అన్వేషించండి

Wankhede Stadium Guinness Record: వాంఖెడే స్టేడియంలో  గిన్నిస్ రికార్డు నమోదు.. ఎందుకో తెలుసా..?

Wankhede Stadium :1975లో జనవరి 23 నుంచి 29 వరకు వాంఖడే స్టేడియంలో టెస్టు మ్యాచ్‌ను ఆడింది. ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. ఈ ఏడాదికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో ఎంసీఏ వారోత్సవాలు నిర్వహించింది.

MCA Create a new Guinness World Record: ముంబైలోని వాంఖెడే క్రికెట్ స్టేడియం పేరు గిన్నీస్ బుక్ లోకి ఎక్కింది. స్టేడియంలో తొలి అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 14వేల 505 బంతులతో స్టేడియానికి సంబంధించి కొన్ని పదాలను ఏర్పాటు చేశారు. దీంతో ఇన్ని బంతులతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చిన  స్టేడియంగా వాంఖెడే స్టేడియం రికార్డులకెక్కింది. తాజాగా ఈ రికార్డు సాధించడంపై ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ప్రెసిడెంట్ అజింక్య నాయక్ హర్షం వ్యక్తం చేశారు. ముంబై తరపున ఆడిన దివంగత ఏకనాథ్ సోల్కర్ కు ఈ రికార్డు అంకితం చేయనున్నట్లు తెలిపారు. ఆయనలాగే ముంబైకి ప్రాతినిథ్యం వహించి, ప్రస్తుతం జీవించిలేని క్రికెటర్లకు కూడా అంకితమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఎరుపు, తెలుపు బంతులను వాడారు. చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ పదాలు, వాంఖెడేకు కొత్త శోభను తీసుకొచ్చాయని క్రికెట్ అభిమానులు పేర్కొన్నారు. 

1975లో తొలి మ్యాచ్..
1975లో భారత్ లో పర్యటించిన వెస్టిండీస్.. జనవరి 23 నుంచి 29 వరకు టెస్టు మ్యాచ్ ను ఆడింది. వాంఖెడే స్టేడియంలో ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. ఈ ఏడాదికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో ఎంసీఏ వారోత్సవాలు నిర్వహించింది. పలువురు క్రికెటర్లను కూడా సన్మానించింది. ఈ క్రమంలోనే క్రికెట్ బంతులతో గిన్నీస్ రికార్డుకు ప్రయత్నించి, సఫలమైంది. మరోవైపు ఈ రికార్డులో భాగమైన ఎరుపు, తెలుపు బంతులను వర్థమాన క్రికెటర్లకు ఇస్తామని అజింక్య నాయక్ తెలిపారు. రికార్డు ద్వారా స్ఫూర్తి పొంది, మరింత ఉత్తమమైన క్రికెటర్లుగా ఎదుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలోని క్రికెట్ క్లబ్బులు, అకాడమీలు, ఎన్జీవోలకు కూడా ఈ బంతులను అందించనున్నట్లు వెల్లడించారు. ఇక వెస్టిండీస్ తో జరిగిన ఈ మ్యాచ్ లో ఏకనాథ్ సోల్కర్ సెంచరీ బాదాడు. సొంతగడ్డపై జరిగిన తొలి మ్యాచ్ లోనే సెంచరీ కొట్టినందుకుగాను ప్రత్యేకంగా ఈ రికార్డును ఆయనకు అంకితమిస్తున్నట్లు ఎంసీఏ వర్గాలు తెలిపాయి. 

