Sunil Narine: 2 దేశాలు - 3 రోజుల్లో 14,500 కిలోమీటర్ల ప్రయాణం - 4 మ్యాచ్‌లు - నరైన్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్
ఫ్రాంచైజీ క్రికెట్ ఎక్కడ జరిగినా కనబడే వెస్టిండీస్ క్రికెటర్లలో సునీల్ నరైన్ ఒకడు. త్వరలో ఈ కరేబియన్ దిగ్గజం నాలుగు మ్యాచ్‌లు ఆడేందుకు ఏకంగా 14,500 కిలోమీటర్లు ప్రయాణించనున్నాడు.
Sunil Narine: విండీస్ వీరుడు, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడే సునీల్ నరైన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచ పటంలో ఎక్కడ టీ20 లీగ్ జరిగినా నరైన్ ఉండాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌కు నాలుగు ఫ్రాంచైజీలు ఉంటే నాలుగింటిలోనూ అతడు ఆడతాడు. జాతీయ జట్టు నుంచి తప్పుకున్నాక నరైన్ దాదాపు ఫ్రాంచైజీ క్రికెట్ మీదే ఫోకస్ చేశాడు. తాజాగా నరైన్.. మూడు రోజుల వ్యవధిలో నాలుగు మ్యాచ్‌లు ఆడేందుకు గాను ఏకంగా 14,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నాడు.
ఎలా..?
జులై 13 నుంచి టెక్సాస్ (అమెరికా) వేదికగా మొదలుకాబోయే లాస్ ఏంజెల్స్ ఫ్రాంచైజీని దక్కించుకున్న కేకేఆర్‌కు సునీల్ నరైన్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. రేపు (గురువారం) ఆ జట్టు.. టెక్సాస్ సూపర్ కింగ్స్ (చెన్నై టీమ్)తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఆడేందుకు గాను నరైన్.. బర్మింగ్‌హామ్ (ఇంగ్లాండ్) నుంచి అమెరికాకు వచ్చాడు. ఐపీఎల్ - 16 ముగిశాక నరైన్.. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ‘టీ20 బ్లాస్ట్’లో సర్రే టీమ్ తరఫున ఆడుతున్నాడు. మొన్నటి శుక్రవారం (జులై 7న) ఆ జట్టు.. క్వార్టర్స్‌లో లంకాషైర్‌తో ఆడింది. ఆ మ్యాచ్‌లో సర్రే గెలిచింది. మ్యాచ్ ముగిసిన వెంటనే నరైన్.. యూఎస్ విమానమెక్కాడు.
జూన్ 13న టెక్సాస్ సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ ముగిసిన వెంటనే నరైన్.. శనివారం ఉదయం యూకే ఫ్లైట్ ఎక్కుతాడు. శనివారం (జులై 15న) సర్రే.. సోమర్‌సెట్‌తో తలపడనుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. సర్రే, అదే రోజు రాత్రి ఫైనల్ కూడా ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లు ముగిసిన వెంటగనే నరైన్ మళ్లీ యూఎస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే.. జులై 16న రాత్రి లాస్ ఏంజెల్స్ జట్టు ఎంఐ న్యూయార్క్‌తో తలపడాల్సి ఉంది.
Sunil Narine will play for LA Knight Riders on Thursday, 13 July in Dallas, US (7.30 PM local time)
— Vibhor (@dhotedhulwate) July 11, 2023
On Saturday morning, 15 July he will play for Surrey in T20 blast semi finals in Birmingham, UK (2.30 PM local time)
If they win, they will play the finals there on the same… pic.twitter.com/JhWAiEIoFg
అంటే.. మూడు (సర్రే ఫైనల్‌కు క్వాలిఫై అయితే నాలుగు) మ్యాచ్‌లు ఆడేందుకు గాను నరైన్.. 9వేల మైళ్లు (సుమారు 14,500 కిలోమీటర్లు) ప్రయాణించాల్సి వస్తున్నది. 75 గంటల వ్యవధిలో 14,500 కిలోమీటర్లు ప్రయాణించి.. మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఇంత డెడికేషన్ ఉన్న ప్లేయర్ కాబట్టే నరైన్ వయసు మీద పడ్డా ఫ్రాంచైజీలు అతడిని వదులుకోవడం లేదు.
The Magician, now the Captain of @LA_KnightRiders! 🔥💜#SunilNarine https://t.co/RDefMWVFdh
— KolkataKnightRiders (@KKRiders) July 10, 2023
కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఐపీఎల్‌తో పాటు కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఉండే ట్రిన్‌బాగో, ఇంటర్నేషనల్ టీ20 లీగ్ లోని అబుదాబి లలో కూడా నరైన్ ఆడుతున్నాడు. ఇప్పుడు లాస్ ఏంజెల్స్ సారథిగా కూడా వ్యవహరిస్తున్నాడు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial