Sri Lanka శ్రీలంక క్రికెట్‌లో పెను మార్పు - టీం 'హెడ్ కోచ్'గా సనత్ జయసూర్య
Sri Lanka head coach శ్రీలంక క్రికెట్‌లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా సనత్ జయసూర్యను నియమించింది.
Sanath Jayasuriya has been appointed Sri Lanka Head Coach: పేలవమైన ప్రదర్శనతో కనుమరుగు ఖాయమేనా అన్న చర్చ జరుగుతున్న టైంలో శ్రీలంక జట్టును విజయాల పట్టాలు ఎక్కించిన జయసూర్యను ప్రధాన కోచ్‌గా నియమిస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. జట్టులో ఉత్సాహం నింపి కీలకమైన సిరీస్‌లు గెలుచుకునేలా చేసిన ఆయనకే బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ప్రకటించింది. మరిన్ని విజయాలు సాధించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని భావిస్తోంది.
శ్రీలంక ఇటీవల సొంతగడ్డపై ఆడిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో న్యూజిలాండ్‌ను ఓడించింది. అంతకుముందు సొంతగడ్డపై జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 2-0తో భారత్‌ను ఓడించింది. సిరీస్‌లో తొలి వన్డే టైగా ముగిసింది. జట్టు అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న టైంలో కీలక నిర్ణయం తీసుకుంది. బోర్డు కొత్త ప్రధాన కోచ్‌గా సనత్ జయసూర్యను నియమిస్తున్నట్లు ప్రకటించింది.
జయసూర్యకు జట్టును నడిపే బాధ్యత సడెన్‌గా ఆయనకు ఇవ్వలేదు. ఇప్పటికే ఆయన జట్టుకు తాత్కాలిక కోచ్‌గా ఉన్నారు. ఇప్పుడు జాతీయ జట్టుకు పూర్తి స్థాయి ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. అక్టోబర్ 1, 2024 నుంచి మార్చి 31, 2026 వరకు ప్రధాన కోచ్‌గా ఉంటారు.
సనత్ జయసూర్యను శ్రీలంక టీంకు ప్రధాన కోచ్‌గా నియమించిన విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేసింది. "శ్రీలంక క్రికెట్ జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా సనత్ జయసూర్య నియామకాన్ని ప్రకటిస్తామని" రాసుకొచ్చింది.
"ఇటీవల భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌తో జరిగిన పర్యటనలdలో జయసూర్య 'తాత్కాలిక కోచ్'గా బాధ్యతలు చేపట్టారు. జట్టును విజయవంతంగా నడిపించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆయన్నే పూర్తి స్థాయి ప్రధాన కోచ్‌గా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది" అని రాశారు.
Sri Lanka Cricket wishes to announce the appointment of Sanath Jayasuriya as the head coach of the national team.
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) October 7, 2024
The Executive Committee of Sri Lanka Cricket made this decision taking into consideration the team’s good performances in the recent tours against India, England,… pic.twitter.com/IkvAIJgqio
బ్యాటింగ్‌లో వేగం రుచి చూపించిన జయసూర్య
క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతంగా పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లలో జయసూర్య ఒకడు. బీభత్సమైన బ్యాటర్‌గా ఆయనకు పేరు ఉంది. 1989 నుంచి 2011 వరకు శ్రీలంక తరపున ఆడాడు. ఈ కాలంలో అతను 110 టెస్టులు, 445 వన్డేలు, 31 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. టెస్టుల్లో అతను 40.07 సగటుతో 6973 పరుగులు చేశారు. ఇది కాకుండా వన్డేలో అతను 36.75 సగటుతో 13430 పరుగులు చేశారు. T20ల్లో 23.29 సగటు, 129.15 స్ట్రైక్ రేట్‌తో 629 పరుగులు చేశారు.
బౌలింగ్‌తో కూడా ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు జయసూర్య. టెస్టుల్లో బౌలింగ్ చేసిన జయసూర్య 98 వికెట్లు తీసుకున్నారు. వన్డేల్లో 323 వికెట్లు పడగొట్టారు. టీ20లో కూడా తగ్గలేదు. 19 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు.