Umpire Kumar Dharmasena Fielding: మ్యాచ్‌లో క్యాచ్ పట్టేందుకు ట్రై చేసిన అంపైర్ కుమార ధర్మసేన, నెటిజన్ల రియాక్షన్ చూశారా
SL vs AUS 3rd ODI Match Highlights: ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తాను అంపైర్ అని మరిచిపోయి బ్యాటర్ కొట్టిన బంతిని క్యాచ్ పట్టే ప్రయత్నం చేశారు.
Umpire Kumar Dharmasena: శ్రీలంక, ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తాను అంపైర్ అని మరిచిపోయి బ్యాటర్ కొట్టిన బంతిని క్యాచ్ పట్టే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన నెటిజన్లు అంపైర్ పై ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. రంగంలోకి దిగేందుకు అంపైర్ సిద్ధంగా ఉన్నారని కొందరు కామెంట్ చేయగా, తాను ఆటగాడిని కాదని కరెక్ట్ టైమ్‌కు అంపైర్ గుర్తించారని కొందరు స్పందిస్తున్నారు.
Catch! Umpire Kumar Dharmasena looks like he wants to get into the action...
— cricket.com.au (@cricketcomau) June 19, 2022
Thankfully he didn't #SLvAUS pic.twitter.com/M4mA1GuDW8
అసలేం జరిగిందంటే.. కొలంబో వేదికగా శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లు ఆదివారం మూడో వన్డేలో తలపడ్డాయి. 5 వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు 1-1తో ఉన్నాయి. మూడో మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్ సందర్భంగా ఫన్నీ ఘటన జరిగింది. వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ హాఫ్ సెంచరీకి దగ్గర్లో ఉండగా, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 18 బంతుల్లో 33 పరుగులతో ఉన్నాడు. బ్యాటర్ కొట్టిన బంతి స్క్వేర్ లెగ్ వైపుగా గాల్లోకి లేచింది. అక్కడే నిల్చున్న అంపైర్ కుమార ధర్మసేన ఆ బాల్‌ను క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించారు. అయితే తాను అంపైర్ నని చివరి సెకన్లలో స్ట్రైక్ కావడంతో బంతిని వదిలేశారు.
— Russel Arnold (@RusselArnold69) June 19, 2022
శ్రీలంకకు చెందిన ధర్మసేన తాను ఇప్పుడు కూడా లంక ఆటగాడిగా ఫీలవుతున్నారని కొందరు నెటిజన్లు కామెంట్ చేయగా.. రంగంలోకి దిగేందుకు మరోసారి సిద్ధంగా ఉన్న ధర్మసేన అని ఫన్నీగా స్పందించారు. శ్రీలంక తాజా, మాజీ ఆటగాళ్లు కూడా ధర్మసేన యాక్షన్‌పై రియాక్ట్ అయ్యారు. లంక మాజీ క్రికెట్ రస్సెల్ ఆర్నాల్డ్ ఫన్నీ మీమ్‌తో క్రికెట్ కామ్ ఏయూ పోస్టుకు రిప్లై ఇచ్చారు.
He timely remembered that he is NOT an SL player anymore... 😄
— Akhil 🇮🇳 (@akhil_131) June 19, 2022
లంక అద్భుత విజయం..
ఈ వన్డేలో లంక మరో 9 బంతులు మిగిలాండగానే ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. పథుమ్ నిసంక అద్భుత తొలి శతకంతో లంక విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది.
Going back to his days, man! 🤣 https://t.co/tR9CzxRHt4
— NusandNas (@NusandNas) June 19, 2022
హెడ్ 70 నాటౌట్, ఫించ్ 62 పరుగులతో రాణించగా లంక బౌలర్ వండర్‌సే 3 వికెట్లు పడగొట్టాడు. ఛేజింగ్‌లో లంక ఆటగాడు నిసంక 137, మెండిస్ 87 (రిటైర్డ్ హర్ట్)తో రాణించడంతో మరో 9 మిగిలుండగానే మూడో వన్డేలో లంక గెలుపొందింది. 5 వన్డేల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది.
Luckily he remembered last second his job is not to catch it 🙈🤣 https://t.co/67LkaOUiJy
— Rach🐯 (@rhoftonphoto) June 19, 2022
Also Read: IND Vs SA 5th T20I: మ్యాచ్‌ను ముంచేసిన వరుణుడు - వర్షం కారణంగా రద్దయిన ఐదో టీ20!
Also Read: Yuvraj Singh: కొడుకు పేరును సోషల్ మీడియాలో ప్రకటించిన యువరాజ్ - ఏం పేరు పెట్టారంటే?