అన్వేషించండి

Vizag T20: విశాఖ టీ20లో మహేశ్‌ బాబు ఫ్యాన్స్‌ ఏం చేశారో చూడండి! వీడియో వైరల్‌!

Mahesh Babu Craze: అచ్చొచ్చిన విశాఖ తీరాన టీమ్‌ఇండియా అద్భుత విజయం సాధించింది. కీలకమైన మూడో టీ20లో 48 పరుగుల తేడాతే గెలుపు బావుటా ఎగరేసింది.

అచ్చొచ్చిన విశాఖ తీరాన టీమ్‌ఇండియా అద్భుత విజయం సాధించింది. కీలకమైన మూడో టీ20లో 48 పరుగుల తేడాతే గెలుపు బావుటా ఎగరేసింది. ఈ మ్యాచ్‌కు వేల సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. మ్యాచ్‌ సాంతం క్రికెటర్లను ఉత్సాహపరిచారు.

అదే సమయంలో కొందరు ఫ్యాన్స్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు స్లోగన్స్‌ చెప్తూ ఆటను ఎంజాయ్‌ చేశారు. 'జై బాబు.. జై బాబు' అంటూ కేరింతలు కొట్టారు. మహేశ్‌, విరాట్‌ కోహ్లీ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ వారు స్లోగన్స్‌ ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ మధ్యే మహేశ్‌ నటించిన 'సర్కారు వారి పాట' సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.

మ్యాచ్‌ ఎలా సాగిందంటే?

IND vs SL, 3rd T20, ACA-VDCA Stadium: అచ్చొచ్చిన విశాఖ తీరంలో టీమ్‌ఇండియా గెలుపు తలుపు తట్టింది! ఐదు టీ20ల సిరీసులో తొలి విజయం అందుకుంది. 1-2తో దక్షిణాఫ్రికాను నిలువరించింది. నిర్ణయాత్మక మూడో పోరులో సఫారీలను 48 పరుగుల తేడాతో ఓడించింది. 180 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ప్రత్యర్థిని 19.1 ఓవర్లకు 131కే ఆలౌట్ చేసింది. యూజీ చాహల్‌ (3), హర్షల్‌ పటేల్‌ (4), అక్షర్‌ (1), భువి (1) బౌలింగ్‌లో వైవిధ్యం ప్రదర్శించారు. ఛేదనలో హెన్రిచ్‌ క్లాసెన్‌ (29; 24 బంతుల్లో 3x4, 1x6), రెజా హెండ్రిక్స్‌ (23; 20 బంతుల్లో 2x4, 1x6) టాప్‌ స్కోరర్లు. అంతకు ముందు టీమ్‌ఇండియాలో ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌ (57; 35 బంతుల్లో 7x4, 2x6), ఇషాన్‌ కిషన్‌ (54; 35 బంతుల్లో 5x4, 2x6), హార్దిక్‌ పాండ్య (31; 21 బంతుల్లో 4x4, 0x6) దంచికొట్టారు.

ఈసారి బౌలింగ్‌ అదుర్స్‌!

ఛేదనలో సఫారీలకు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 23 వద్దే తెంబా బవుమా (8)ని అక్షర్‌ పటేల్‌ ఔట్‌ చేశాడు. మరికాసేపటికే రెజా హెండ్రిక్స్‌ (23)ను హర్షల్‌ పటేల్‌ పెవిలియన్‌ పంపించాడు. దాంతో పవర్‌ప్లే ముగిసే సరికి దక్షిణాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది. ఆ తర్వాత యుజ్వేంద్ర చాహల్‌ తన బౌలింగ్‌ సత్తాను ప్రదర్శించారు. స్వల్ప వ్యవధిలో డ్వేన్‌ ప్రిటోరియస్‌ (20), వాండర్‌ డుసెన్‌ (1) వికెట్లు పడగొట్టాడు. హర్షల్‌ పటేల్‌ ప్రమాదకర మిల్లర్‌ (3)ను ఔట్‌ చేసి ప్రత్యర్థిపై మరింత ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలో హెన్రిచ్‌ క్లాసెన్‌ కాసేపు టీమ్‌ఇండియా బౌలర్లను ప్రతిఘటించాడు. అతడిని 14.5వ బంతికి యూజీ పెవిలియన్‌ పంపడంతో సఫారీలు 100/6తో వెనకబడ్డారు. వరుస వికెట్లు పడటంతో రన్‌రేట్‌ పెరిగి ఒత్తిడికి గురైన ఆ జట్టు చివరికి 131కి పరిమితమైంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Maruti Suzuki Swift Price Hike: స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Punjab Kings vs Mumbai Indians Highlights | ముంబయి ఆల్ రౌండ్ షో... పంజాబ్‌కు తప్పని ఓటమి | ABPAsaduddin Owaisi on Madhavi Latha | మసీదు ముందర బాణం వేసిన మాధవి లత... ఒవైసీ ఫుల్ ఫైర్ | ABP DesamAC Helmet | Summer | Vadodara Traffic Police | వడోదర ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్ | ABP DesamLoksabha Elections 2024 Phase 1 | రేపే తొలి దశ ఎన్నికలు... పోలింగ్ సిబ్బంది కష్టాలు చూడండి | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Maruti Suzuki Swift Price Hike: స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
Nikhil Siddhartha: కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ -  తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ - తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Best Automatic Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
Embed widget