అన్వేషించండి

Samson Opening Debate: సూర్యవంశీతో పోటీపై సంజూ బోల్డ్ కామెంట్స్, నెగిటివ్ ఆలోచ‌న‌లు ప‌ట్టించుకోన‌ని స్ప‌ష్టం చేసిన శాంస‌న్

అఫ్గానిస్తాన్‌పై మెరుపు హాఫ్ సెంచరీ బాదిన సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీతో పోటీ బయటి ప్రపంచానికి మాత్రమేనంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు

Wicketkeeper Batter Shuts Down Social Media Noise:  అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టీ20 పోరులో 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమ్ ఇండియా ఏ దశలోనూ ఒత్తిడికి లోనుకాకుండా, ఆడుతూ పాడుతూ టార్గెట్ చేజ్ చేసింది. ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ తొలి వికెట్‌కు 88 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జోడించారు. కేవలం 22 బంతుల్లోనే 57 పరుగులు సాధించి సంజూ ఫామ్‌లోకి రావడంతో భారత్ 14.5 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో 15 ఏళ్ల వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీతో పోటీ గురించి వస్తున్న ఊహాగానాలకు సంజూ తనదైన శైలిలో స్పందించాడు. ఫామ్ అనేది తాత్కాలికం, క్లాస్ ఎప్పటికీ శాశ్వతం అని మరోసారి నిరూపించాడు. మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఓపెనింగ్ స్థానం కోసం నెలకొన్న తీవ్ర పోటీపై అడిగిన ప్రశ్నకు సంజూ దీటుగా ఆన్స‌రిచ్చాడు.

Read Also: Brendan Taylor Breaks Sachin's Record: సచిన్ ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డు బ్రేక్.. వన్డేల్లో చరిత్ర సృష్టించిన  టేలర్ 

జట్టు సభ్యుల మధ్య పోటీ లేదు..
ఓపెనింగ్ బెర్త్‌ల వివాదంపై  సంజూ శాంసన్ స్పందిస్తూ, "బయటి ప్రపంచానికి మాత్రమే వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ నాకు పోటీదారులుగా కనిపిస్తారు. కానీ డ్రెస్సింగ్ రూమ్‌లో మేమంతా ఒకే జట్టుగా దేశం కోసం ఆడుతున్నాం. మాకు జట్టు విజయం మాత్రమే ముఖ్యం, ఆ తర్వాతే వ్యక్తిగత ప్రదర్శనలు వస్తాయి. అతడికి అవకాశం ఇచ్చారు, నాకు ఎందుకు రాలేదు అని బాధపడుతూ నెగెటివ్ ఆలోచనలతో కూర్చోవడం మా జట్టు సంస్కృతిలో లేదు. అలాంటి మనస్తత్వాలు ఇక్కడ పనికిరావు" అని పేర్కొన్నాడు.

Read Also: Samson Explosive Fifty: అఫ్గాన్‌ను చిత్తు చేసి సిరీస్ కొల్లగొట్టిన భారత్, శ్రేయ‌స్ ఖాతాలో స్వదేశంలో తొలి ట్రోఫీ .. స‌త్తా చాటిన నితీశ్, అభిషేక్, ఇషాన్.. 

ఆ కామెంట్లు నిరాశ క‌లిగిస్తాయి.. 
సోషల్ మీడియాలో మాజీ క్రికెటర్లు చేసే వ్యాఖ్యల గురించి సంజూ శాంసన్ మాట్లాడుతూ, "సాధారణంగా నేను వైఫై ఆఫ్ చేసి నెగెటివిటీకి దూరంగా ఉంటాను. కానీ కొన్నిసార్లు ఆ కామెంట్లు నా కంట పడుతుంటాయి. ఇండియాలో ఆడుతున్నప్పుడు ఇలాంటి కామెంట్లు ఆటగాళ్లపై ప్రభావం చూపుతాయి. మేం రోబోలం కాదు, మాకు భావోద్వేగాలు ఉంటాయి. గతంలో విమర్శలు నన్ను కూడా బాధించాయి. అయితే అనుభవంతో వాటిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నాను. ఒక షాట్ ఆడే ముందు బయట ఏమనుకుంటారో అని ఆలోచిస్తే నేను ఇలా బ్యాటింగ్ చేయలేను" అని తెలిపాడు.

మూడో టీ20లో సూర్యవంశీ ఆడ‌తాడా..? 
మొదటి రెండు మ్యాచ్‌ల్లో సంజూ, అభిషేక్‌లు రాణించినప్పటికీ, బెంచ్‌పై ఉన్న వైభవ్ సూర్యవంశీకి మూడో టీ20లో అవకాశం ఇస్తామంటూ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సూచ‌న ప్రాయంగా చెప్పాడు. దీంతో ఆఖరి పోరులో ఎవరికి విశ్రాంతి ఇస్తారనేది ఆసక్తిగా మారింది. ఇక ఈ ఈ సిరీస్ ను ఇప్ప‌టికే 2-0తో ఇండియా కైవ‌సం చేసుకోగా, స్వ‌దేశంలో శ్రేయ‌స్ కిదే తొలి సిరీస్ విక్ట‌రీ కావ‌డం విశేషం. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohit Ulva Journey: టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రియల్ హీరో దాకా..  జడేజా కోచ్ శిక్షణలో రాటుదేలిన 18 ఏళ్ల మోహిత్ స్ఫూర్తిదాయక ప్రస్థానం
టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రియల్ హీరో దాకా..  జడేజా కోచ్ శిక్షణలో రాటుదేలిన 18 ఏళ్ల మోహిత్ స్ఫూర్తిదాయక ప్రస్థానం
Mohit Ulva Heroics: ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
Rinku Singh Captaincy:  KKR కెప్టెన్సీ రేసులో ఊహించని ట్విస్ట్.. రహానే రిటైర్మెంట్‌తో రింకూకే పగ్గాలు ఇవ్వాలన్న మాజీ క్రికెట‌ర్
KKR కెప్టెన్సీ రేసులో ఊహించని ట్విస్ట్.. రహానే రిటైర్మెంట్‌తో రింకూకే పగ్గాలు ఇవ్వాలన్న మాజీ క్రికెట‌ర్
Gurnoor Brar News: టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాలో అనూహ్య మార్పులు.. స్పిన్నర్ కుల్దీప్ అవుట్ , పేసర్ బ్రార్‌కు పిలుపు, వెల్లింగ్టన్ చేరుకున్న పంత్
టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాలో అనూహ్య మార్పులు.. స్పిన్నర్ కుల్దీప్ అవుట్ , పేసర్ బ్రార్‌కు పిలుపు, వెల్లింగ్టన్ చేరుకున్న పంత్
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Rains: ఏపీకి మరో తుపాను ముప్పు, వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 18 నుంచి భారీ వర్షాలు
ఏపీకి మరో తుపాను ముప్పు, వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 18 నుంచి భారీ వర్షాలు
Mohit Ulva Journey: టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రియల్ హీరో దాకా..  జడేజా కోచ్ శిక్షణలో రాటుదేలిన 18 ఏళ్ల మోహిత్ స్ఫూర్తిదాయక ప్రస్థానం
టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రియల్ హీరో దాకా..  జడేజా కోచ్ శిక్షణలో రాటుదేలిన 18 ఏళ్ల మోహిత్ స్ఫూర్తిదాయక ప్రస్థానం
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Sarpanch Post Auction: వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
Gig Workers Scheme Bebefits: గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
Fastest Charging Electric Cars: భారత్‌లో అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
భారత్‌లో అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే Electric Vehicles ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
Comedy Thriller OTT : ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget