అన్వేషించండి

MS Dhoni: ధోనీకిది చివరి ఐపీఎల్‌ కాదా? బాల్య మిత్రుడు ఏమన్నాడంటే

MS Dhoni: ధోనీ తన కెరీర్‌లో చివరి ఐపీఎల్‌కు కూడా సిద్ధమైపోయాడని ఊహాగానాల వేళ మహీ చిన్ననాటి స్నేహితుడు పరమ్‌జిత్‌ సింగ్‌ కీలక విషయాన్ని వెల్లడించాడు.

MS Dhoni  IPL retirement plans: మహేంద్రసింగ్‌ ధోనీ(Mahendra Singh Dhoni) కూల్‌ కెప్టెన్‌.. టీమిండియా(Team India)కు అత్యధిక ఐసీసీ ట్రోఫీ(ICC Trophies)లు అందించిన కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు. అంతేనా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL )లో చెన్నైసూపర్ కింగ్స్‌కు 5 టైటిళ్లు అందించి అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. కెప్టెన్సీతో మ్యాజిక్‌ చేసి గెలవదు అనుకున్న ఎన్నో మ్యాచ్‌లను మలుపు తిప్పి గెలిచేలా చేయడంలో ధోనీ ప్రావీణ్యం అందరికీ తెలిసిందే. 40 ఏళ్ల వయసులోనూ గతేడాది చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలబెట్టి తాను ఎందుకు అంత విజయవంతమైన కెప్టెన్‌నో మరోసారి క్రికెట్‌ ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇక ధోనీ తన కెరీర్‌లో చివరి ఐపీఎల్‌కు కూడా సిద్ధమైపోయాడని ఊహాగానాలు చెలరేగాయి. అయితే ధోనీకిది చివరి ఐపీఎల్‌ కాదని ఇప్పటికే టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్‌ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు అతని చిన్ననాటి స్నేహితుడు కూడా అదే అన్నాడు. 
 
ఇంకో రెండేళ్లు!
ధోనీ తన కెరీర్‌లో చివరి ఐపీఎల్‌కు కూడా సిద్ధమైపోయాడని ఊహాగానాల వేళ మహీ చిన్ననాటి స్నేహితుడు పరమ్‌జిత్‌ సింగ్‌ కీలక విషయాన్ని వెల్లడించాడు. ధోనీ ఫిట్‌నెస్‌ చూస్తే ఇదే చివరి సీజన్‌ అని అనుకోలేమని... ప్రస్తుత సీజన్‌తోపాటు కనీసం మరో రెండేళ్లు ఆడతాడని అనుకుంటున్నానని... దానికి కారణం అతడి ఫిట్‌నెస్‌ స్థాయే కారణమని అన్నాడు. 
 
స్నేహమేరా జీవితం అన్న ధోనీ
ఈ మధ్య ధోనీ కొత్త లోగో ఉన్న బ్యాట్‌తో ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించాడు. అది ఏ పెద్ద కంపెనీ లోగోనో కాదు. ఆ బ్యాటుపై ఉన్న స్టిక్కర్ ఏ కంపెనీది కాదు. ఆ స్టిక్కర్ మీద అత‌డి స్నేహితుడి షాపు పేరు రాసి ఉంది. బాల్యమిత్రుడికి సాయం చేయాల‌నే ఉద్దేశంతో ధోనీ తన ఫ్రెండ్‌ షాప్ పేరుతో ఉన్న స్టిక్కర్ అతికించిన బ్యాటుతో మ‌హీ ప్రాక్టీస్ చేశాడు. ధోనీ చిన్నప్పటి స్నేహితుడికి ‘ప్రైమ్ స్పోర్ట్స్' అనే క్రీడా పరికరాల దుకాణం ఉంది. ఇందులో క్రికెట్ కిట్తో పాటు జెర్సీలు, ఇత‌ర ఆట సామ‌గ్రి ల‌భిస్తాయి. దాంతో, త‌న మిత్రుడి దుకాణానికి మ‌రింత పాపులారిటీ తేవ‌డం కోసం ధోనీ.. ప్రైమ్ స్పోర్ట్స్ స్టిక్కర్ ఉన్న బ్యాటుతో ప్రాక్టీస్ చేశాడు. ఇంకేముంది.. క్షణాల్లో ఆ ఫొటోలు, వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారాయి. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోనీ.. త‌న కెరీర్‌లో చాలా కంపెనీల లోగో ఉన్న బ్యాట్‌లు ఉప‌యోగించాడు. అత‌డు స్నేహితుల దుకాణం పేరున్న బ్యాటుతో క‌నిపించ‌డం మాత్రం ఇదే తొలిసారి. దాంతో, ప్రైమ్ స్పోర్ట్స్ బ్యాటుతో ధోనీ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు చూసిన‌వాళ్లంతా.. అందుకే ధోనీ ప్రత్యేకం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇటీవలే ఐపీఎల్‌ ఆల్‌టైమ్‌ అత్యుత్తమ జట్టు సారథిగా ధోనీ ఎంపికయ్యాడు. 2008లో మొదలై బ్లాక్‌బాస్టర్‌ లీగ్‌గా మారిన ఐపీఎల్‌లో ఇప్పటిదాకా ఆడిన ఆటగాళ్లతో అత్యుత్తమ జట్టును వసీం అక్రమ్‌, మాథ్యూ హేడెన్‌, టామ్‌ మూడీ, డేల్‌ స్టెయిన్‌తో కూడిన సెలక్షన్‌ ప్యానల్‌.. 70 మంది పాత్రికేయులతో కలిసి ఎంపిక చేసింది. 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IPL Fastest Centuries: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
IPL చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
Bhuvneshwar Kumar Records: ఐపీఎల్ చరిత్రలో భువనేశ్వర్ అరుదైన ఘనత, మరో అడుగేస్తే అద్భుతమే
ఐపీఎల్ చరిత్రలో భువనేశ్వర్ అరుదైన ఘనత, RCB పేసర్ మరో అడుగేస్తే అద్భుతమే
IPL 2026 RCB VS MI Result Update: టాప్ ర్యాంకు కు ఆర్సీబీ.. MIపై థ్రిల్లింగ్ విక్ట‌రీ.. స‌త్తా చాటిన క్రునాల్, భువ‌నేశ్వ‌ర్, టోర్నీ నుంచి ముంబై ఔట్
టాప్ ర్యాంకు కు ఆర్సీబీ.. MIపై థ్రిల్లింగ్ విక్ట‌రీ.. స‌త్తా చాటిన క్రునాల్, భువ‌నేశ్వ‌ర్, టోర్నీ నుంచి ముంబై ఔట్
Virat Kohli and Rohit Sharma News: ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు.. ధోనీ సరసన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు.. ధోనీ సరసన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ!

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Bhagirath POCSO Case: బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
YSRCP Spokesperson Shyamala Response on Rumors: శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
Petrol and Diesel Price Hike? ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
IPL Fastest Centuries: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
IPL చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
TN Minister S Keerthana: ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. నిరాశగా వెనుదిరిగిన కీర్తన
ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. Watch Video
Peddi Trailer : రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇట్స్ అఫీషియల్
రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇట్స్ అఫీషియల్
Barrierless Toll Plaza: టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
Trisha Krishnan : మల్టీ స్టారర్‌లో హీరోయిన్‌గా త్రిష - రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
మల్టీ స్టారర్‌లో హీరోయిన్‌గా త్రిష - రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Embed widget