అన్వేషించండి

Pakistan Cricket Board: మరోసారి పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ ?

Babar Azam: పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ మరో సంచలన నిర్ణయానికి తెర లేపింది.  2024 టీ20 ప్రపంచకప్‌కు ముందు బాబర్ అజామ్‌ను తిరిగి కెప్టెన్‌గా నియమించేందుకు సన్నాహాలు చేస్తోంది.

PCB set to reappoint Babar Azam as captain: పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(Pakistan Cricket Board) మరో సంచలన నిర్ణయానికి తెర లేపింది.  2024 టీ20 ప్రపంచకప్‌కు ముందు బాబర్ అజామ్‌( Babar Azam)ను తిరిగి కెప్టెన్‌గా నియమించేందుకు సన్నాహాలు చేస్తోంది.గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్( world Cup 2023)లో చెత్త ప్రదర్శన చేసిన నేపథ్యంలో పాక్‌ కెప్టెన్సీ పదవికి బాబార్‌ ఆజమ్‌ రాజీనామా చేశాడు. దీంతో  షాహీన్ షా ఆఫ్రిది పాకిస్తాన్ క్రికెట్ జట్టు బాధ్యతలు తీసుకున్నాడు. అయితే ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ కెప్టెన్‌ను మార్చే ఆలోచనలో పడింది. షహీన్ స్థానంలో మొహమ్మద్ రిజ్వాన్ , బాబర్ ఆజంలు రేసులో ఉన్నారు. అయితే, ఇటీవలి పరిణామాలు బాబర్‌ను మరోసారి కెప్టెన్సీకి ప్రాథమిక అభ్యర్థిగా నిలిపాయి. అయితే గతంలో జరిగిన సంఘటనలతో బాబర్ అజామ్‌ ఈ పదవి పట్ల సుముఖంగా లేరని.. మరోసారి  బాధ్యతలు స్వీకరించేందుకు సంకోచిస్తున్నారని పాకిస్తాన్ మీడియా వర్గాలు  చెబుతున్నాయి. అతను కొన్ని విషయాలకు సంబంధించి బోర్డు నుండి హామీని కోరుతున్నాడనీ , అవన్నీ  పరిష్కరించినప్పుడు మాత్రమే కెప్టెన్సీని తిరిగి స్వీకరించడానికి అంగీకరిస్తాడని సమాచారం. 

2023 ప్రపంచ కప్ తర్వాత బాబర్ అజామ్ తన వైట్-బాల్ కెప్టెన్సీ నుండిబయటపడ్డాడు. దీంతో షాహీన్ ఆఫ్రిది T20I నాయకత్వాన్ని తీసుకున్నాడు. తరువాత    బాబర్ కూడా రెడ్-బాల్  కెప్టెన్సీ నుండి వైదొలిగాడు, దీంతో  షాన్ మసూద్‌ను టెస్ట్ కెప్టెన్‌గా నియమించబడ్డాడు.  ఇన్ని మార్పులు జరిగినా పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రదర్శన ఏమాత్రం మెరుగుపడలేదు.  ముఖ్యంగా ఆస్ట్రేలియాలో మూడు టెస్టుల్లోనూ ఓడిపోయింది, అలాగే  న్యూజిలాండ్‌లో జరిగిన T20I సిరీస్‌లో 1-4 తేడాతో ఓటమిపాలయ్యింది. 

సంక్షోభంలో పాకిస్తాన్ క్రికెట్ 

మరికొన్ని నెలల్లో టీ20 ప్రపంచకప్‌(T20 World Cup) ఆరంభం కానున్న వేళ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) సంచ‌ల‌న నిర్ణయం తీసుకుంది. ఏడుగురు స‌భ్యుల‌తో కూడిన సెలెక్షన్ క‌మిటీని ర‌ద్దు చేసింది.  ప్రస్తుతం కొన‌సాగ‌తున్న సెలెక్షన్ క‌మిటీని ర‌ద్దు చేస్తున్నామని.... కొత్త క‌మిటీని త్వరలోనే ప్రక‌టిస్తామని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ న‌ఖ్వీ వెల్లడించారు. మాజీ చీఫ్ సెలెక్టర్ వాహ‌బ్ రియాజ్‌తో సమావేశమైన తర్వాత నఖ్వీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈమ‌ధ్యే పీసీబీ ఏడుగురు స‌భ్యుల సెలెక్షన్‌ క‌మిటీని ఏర్పాటు చేసింది. అందులో మాజీ ఆట‌గాళ్లు అబ్దుల్ రజాక్, అస‌ద్ ష‌ఫీక్, మ‌హ‌మ్మద్ యూసుఫ్, వాహ‌బ్ రియాజ్, కెప్టెన్, హెడ్‌కోచ్‌, డేటా అన‌లిస్ట్‌ల‌కు చోటు ద‌క్కింది. అయితే.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌లో పాక్ జ‌ట్టు చెత్త ఆట‌తో నిరాశ‌ప‌రిచింది. దాంతో, సెల‌క్షన్ క‌మిటీపై పీసీబీ చీఫ్ మొహ్సిన్ న‌ఖ్వీ వేటు వేశారు. మరోవైపు  ఆటగాళ్లు ఫిట్నెస్ విషయంలో అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దగా దృష్టి పెట్టడం లేదని.. అందుకే జట్టులో ఉన్న ఆటగాళ్లు ఎవరు కూడా పెద్దగారాణించడం లేదు అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి అని చెప్పాలి. ఇలాంటి విమర్శలు వేళ ఇక ఆటగాళ్ల ఫిట్నెస్ను మరింత మెరుగుపరిచే విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్టు  తెలుస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Smriti Mandhana Dominance : ప్రపంచ నంబర్ వన్ పీఠంపై స్మృతి మంధాన తిరుగులేని హవా.. గిల్ ,షెఫాలీలకు ఐసీసీ అవార్డులు
ప్రపంచ నంబర్ వన్ పీఠంపై స్మృతి మంధాన తిరుగులేని హవా.. గిల్ ,షెఫాలీలకు ఐసీసీ అవార్డులు
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vaibhav Sooryavanshi News: సిరీస్ తేలిపోతే 15 ఏళ్ల కుర్రాడికి ఛాన్స్.. సూర్యవంశీ ఎంట్రీపై అభిషేక్ సరికొత్త ప్లాన్, 4వ టీ20పై శ్రేయస్ సేన నజర్
సిరీస్ తేలిపోతే 15 ఏళ్ల కుర్రాడికి ఛాన్స్.. సూర్యవంశీ ఎంట్రీపై అభిషేక్ సరికొత్త ప్లాన్, 4వ టీ20పై శ్రేయస్ సేన నజర్

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Director Maruthi: రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Embed widget