అన్వేషించండి

Sri Lanka Historic Chase: 430 ర‌న్స్ టార్గెట్ ఊడ్చేసిన లంక.. బ్రూక్ రికార్డు శతకం వృథా, వన్డే చరిత్రలో రెండో అత్యధిక ఛేజింగ్ తో సరికొత్త రికార్డు

హ్యారీ బ్రూక్ డబుల్ సెంచరీతో ఇంగ్లండ్ నిర్దేశించిన 430 పరుగుల కొండంత లక్ష్యాన్ని శ్రీలంక ఛేదించి వన్డే చరిత్రలోనే రెండో అతిపెద్ద రికార్డు విజయం సాధించింది.

Sri Lankan Batters Stun England With Monumental 430 Run Chase In Rawalpindi Tri Series Thriller: పాకిస్థాన్ వన్డే ట్రై సిరీస్ 2026లో భాగంగా గురువారం రావల్పిండి వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో శ్రీలంక అద్భుత రికార్డును నమోదు చేసింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 430 పరుగుల అసాధ్యమైన లక్ష్యాన్ని లంక బ్యాటర్లు వేటాడి వన్డే క్రికెట్ చరిత్రలోనే రెండో అత్యధిక విజయవంతమైన ఛేజింగ్‌ను నమోదు చేశారు. 2006లో జోహన్నెస్‌బర్గ్‌లో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా 438/9 స్కోరుతో ఛేదించిన మ్యాచ్ మాత్రమే దీనికంటే ముందుంది. ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కేవలం 116 బంతుల్లోనే 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 202 పరుగులు చేసి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ రికార్డు నెలకొల్పాడు. జో రూట్ (69), విల్ జాక్స్ (66 నాటౌట్) రాణించడంతో ఇంగ్లండ్ 429/4 భారీ స్కోరు సాధించినప్పటికీ, ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు.

రత్నాయకే శతక గర్జన: ఫెర్నాండో బాధ్యతాయుత ఇన్నింగ్స్
430 పరుగుల భారీ ఛేజింగ్‌లో శ్రీలంక ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో అవిష్క ఫెర్నాండో, పవన్ రత్నాయకే అద్భుత భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. రత్నాయకే కేవలం 106 బంతుల్లోనే 130 పరుగులతో సూపర్ సెంచరీ బాది జట్టును పోటీలోకి తెచ్చాడు. మరో ఎండ్‌లో నిలకడగా ఆడిన అవిష్క ఫెర్నాండో 83 బంతుల్లో 97 పరుగులు చేసి కేవలం మూడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. వీరిద్దరి నిలకడైన ఆటతీరుతో శ్రీలంక స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. 

దాసున్ శనక మెరుపు విధ్వంసం: 50 బంతుల్లో 97 పరుగులు
మిడిల్ ఓవర్లలో క్రీజులోకి వచ్చిన దాసున్ శనక విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోస్తూ కేవలం 50 బంతుల్లోనే ఎనిమిది భారీ సిక్సర్లతో 97 పరుగులు సాధించాడు. శనక కూడా మూడు పరుగుల దూరంలో సెంచరీ మిస్సయినప్పటికీ, అతడి మెరుపు బ్యాటింగ్ మ్యాచ్‌ను లంక వైపు తిప్పేసింది.

