Shreyas Iyer Toss Luck Streak: టాస్ లక్ లో ధోని, కోహ్లీ సరసన శ్రేయస్ .. వరుసగా ఐదోసారి అదృష్టం వరించినా దక్కని ఫస్ట్ విక్టరీ, ట్రెంట్ బ్రిడ్జ్ టీ20 లో టీమిండియాలో మార్పులు
టాస్ గెలవడంలో వరుసగా ఐదోసారి సక్సెస్ అయి రోహిత్ రికార్డును శ్రేయస్ అయ్యర్ ఈక్వల్ చేసినా కెప్టెన్ గా ఫస్ట్ విక్టరీ కోసం వెయిటింగ్ కంటిన్యూ అవుతోంది.

Shreyas Iyer Wins Fifth Consecutive T20I Toss: ఇండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు టాస్ లక్ ప్రెజెంట్ నెక్స్ట్ లెవెల్ లో నడుస్తోంది. ఇంగ్లాండ్‌తో మంగళవారం ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న థర్డ్ టీ20 మ్యాచ్ లో 31 ఏళ్ల అయ్యర్ వరుసగా ఐదోసారి టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ అద్భుతమైన ఫీట్ తో టీ20 ఫార్మాట్ లో వరుసగా 5 టాస్ లు గెలిచిన ఎలైట్ ఇండియన్ కెప్టెన్ల లిస్టులో అయ్యర్ ప్లేస్ సంపాదించాడు. ఇండియా క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ లీడర్ ఎంఎస్ ధోని మే 2010 నుంచి ఫిబ్రవరి 2012 మధ్య వరుసగా 7 టాస్ లు గెలిచి టాప్ రికార్డ్ హోల్డర్ గా ఉండగా, విరాట్ కోహ్లీ 2019 లో వరుసగా 6 టాస్ లు గెలిచాడు. రోహిత్ శర్మ ఫిబ్రవరి 2020 నుంచి ఫిబ్రవరి 2022 మధ్య వరుసగా 5 సార్లు టాస్ గెలవగా, ప్రెజెంట్ అయ్యర్ ఆ రికార్డును ఈక్వల్ చేశాడు. ధోని సెప్టెంబర్ 2007 లోనూ ఒకసారి వరుసగా 5 టాస్ లు గెలిచాడు.
#TeamIndia's Playing XI that will take the field at Trent Bridge 🙌
— BCCI (@BCCI) July 7, 2026
Updates ▶️ https://t.co/jan4S8zsaV#ENGvIND pic.twitter.com/pd7i9lmmko
మైదానంలో మారని ఇండియా తలరాత..
టాస్ లక్ కంటిన్యూ అవుతున్నా గ్రౌండ్ లో మాత్రం ఇండియా తలరాత అస్సలు మారడం లేదు. టీ20 వరల్డ్ కప్ 2026 ముగిసిన తర్వాత ఇండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న శ్రేయస్ అయ్యర్, ఇప్పటివరకు కెప్టెన్ గా ఒక్క మ్యాచ్ లోనూ విక్టరీని రిజిస్టర్ చేయలేకపోయాడు. ఐర్లాండ్ టూర్ లో బ్యాక్ టు బ్యాక్ రెండు మ్యాచ్ లలో ఓడిపోవడం, ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరగాల్సిన ఫస్ట్ టీ20 వర్షం వల్ల రద్దు కావడం జరిగింది. మాంచెస్టర్‌లో జరిగిన సెండ్ టీ20 మ్యాచ్ లోనూ ఇండియా దారుణంగా ఓడిపోవడంతో కెప్టెన్ గా ఆడిన ఫస్ట్ ఫోర్ మ్యాచుల్లోనూ అయ్యర్ కు నిరాశే మిగిలింది. ఈ ట్రెంట్ బ్రిడ్జ్ మ్యాచ్ లోనైనా గెలిచి సిరీస్ లో కంబ్యాక్ ఇవ్వాలని టీమిండియా పక్కా ప్లాన్ తో బరిలోకి దిగింది.
ప్లేయింగ్ ఎలెవన్ నుంచి రవి బిష్ణోయ్ అవుట్..
థర్డ్ టీ20 మ్యాచ్ కోసం ఇండియా తమ ప్లేయింగ్ ఎలెవన్ లో ఒక ఇంట్రెస్టింగ్ చేంజ్ చేసింది. లాస్ట్ మ్యాచ్ లో రెండు నో బాల్స్ వేసి, ఒకే ఓవర్ లో 29 రన్స్ సమర్పించుకుని దారుణంగా ఫెయిల్ అయిన లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ పై మేనేజ్‌మెంట్ వేటు వేసింది. బిష్ణోయ్ ప్లేస్ లో యంగ్ ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ ను టీమ్‌లోకి తీసుకువచ్చింది. పిచ్ కండిషన్స్ పేస్ బౌలింగ్‌కు అనుకూలిస్తుండటంతో ఈ డెసిషన్ తీసుకున్నారు. ఇండియా అఫీషియల్ స్క్వాడ్ లో అభిషేక్ శర్మ, 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), శివం దూబే, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు.
ఇంగ్లాండ్ విన్నింగ్ కాంబినేషన్..
మరోవైపు హోస్ట్ టీమ్ ఇంగ్లాండ్ ఎలాంటి చేంజెస్ లేకుండా సేమ్ విన్నింగ్ కాంబినేషన్ ను కంటిన్యూ చేస్తోంది. ఇంగ్లాండ్ స్క్వాడ్ లో ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్ ఆడుతున్నారు. సిరీస్ లో ఆల్రెడీ 1-0 తో లీడ్ లో ఉన్న ఇంగ్లాండ్‌ను వారి హోమ్ గ్రౌండ్ లో దెబ్బకొట్టడం ఇండియాకు ఒక బిగ్ టాస్క్ అని చెప్పాలి. అయ్యర్ తన టాస్ లక్ ను ఈ మ్యాచ్ లో విక్టరీ లక్ గా మార్చుకుని సిరీస్ ను ఈక్వల్ చేయడానికి ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది. ఇక వర్షం కారణంగా మూడో టీ20 కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది.
ట్రెండింగ్ వార్తలు



















