IND-W vs SA-W Test: టీమిండియా దక్షిణాఫ్రికా మహిళల మధ్య చరిత్రత్మాక సిరీస్- పదేళ్ల తర్వాత భారత్‌లో మ్యాచ్‌లు
India Women vs South Africa Women Test: టీమిండియా- దక్షిణాఫ్రికా మహిళల మధ్య జరగనున టెస్టు, వన్డే, టీ20 సిరీస్ షెడ్యూల్ వెల్లడైంది.
India Women vs South Africa Women Test: టీమిండియా- దక్షిణాఫ్రికా(India W vs South Africa W) మహిళల మధ్య కీలక సిరీస్‌కు రంగం సిద్ధమైంది. టీమిండియా-దక్షిణాఫ్రికా మధ్య టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్ షెడ్యూల్ వెల్లడైంది. ఒక దశాబ్దం తర్వాత మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడేందుకు దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టుకు భారత్(INDIA)కు రానుంది. ఈ సిరీస్‌లో ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఉంటాయని బీసీసీఐ(BCCI) ప్రకటించింది. వన్ డేలు బెంగళూరు(Bangaluru)లో ఆడనుండగా.. టెస్ట్ మ్యాచ్, టీ 20లు చెన్నై( chennei)లో జరుగుతాయని బీసీసీఐ తెలిపింది. టీమిండియా- దక్షిణాఫ్రికా మహిళల జట్లు చివరిసారిగా 2014 నవంబర్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే వన్డే వార్మప్ మ్యాచ్‌తో సిరీస్ ప్రారంభమవుతుందని బీసీసీఐ తెలిపింది. జూన్ 13న బోర్డు ప్రెసిడెంట్స్ XIతో దక్షిణాఫ్రికా జట్టు తలపడనుంది. వన్డేలు ICC మహిళల ఛాంపియన్‌షిప్ 2022–2025లో భాగంగా ఉంటాయని ఐసీసీ తెలిపింది. వన్డేలు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కాగా, టీ20లు రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. సుదీర్ఘ ఫార్మట్‌లను ప్రోత్సహించేందుకు బీసీసీఐ- దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులు టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వాలని నిర్ణయించాయి. గత ఏడాది డిసెంబర్‌లో ముంబై వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో భారత్ ఒక్కో టెస్టు ఆడి ఘన విజయం సాధించింది. వరుసగా 347 పరుగులు, ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ప్రపంచకప్‌నకు సన్నాహకం
త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్ దృష్ట్యా మహిళల జట్టుకు ఈ సిరీస్‌ను సన్నాహకంగా భావిస్తున్నారు. మహిళల టీ20 ప్రపంచకప్ సెప్టెంబర్-అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌లో జరగనుంది. ఈ సిరీస్‌ను ప్రపంచకప్‌కు సన్నాహకంగా భావిస్తున్నారు.
టీమిండియా-దక్షిణాఫ్రికా మహిళల జట్టు షెడ్యూల్
===================
జూన్ 13: దక్షిణాఫ్రికాvs బోర్డ్ ప్రెసిడెంట్ లెవన్ మ్యాచ్ (బెంగళూరు)
జూన్ 16: మొదటి వన్డే, బెంగళూరు
జూన్ 19: రెండో వన్డే, బెంగళూరు
జూన్ 23: మూడో వన్డే, బెంగళూరు
జూన్ 28-జూలై 1: టెస్ట్ మ్యాచ్, చెన్నై
జూలై 5: మొదటి టీ20, చెన్నై
జూలై 7: రెండో టీ20, చెన్నై
జూలై 9: మూడో టీ20, చెన్నై
బంగ్లాతో క్లీన్‌స్వీప్
బంగ్లాదేశ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత మహిళల క్రికెట్ జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. యువ కెప్టెన్ నాయకత్వంలో ఊపుమీదున్న బంగ్లాదేశ్ జట్టును భారత జట్టు చిత్తు చేసింది. ఎడమ చేతివాటం స్పిన్నర్ రాధా యాదవ్ సిరీస్ చివరి మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు. మొత్తం సిరీస్‌లో 10 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గానూ ఎంపికయ్యారు.