పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్ ఈ ఏడాది మార్చి 8న నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
Prithvi Shaw Patch Up With Akriti Agarwal: టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ ప్రేమకథలో మరో ఆసక్తికరమైన మలుపు చోటు చేసుకుంది. నిశ్చితార్థం రద్దు చేసుకున్న ఈ జంట మళ్ళీ ఒక్కటైంది.

- పృథ్వీ షా, ఆకృతి మార్చిలో నిశ్చితార్థం చేసుకుని ప్రేమ ప్రకటించారు.
- సెప్టెంబర్లో విడిపోతున్నట్లు ప్రకటించాక, ఇప్పుడు మళ్లీ కలిశారు.
- తప్పు తెలుసుకుని, మాట్లాడి తమ బంధానికి మరో అవకాశం ఇచ్చారు.
టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw), ఆకృతి అగర్వాల్ (Akriti Agarwal) జంట వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. వీళ్ళిద్దరి ప్రేమ కథ, పెళ్ళి పీటల వరకు వచ్చిన కహాని అటు క్రికెట్, ఇటు ఎంటర్టైన్మెంట్ అభిమానులకు కాస్త తెలుసు. కొన్ని వారాల క్రితం తమ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్న ఈ జంట... ఇప్పుడు మళ్లీ కలిసుండాలని నిర్ణయించుకుంది. తమ బంధానికి మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆకృతి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఎంగేజ్మెంట్ క్యాన్సిల్... మళ్ళీ ప్యాచప్!
నిశ్చితార్థం రద్దు చేసుకున్న కొన్ని వారాలకే సోషల్ మీడియా వేదికగా ఆకృతి అగర్వాల్ మరో ప్రకటన చేశారు. తమ సంబంధం గురించి సన్నిహితులు చెప్పిన మాటలు తన ఆలోచనలపై ప్రభావం చూపాయని ఆమె వెల్లడించారు. పృథ్వీ షాతో నిజాయితీగా మాట్లాడకుండానే నిర్ణయం తీసుకున్నానని, ఆ విషయంలో తనదే తప్పు అని అంగీకరించారు.
నిశ్చితార్థం రద్దు చేసుకున్న తర్వాత ఇద్దరూ కలిసి ప్రశాంతంగా మాట్లాడుకుని, ఒకరినొకరు అర్థం చేసుకున్నామని ఆకృతి అగర్వాల్ తెలిపారు. తమ బంధానికి మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు.
''మేమిద్దరం ఒకరికొకరం సరిపోతాం. మా భవిష్యత్తు ప్రేమ, నమ్మకం, పరస్పర అవగాహనపై ఆధారపడి ఉండాలని కోరుకుంటున్నా'' అని ఆకృతి అగర్వాల్ పేర్కొన్నారు. పృథ్వీ షా కూడా ఆ ప్రకటనను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. అదీ సంగతి.
మార్చిలో నిశ్చితార్థం... తర్వాత?
తామిద్దరం ప్రేమలో ఉన్నామని ఈ ఏడాది మార్చిలో పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్ అధికారికంగా ప్రకటించారు. మార్చి 8న నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. “మైదానంలో సిక్సర్లు కొట్టడం నుంచి, జీవితాంతం సాగే ప్రేమ ప్రయాణం వరకు... ఆమె నా జీవితంలో పర్ఫెక్ట్ ఇన్నింగ్స్!” అని తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు పృథ్వీ షా. అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: SS Rajamouli Break To Varanasi Movie - వారణాసి పనులకు బ్రేక్... అమెరికా వెళ్లిన రాజమౌళి - ఎందుకంటే?
సెప్టెంబర్లో విడిపోతున్నట్లు ప్రకటన!
సెప్టెంబర్లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. తమ తమ భవిష్యత్తు లక్ష్యాలు, పరిస్థితులు వేర్వేరుగా ఉండటంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆకృతి అగర్వాల్ ప్రకటించారు. పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె తెలిపారు. తమ వ్యక్తిగత జీవితంపై రూమర్స్ స్ప్రెడ్ చేయవద్దని, తమ ప్రైవసీని గౌరవించాలని కూడా కోరారు.
అయితే... ఏమైందో ఏమో? మళ్ళీ పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్ ఒక్కటయ్యారు. తమ బంధాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. తమ వ్యక్తిగత నిర్ణయాలను గౌరవించాలని అభిమానులను కోరారు. దాంతో ఎప్పుడు పెళ్ళి చేసుకుంటారో అని అందరూ ఎదురు చూస్తున్నారు.
Before You Go
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
Frequently Asked Questions
పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్ మొదట నిశ్చితార్థం ఎప్పుడు చేసుకున్నారు?
ఈ జంట మొదట విడిపోవడానికి కారణం ఏమిటి?
సెప్టెంబర్లో, వారి భవిష్యత్తు లక్ష్యాలు, పరిస్థితులు వేర్వేరుగా ఉండటంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆకృతి అగర్వాల్ ప్రకటించారు. ఇది పరస్పర అంగీకారంతో తీసుకున్న నిర్ణయం అని తెలిపారు.
పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్ ఎందుకు మళ్లీ కలిశారు?
ఆకృతి తన నిర్ణయం తొందరపడి తీసుకున్నానని అంగీకరించారు. ఇద్దరూ కలిసి ప్రశాంతంగా మాట్లాడుకుని, తమ బంధానికి మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
ట్రెండింగ్ వార్తలు



















