ICC Champions Trophy: జట్టు ఎంపికలో రోహిత్, గంభీర్ మధ్య విబేధాలు.. ఇద్దరు ప్లేయర్ల విషయంలో భేదాభిప్రాయాలు
జట్టు ఎంపికలో కోచ్, కెప్టెన్ కు మధ్య విబేధాలు ఉన్నట్లు మరోసారి బహిర్గతమైంది. గంభీర్ తాను కలిసి మెలిసి ఉన్నట్లు రోహిత్ చెబుతున్నా, జట్టు ఎంపికలో వారి మధ్య అభిప్రాయ బేధాలు బయట పడుతున్నాయి.

Rohit Sharma News: హెడ్ కోచ్ గౌతం గంభీర్ తో విబేధాలు లేవని భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. కానీ నిజానికి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఎంపికలోనే ఇద్దరి మధ్య లుకలుకలు బయట పడినట్లు తెలుస్తోంది. రెండు విషయాల్లో వారిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చినట్లు సమాచారం. మొదటిది రిజర్వ్ వికెట్ కీపర్ గా సంజూ శాంసన్ ను ప్రకటించాలని గంభీర్ పట్టుపట్టగా రోహిత్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్.. రిషభ్ పంత్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. పంత్ చాలాకాలంగా వైట్ బాల్ క్రికెట్లో రెగ్యులర్ గా ఆడకపోయినా, అతడినే రిజర్వ్ వికెట్ కీపర్ గా ఎంపిక చేసి బ్యాక్ చేసినట్లుగా తెలుస్తోంది. మరోకొటి జట్టు వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయాలని గంభీర్ కోరినట్లు తెలుస్తోంది. అయితే దీనికి రోహిత్ వీటో చేసినట్లు సమాచారం. జట్టు భవిష్యత్తు రిత్యా శుభమాన్ గిల్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. జట్టు ఎంపికలోనే వీరిద్దరి మధ్య ఇలా అభిప్రాయ బేధాలు నెలకొన్నట్లు కథనాలు వస్తున్నాయి.
రిజర్వ్ గా హర్షిత్ రాణా..
ఇంగ్లాండ్ తో మూడు వన్డేల సిరీస్ కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ, అతను బరిలోకి దిగే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఆసీస్ పర్యటనలో వెన్ను నొప్పికి గురైన బుమ్రాకు ఐదు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. దీనిపై అజిత్ అగార్కర్ స్పందించాడు. బుమ్రా గాయంపై ఇప్పటికీ స్పష్టమైన అవగాహన లేదని, ఫిబ్రవరి మొదటి వారంలో దీనిపై స్పష్టత వస్తుందని అప్పటికి దీనిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించాడు. బుమ్రా ఒకవేళ గైర్హాజరైతే అతని ప్లేస్ లో హర్షిత్ రాణాను ఆడిస్తామని పేర్కొన్నాడు. గాయం నుంచి ఎప్పుడు కోలుకుంటాడో చెప్పడం మన చేతిలో లేదని, వీలైనంత త్వరగా తను అందుబాటులోకి రావాలని కోరుకుంటున్నట్లు అగార్కర్ వెల్లడించాడు.
క్రమ శిక్షణ ఉల్లంఘించడంతోనే సంజూపై వేటు..
క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడటంతోనే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే సువర్ణవకాశాన్ని సంజూ శాంసన్ కోల్పోయినట్లు తెలుస్తోంది. దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనడం ద్వారా బీసీసీఐ ఫోకస్ లో పడాలని సంజూ కోరుకున్నాడు. అయితే కేరళ క్రికెట్ సంఘం ధోరణితో అతనికి ఈ సువర్ణావకాశం మిస్సయ్యిందని తెలుస్తోంది. ఇందులో సంజూ తప్పు కూడా ఉందని సమాచారం. విజయ్ హజారే ట్రోఫీ కోసం 30 మందితో కూడిన ప్రిపరేటరీ క్యాంపునకు వచ్చేందుకు సంజూ విముఖత చూపుతూ, తను అందుబాటులో లేనని కేరళ క్రికట్ సంఘానికి తెలిపాడు. క్యాంపు ముగిసి జట్టును ఎంపిక చేశాక, తను జట్టులోకి వస్తానని సంజూ కోరాడని, అతని అభ్యర్థనను తిరస్కరించినట్లు తెలుస్తోంది. జాతీయ జట్టుకు కేరళ సంఘం ద్వారానే సంజూ వేళ్లాడని, అయితే సంఘం నిబంధనలను పాటించకపోవడం ఏంటని సంఘం ప్రెసిడెంట్ జయేశ్ జార్జ్ ఫైరయ్యారు. ఇలా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తే సహించేది లేదని పేర్కొన్నారు. విజయ్ హజారే ట్రోఫీలో ఆడని కారణంగానే చాంపియన్స్ ట్రోపీలో పాల్గొనే చాన్స్ ను సంజూ కోల్పోయాడా అనే విషయం తనకు తెలియదని తెలిపారు.
Also Read: Gambir VS Rohit: గంభీర్ తో విభేదాలపై స్పందించిన రోహిత్.. కరుణ్ నాయర్ కి చోటివ్వకపోవడంపై మాజీల ఫైర్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు


















