ్యాటింగ్ చేసి మంచి టార్గెట్ ఇస్తాం. నేడు మూడు మార్పులు చేశాం. గ్రేస్ హ్యారిస్, రాజేశ్వరీ గైక్వాడ్, దేవికా వైద్య ఆడటం లేదు. యశశ్రీ అరంగేట్రం చేస్తోంది. ఆమె రాణించాలని కోరుకుంటున్నాం. షబ్నిమ్ ఇస్మాయిల్ వస్తోంది. జట్టు కోసం గ్రేస్ హ్యారిస్ ఎంతో కష్టపడుతోంది. అందుకే రెస్ట్ ఇచ్చాం' అని యూపీ వారియర్జ్ కెప్టెన్ అలీసా హేలీ తెలిపింది.
తుది జట్లు
దిల్లీ క్యాపిటల్స్: మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ, అలిస్ క్యాప్సీ, జెమీమా రోడ్రిగ్స్, మారిజానె కాప్, తానియా భాటియా, జెస్ జొనాసెన్, రాధా యాదవ్, అరుంధతీ రెడ్డీ, శిఖా పాండే, పూనమ్ యాదవ్
యూపీ వారియర్జ్: శ్వేతా షెరావత్, అలీసా హేలీ, కిరన్ నవగిరె, తాహిలా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, సోఫీ ఎకిల్‌స్టోన్, సిమ్రన్ షేక్, పర్శవీ చోప్రా, అంజలీ శర్వాణి, సొప్పదండి యశశ్రీ, షబ్నిమ్ ఇస్మాయిల్
నేటి డబుల్ హెడర్ తొలి మ్యాచులో ఏం జరిగిందంటే?
విమెన్ ప్రీమియర్ లీగులో ముంబయి ఇండియన్స్ మళ్లీ టాప్ ప్లేస్‌కు చేరుకుంది. 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఆఖరి లీగు మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. ఆ జట్టు నిర్దేశించిన 126 పరుగుల లక్ష్యాన్ని ఎలాంటి ఒత్తిడి లేకుండా ఛేదించింది. 16.3 ఓవర్లకు 4 వికెట్ల తేడాతో గెలుపు బావుటా ఎగరేసింది. అమెలియా కెర్ (31*; 27 బంతుల్లో 4x4), యస్తికా భాటియా (30; 26 బంతుల్లో 6x4) అదరగొట్టారు. అంతకు ముందు ఆర్సీబీలో రిచా ఘోష్ (29; 13 బంతుల్లో 3x4, 2x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఎలిస్ పెర్రీ (29; 38 బంతుల్లో 3x4) ఆమెకు తోడుగా నిలిచింది.
🚨 Toss Update 🚨@DelhiCapitals win the toss and elect to field first against @UPWarriorz
— Women's Premier League (WPL) (@wplt20) March 21, 2023
Follow the match ▶️ https://t.co/r4rFmhENd7#TATAWPL | #UPWvDC pic.twitter.com/gPYlYR1w8k
It’s raining boundaries when these two batters are at the crease 💥@189Grace or @TheShafaliVerma - who will you pick❓#TATAWPL | #UPWvDC
— Women's Premier League (WPL) (@wplt20) March 21, 2023
Create your team now 🔽 #TATAWPL | #UPWvDChttps://t.co/BrXADlY9iC pic.twitter.com/9pJ1fL7B9o
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)