లియనాగే అజేయ పోరాటం: చారిత్రక విజయం సొంతం
ఆఖరి ఓవర్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న వేళ జనిత్ లియనాగే అజేయ అర్ధ శతకంతో కడవరకు నిలిచి పోరాడాడు. చివరకు శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి 430 పరుగులు చేసి చిరస్మరణీయ గెలుపును అందుకుంది. ఈ విజయంతో  భారత్‌ రికార్డులను దాటి లంక దూసుకెళ్లింది. మొత్తం మీద‌ పురుషుల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక విజయవంతమైన రన్ ఛేజింగ్‌ల రికార్డుల్లో 2006లో జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా ఆస్ట్రేలియాపై 438/9 స్కోరుతో విజయం సాధించిన దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఇక‌ రావల్పిండిలో ఇంగ్లండ్‌పై 430/8 పరుగులు చేసి గెలిచిన శ్రీలంక రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో గువాహటిలో వెస్టిండీస్‌పై 406/2 స్కోరుతో గెలిచిన ఇండియా మూడో స్థానంలో, 2025లో డుండీలో స్కాట్లాండ్‌పై 374/6 సాధించిన నెదర్లాండ్స్ నాలుగో స్థానంలో ఉన్నాయి. అలాగే 2016 డర్బన్ వన్డేలో ఆస్ట్రేలియాపై 372/6తో గెలిచిన దక్షిణాఫ్రికా ఐదో స్థానంలో, 2019 బ్రిడ్జ్‌టౌన్‌లో వెస్టిండీస్‌పై 364/4 నమోదు చేసిన ఇంగ్లండ్ ఆరో స్థానంలో నిలవగా, 2013 జైపూర్ పోరులో ఆస్ట్రేలియాపై 362/1తో ఘనవిజయం సాధించిన టీమిండియా ఏడో స్థానంలో ఉంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ravi Shastri Recall: వరల్డ్ కప్ మ్యాచ్‌ను మలుపు తిప్పిన పంత్ బ్రేక్.. సౌతాఫ్రికా గుండె పగిలిన వేళ, పోలాక్ కన్నీటి రియాక్షన్
వరల్డ్ కప్ మ్యాచ్‌ను మలుపు తిప్పిన పంత్ బ్రేక్.. సౌతాఫ్రికా గుండె పగిలిన వేళ, పోలాక్ కన్నీటి రియాక్షన్
Gill, Iyer Swap: వర్షార్పణమైన హామిల్టన్ వన్డే.. గిల్, రాహుల్ టెస్ట్ టీమ్‌లోకి వెళ్లడంతో నాలుగో వన్డే నుంచి శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు
వర్షార్పణమైన హామిల్టన్ వన్డే.. గిల్, రాహుల్ టెస్ట్ టీమ్‌లోకి వెళ్లడంతో నాలుగో వన్డే నుంచి శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు
Gambhir Coaching Split: రెండు గ్రూపులుగా విడిపోనున్న భారత కోచింగ్ స్టాఫ్.. గంభీర్ వన్డేలతోనే ఉండగా, టెస్టుల కోసం వెల్లింగ్టన్ వెళ్లనున్న మోర్కెల్, సితాన్షు
రెండు గ్రూపులుగా విడిపోనున్న భారత కోచింగ్ స్టాఫ్.. గంభీర్ వన్డేలతోనే ఉండగా, టెస్టుల కోసం వెల్లింగ్టన్ వెళ్లనున్న మోర్కెల్, సితాన్షు
Hardik - Arshdeep Swap: PBKSకు హార్దిక్..! MIకు అర్ష్‌దీప్ .. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని మెగా ట్రేడింగ్
PBKSకు హార్దిక్..! MIకు అర్ష్‌దీప్ .. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని మెగా ట్రేడింగ్
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Action On MLAs: ఎమ్మెల్యేల ‘కోటరీ’ రాజకీయంపై టీడీపీ అధిష్ఠానం ఉక్కుపాదం - పక్కనబెట్టే దిశగా టీడీపీ ప్లాన్.. త్వరలోనే మార్పులు?
ఎమ్మెల్యేల ‘కోటరీ’ రాజకీయంపై టీడీపీ అధిష్ఠానం ఉక్కుపాదం - పక్కనబెట్టే దిశగా టీడీపీ ప్లాన్.. త్వరలోనే మార్పులు?
Pending Municipalities Elections : ఏపీలో ఆఖరి ఘట్టానికి స్థానిక పోరు - 23 పెండింగ్ మున్సిపాలిటీలకూ నేడో రేపో షెడ్యూల్ !
ఏపీలో ఆఖరి ఘట్టానికి స్థానిక పోరు - 23 పెండింగ్ మున్సిపాలిటీలకూ నేడో రేపో షెడ్యూల్ !
CII Partnership Summit: ఈ 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్- విశాఖలో డ్రోన్లపై నిషేధం.. రెడ్ జోన్ అలర్ట్
ఈ 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్- విశాఖలో డ్రోన్లపై నిషేధం.. రెడ్ జోన్ అలర్ట్
కార్తీకమాసంలో దీపాలు ఎక్కడ వెలిగించాలి? ఎలా వెలిగించాలి?
కార్తీకమాసంలో దీపాలు ఎక్కడ వెలిగించాలి? ఎలా వెలిగించాలి?
Sonia Gandhi Book: మోదీతో సిద్ధాంత పరంగానే పోరాటం.. ఇందిరా గాంధీ కోపం చూసి భయపడ్డా - ఆత్మకథలో సోనియా గాంధీ
మోదీతో సిద్ధాంత పరంగానే పోరాటం.. ఇందిరా గాంధీ కోపం చూసి భయపడ్డా - ఆత్మకథలో సోనియా గాంధీ
Royal Enfield Himalayan 750: 743cc ఇంజిన్, 6-యాక్సిస్ IMU, క్రూయిజ్ కంట్రోల్.. హిమాలయన్ 750 ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750.. యూత్‌ తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు
Ravi Shastri Recall: వరల్డ్ కప్ మ్యాచ్‌ను మలుపు తిప్పిన పంత్ బ్రేక్.. సౌతాఫ్రికా గుండె పగిలిన వేళ, పోలాక్ కన్నీటి రియాక్షన్
వరల్డ్ కప్ మ్యాచ్‌ను మలుపు తిప్పిన పంత్ బ్రేక్.. సౌతాఫ్రికా గుండె పగిలిన వేళ, పోలాక్ కన్నీటి రియాక్షన్
Kolkata Sairang Express Derail: పట్టాలు తప్పిన కోల్‌కతా- సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు.. తప్పిన పెను ప్రమాదం- అసలేం జరిగింది
పట్టాలు తప్పిన కోల్‌కతా- సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు.. తప్పిన పెను ప్రమాదం- అసలేం జరిగింది
Embed widget