వాంఖెడేలో ఎన్నో మధురానుభూతులు..
భారత క్రికెట్ ప్రేమికులకు వాంఖెడే స్టేడియంతో ఎన్నో అనుభూతులు ఉన్నాయి. భారత్ సాధించిన రెండో వన్డే ప్రపంచకప్ 2011లో వాంఖెడే మైదానంలో సాధించడం విశేషం. అలాగే ఇంకా ఎన్నో మధురమైన మ్యాచ్ లకు వాంఖెడే వేదికగా నిలిచింది. ఇక గాడ్ ఆఫ్ క్రికెట్ గా పేరుగాంచిన, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ను ఇదే వేదికపై ఆడాడు. ఆ మ్యాచ్ ద్వారా 24 సంవత్సరాల ఉజ్వలమైన కెరీర్ కు వీడ్కోలు పలికాడు. ఈ మ్యాచ్ కు స్వయంగా సచిన్ తల్లి హాజరైంది. సచిన్ ఆడిన మ్యాచ్ కు తన తల్లి హాజరు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. సచిన్ కోరికతోనే బీసీసీఐ తన చివరి మ్యాచ్ ను వాంఖెడేలో షెడ్యూల్ చేసింది. సచిన్ లాంటి ఎంతోమంది దిగ్గజ క్రికెటర్లకు వాంఖెడే జన్మస్థానమైంది. ఇక్కడ మ్యాచ్ లు ఆడుతూ, అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో శిఖరాలకు వెళ్లినవారు ఉన్నారు. వారందరిని తలుచుకుని భారత అభిమానులు ఎమోషనల్ అయ్యారు. మరోవైపు రజతోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు సాధన కోసం ప్రయత్నించిన ఎంసీఏ పెద్దలను ఈ సందర్భంగా అభినందిస్తున్నారు. 

Also Read: షమీని అందుకే తీసుకోలేదా..? రీ ఎంట్రీపై అభిమానుల్లో పలు సందేహాలు.. ఎప్పుడు ప్లేయింగ్ లెవన్లోకి వస్తాడోనని వెయిటింగ్..!

టాప్ హెడ్ లైన్స్

Litton Das World Record:  టెస్టుల్లో బంగ్లా వికెట్ కీప‌ర్ లిట్టన్ దాస్ ప్రపంచ రికార్డు.. ఒక ఇన్నింగ్స్ లో అత్య‌ధిక డిస్మిస‌ల్స్ తో అరుదైన ఘనత
టెస్టుల్లో బంగ్లా వికెట్ కీప‌ర్ లిట్టన్ దాస్ ప్రపంచ రికార్డు.. ఒక ఇన్నింగ్స్ లో అత్య‌ధిక డిస్మిస‌ల్స్ తో అరుదైన ఘనత
Jasprit Bumrah Threat: వెల్లింగ్టన్ పచ్చిక పిచ్‌పై బుమ్రా నిప్పులు చెరిగితే కివీస్ బ్యాటర్లకు చుక్కలే.. న్యూజిలాండ్ కు మాజీ క్రికెటర్ స్ట్రాంగ్ వార్నింగ్
వెల్లింగ్టన్ పచ్చిక పిచ్‌పై బుమ్రా నిప్పులు చెరిగితే కివీస్ బ్యాటర్లకు చుక్కలే.. న్యూజిలాండ్ కు మాజీ క్రికెటర్ స్ట్రాంగ్ వార్నింగ్
Hardik Pandya News: PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
Morne Morkel Comments: తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akvan Latest Update: ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
Bandla Ganesh: బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
CM Revanth Reddy Siddipet Public Meeting: సిద్ధిపేటలో రేవంత్ సభ హడావుడి సరే.. స్వయంగా సీఎం పోటీ చేసినా హరీశ్ రావును ఓడించడం సాధ్యమేనా?
సిద్ధిపేటలో రేవంత్ సభ హడావుడి సరే.. స్వయంగా సీఎం పోటీ చేసినా హరీశ్ రావును ఓడించడం సాధ్యమేనా?
Personal Rapid Transit: హైదరాబాద్‌లో సరికొత్త రవాణా వ్యవస్థ.. డ్రైవర్‌లెస్ పాడ్ ట్యాక్సీలు రాబోతున్నాయ్‌!
హైదరాబాద్‌లోకి 'డ్రైవర్‌ అవసరం లేని పాడ్ ట్యాక్సీలు'.. 35 కి.మీ. PRTS నెట్‌వర్క్‌!
Nara Lokesh: తిరుపతిలో 5 వేల ఎకరాల్లో సెమీకండక్టర్ పార్క్- మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన
తిరుపతిలో 5 వేల ఎకరాల్లో సెమీకండక్టర్ పార్క్- మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన
KTR News: కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
YS Jagan Assests Case: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
Embed widget