అన్వేషించండి

Smriti Mandhana: అభిమానులు గర్వపడండి, ఈ సాలా కప్‌ మనదే: స్మృతి

WPL 2024 RCB Win: ఆర్సీబీ ఉమెన్స్ జట్టు కెప్టెన్ స్మృతి మంధాన ఈసాలా కప్ నమదే నినాదంపై స్పందించింది. తన ఫీలింగ్‌ను మాటల్లో వర్ణించలేనని తెలిపింది. తమ జట్టు ప్రదర్శన పట్ల భావోద్వేగానికి గురైంది.

Smriti Mandhana Reacts After RCB Win:  ఐపీఎల్‌(IPL) ప్రారంభమైనప్పటి నుంచి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) బరిలో దిగినప్పటి నుంచి వినిపిస్తున్న ఒకే మాట. ఈ సాలా కప్‌ మనదే అంటూ హంగామా చేసి.... తీరా కీలక మ్యాచ్‌లలో ఓడిపోతూ పురుషుల జట్టుకు అందని ద్రాక్షగా ఉన్న టైటిల్‌ విజేత కలను ఉమెన్స్‌ ప్రీమియర్‌ల లీగ్‌లో అమ్మాయిలు నెరవేర్చారు. కోహ్లీ, డివిలియర్స్‌ సహా దిగ్గజ ఆటగాళ్లతో చాలా పటిష్టంగా కనింపించిన RCB... ఐపీఎల్‌లో ప్రతీసారి టైటిల్‌ ఫేవరెట్‌గానే బరిలోకి దిగేది. కానీ విరాట్‌ కోహ్లీ(Virat kohli), అనిల్‌ కుంబ్లే(Anil Kumble), ఏబీ డివిలియర్స్‌(ABD), ఫాఫ్‌ డుప్లెసిస్‌ వంటి దిగ్గజాలు.. ఈ కలను సాకారం చేయలేకపోయారు. దాదాపుగా 16 ఏళ్లుగా దిగ్గజ క్రికెటర్లకు సాధ్యంకాని కలను ఆర్సీబీ అమ్మాయిలు సాకారం చేశారు. దశాబ్దంన్నర కాలంగా పురుషుల జట్టు సాధించలేకపోతున్న ట్రోఫీ కలను.. డబ్ల్యూపీఎల్‌ రెండో సీజన్‌ ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి నిజం చేశారు. ఈ చారిత్రక విజయంపై తొలిసారి బెంగళూరు కెప్టెన్‌ స్మృతి మంధాన స్పందించింది.

స్మృతి ఏమందంటే...
ఆర్సీబీ ఉమెన్స్ జట్టు కెప్టెన్ స్మృతి మంధాన ఈసాలా కప్ నమదే నినాదంపై స్పందించింది. ఇప్పుడు తన ఫీలింగ్‌ను మాటల్లో వర్ణించలేనని తెలిపింది. తమ జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉన్నానని భావోద్వేగానికి గురైంది. సరైన సమయంలో సమష్టిగా రాణించి అద్భుతం సృష్టించామని మంధాన తెలిపింది. గత సీజన్ ఓటమి నుంచి ఠాలు నేర్చుకుని.. ఈ సీజన్‌లో రాణించామని తెలిపింది. తమ ఫ్రాంఛైజీ కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చింది. ఇది మీ టీమ్.. మీ ఇష్టమున్న నిర్ణయాలు తీసుకోండని చెప్పిందని తెలిపింది. ఈ టైటిల్ ఆర్సీబీకి ఎంతో విలువైందన్న స్మృతి.... ట్రోఫీ గెలిచింది తాను కాదని.. ఇది జట్టు విజయమని తెలిపింది. ప్రతిసారి ఈసాలా కప్ నమదే  అని నినదించే అభిమానులకు స్మృతి చక్కటి సందేశాన్ని ఇచ్చింది. ఈసాలా కప్ మనదే అని గర్వంగా చెప్పండి. తనకు కన్నడ మరీ అంత గొప్పగా ఏమీ రాదని... కానీ ఫ్యాన్స్‌కు ఈ మెసేజ్ ఇవ్వడం ముఖ్యమని స్మృతి మంధాన పేర్కొంది. 


వీడియోకాల్‌లో అభినందనలు
మహిళల జట్టు టైటిల్ గెలిచిన అనంతరం అర్సీబీ ప్లేయర్లతో కింగ్‌ కోహ్లీ వీడియో కాల్‌ చేసి మాట్లాడాడు. కెప్టెన్ స్మృతి మంధానతో కాసేపు మాట్లాడిన ఈ స్టార్‌ బ్యాటర్‌... అనంతరం ఇతర ప్లేయర్లతో కూడా మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తమ ఫ్రాంచైజీకి డబ్ల్యూపీఎల్‌ టైటిల్‌ దక్కడంతో ఐపీఎల్‌ ఆర్‌సీబీ స్టార్స్‌ విరాట్‌ కోహ్లి, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, మాజీ సభ్యులు క్రిస్‌ గేల్, ఏబీ డివిలియర్స్, మాజీ యాజమాని విజయ్‌ మాల్యా తదితరులు అభినందనలు తెలిపారు. 
 
అభిమానుల సంబరాలు
ఈ సాలా కప్‌ మనదే అని ప్రతి ఏటా ఎదురుచూస్తున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అభిమానులకు ఈసాలా కప్‌ దక్కడంతో ఎక్కడా ఆగడం లేదు. కోట్లాది మంది అభిమానుల కల నెరవేరడంతో సోషల్ మీడియా మోతెక్కిపోతోంది. కంగ్రాచ్యులేషన్‌ ఆర్సీబీ.. ఈసాలా కప్‌ మనదే.. ఈసాలా కప్‌ నమదే హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్‌ మీడియాలో ఆర్సీబీ అభిమానులు రచ్చ చేస్తున్నారు

టాప్ హెడ్ లైన్స్

KKR Big Move: టీమ్ ఇండియా కోచ్ పదవి వీడిన మరుసటి రోజే ఆ ఐపీఎల్ టీమ్ లోకి రీ-ఎంట్రీ.. హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా టెన్ డోషేట్
టీమ్ ఇండియా కోచ్ పదవి వీడిన మరుసటి రోజే ఆ ఐపీఎల్ టీమ్ లోకి రీ-ఎంట్రీ.. హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా టెన్ డోషేట్
Shubman Gill Reclaims No1 ODI Rank: వన్డేల్లో నంబర్ వన్ ను తిరిగి దక్కించుకున్న‌ గిల్.. భారీగా జంప్ చేసిన‌ వైభవ్ సూర్యవంశీ 
వన్డేల్లో నంబర్ వన్ ను తిరిగి దక్కించుకున్న‌ గిల్.. Rankingsలో భారీగా జంప్ చేసిన‌ వైభవ్ సూర్యవంశీ 
Vaibhav Sooryavanshi News: వైభవ్ సూర్యవంశీకి ప్ర‌మోష‌న్.. ఆజ‌ట్టుకు  వైస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్న 15 ఇయ‌ర్స్ కిడ్
వైభవ్ సూర్యవంశీకి ప్ర‌మోష‌న్.. ఆ జ‌ట్టుకు  వైస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్న 15 ఇయ‌ర్స్ కిడ్
IPL Brand Value: క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!
క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Commonwealth Games 2026: CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
Embed widget