అన్వేషించండి

India Vs South Africa: సూర్యకుమార్‌ అరుదైన రికార్డు , ఆరోన్‌ ఫించ్‌ రికార్డు బద్దలు

India Vs South Africa 2nd T20I: టీమిండియా టీ 20 సారధి సూర్యకుమార్‌ యాదవ్‌ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. బంతుల పరంగా అత్యంత వేగంగా 2 వేల పరుగులను పూర్తి చేసిన బ్యాటర్‌గానిలిచాడు.

టీమిండియా టీ 20 సారధి సూర్యకుమార్‌ యాదవ్‌ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. పొట్టి క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. బంతుల పరంగా అత్యంత వేగంగా 2 వేల పరుగులను పూర్తి చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ ఆరోన్ ఫించ్ రికార్డును సూర్యకుమార్‌ యాదవ్‌ బద్దలు కొట్టాడు. ఆరోన్ ఫించ్ 1283 బంతుల్లో 2 వేల పరుగులను పూర్తి చేయగా... సూర్యకుమార్ యాదవ్ 1164 బంతుల్లోనే 2 వేల పరుగుల మార్కు అందుకున్నాడు. ఇప్పటివరకు ఆరోన్ ఫించ్ పేరు మీద ఉన్న రికార్డు బద్దలైంది. సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ 20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఈ రికార్డు సృష్టించాడు. ఇన్నింగ్స్‌ల పరంగా టీ20 క్రికెట్‌లో వేగంగా 2 వేల పరుగుల చేసిన మూడో బ్యాటర్‌గా సూర్యా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో కలిసి సమంగా నిలిచాడు. వీరిద్దరు 56 ఇన్నింగ్స్‌ల్లోనే 2 వేల పరుగులు పూర్తి చేసుకున్నారు.

ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవ్వగా.. రెండో మ్యాచ్‌ను ఆతిథ్య ప్రొటీస్‌ విజయం సాధించింది. అన్ని విభాగాల్లో రాణించిన దక్షిణాఫ్రికా టీమిండియాపై సాధికార విజయం సాధించింది. టీమ్‌ఇండియా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్థతిలో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు 19.3 ఓవర్లలో 180 పరుగులు చేసింది. ఈ పరిస్థితుల్లో వర్షం కురవడంతో ప్రొటీస్‌ లక్ష్యాన్ని 15 ఓవర్లలో 152 పరుగులకు నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని 13.5 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా... టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆరంభంలోనే భారత జట్టుకు దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. యశస్వి జైస్వాల్‌ , శుభ్‌మన్‌ ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్‌ చేరిపోయారు. జైస్వాల్‌ను జాన్సన్‌ అవుట్‌ చేయగా... గిల్‌ను విలియమ్స్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ తిలక్‌ వర్మ 29 పరుగులతో రాణించడం...కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ క్రీజులో నిలబడడంతో ఇన్నింగ్స్‌ ముందుకు సాగింది.  తిలక్‌, సూర్య చూడచక్కని షాట్లతో అలరించారు. కొయెట్జీ బౌలింగ్‌లో వరుసగా 6, 4 దంచిన సూర్య.. విలియమ్స్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాడు. జట్టు స్కోరు 55 పరుగుల వద్ద తిలక్‌ వర్మ పెవిలియన్‌ చేరాడు. కానీ ఆ తర్వాత రింకూ సింగ్‌తో కలిసి సూర్య స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. పది ఓవర్లు ముగిసే సరికి భారత్‌ మూడు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. తొలి 11 బంతుల్లో 9 పరుగులే చేసిన రింకూ క్రీజులో కుదురుకున్న తర్వాత.. జాన్సన్‌ ఓవర్లో వరుసగా 4, 4 కొట్టాడు. ఫెలుక్వాయో ఓవర్లో మూడు బంతులను బౌండరీ దాటించాడు.

కానీ ఇన్నింగ్స్‌ జోరుగా సాగిపోతున్న దశలో సూర్య ఔట్‌ కావడంతో 70 పరుగుల నాలుగో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. సూర్యకుమార్‌ యాదవ్‌ 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 56 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత జితేశ్‌ శర్మ ఇలా వచ్చి అలా వెనుదిరిగాడు. జడేజా 19 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. చివర్లో రింకూ సింగ్‌ చెలరేగిపోయాడు. కేవలం 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. రింకు సింగ్‌ 39 బంతుల్లో 68 పరుగులు చేశాడు. చివరి ఓవర్‌ తొలి మూడు బంతుల్లో భారత జట్టు.. జడేజా, అర్ష్‌దీప్‌ వికెట్లు కోల్పోయింది. తర్వాత వర్షం రావడంతో ఇన్నింగ్స్‌ అక్కడే ఆగిపోయింది. దీంతో వర్షం వల్ల టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌ 19.3 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. వర్షం తగ్గకపోవడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 15 ఓవర్లలో 152 పరుగులుగా నిర్దేశించారు. భారత బౌలర్లు విఫలం కావడంతో ప్రొటీస్‌  13.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

టాప్ హెడ్ లైన్స్

BCCI Selection Twist: అగార్కర్ పై వేటు వేసేందుకు బిసిసిఐ ప్లాన్..! లక్ష్మణ్ కి చీఫ్ సెలెక్టర్ పగ్గాలు, రోహిత్ రిటైర్మెంట్ వివాదంలో ఊహించ‌ని ట్విస్ట్!
అగార్కర్ పై వేటు వేసేందుకు బిసిసిఐ ప్లాన్..! లక్ష్మణ్ కి చీఫ్ సెలెక్టర్ పగ్గాలు, రోహిత్ రిటైర్మెంట్ వివాదంలో ఊహించ‌ని ట్విస్ట్!
IND vs SL Test Series Updates: లంకలో ల్యాండైన టీమ్ ఇండియా.. ఫ్లైట్ ఎక్కని టాపార్డ‌ర్ బ్యాటర్, తొలి టెస్టు ఆడ‌టంపై సందిగ్ధం !
లంకలో ల్యాండైన టీమ్ ఇండియా.. ఫ్లైట్ ఎక్కని టాపార్డ‌ర్ బ్యాటర్, తొలి టెస్టు ఆడ‌టంపై సందిగ్ధం !
BCCI Pension Rules: రహానే రిటైర్మెంట్ డెసిషన్ తో మళ్లీ చర్చల్లోకి బిసిసిఐ పెన్షన్ స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లో పడే అమౌంట్ ఎంతో తెలిస్తే షాకే
రహానే రిటైర్మెంట్ డెసిషన్ తో మళ్లీ చర్చల్లోకి బిసిసిఐ పెన్షన్ స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లో పడే అమౌంట్ ఎంతో తెలిస్తే షాకే
BCCI Message To Shami : బుమ్రా ప్లేస్ లో ఆకిబ్ నబీ ఎంట్రీ.. షమీ ఆశలపై  నీళ్లు, టీమ్ ఇండియా తలుపులు మూసుకుపోయినట్లేనా!
బుమ్రా ప్లేస్ లో ఆకిబ్ నబీ ఎంట్రీ.. షమీ ఆశలపై  నీళ్లు, టీమ్ ఇండియా తలుపులు మూసుకుపోయినట్లేనా!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Embed widget