Bumrah Injury Update: బుమ్రా గాయంపై ఉత్కంఠ.. మరికొన్ని గంటల్లో రానున్న స్పష్టత..! తరుముకొస్తున్న మెగాటోర్నీ గడువు!!
రిపోర్టులు మొత్తం ఒక్కరోజులో రెడీ అవుతాయి. ఈ రిపోర్టుల పరిశీలన అనంతరం బుమ్రా గాయంపై బీసీసీఐ మెడికల్ టీమ్ ఒక అవగాహనకు వచ్చే అవకాశముంది. ఆ తర్వాతే ఈ విషయంపై టీమ్ మేనేజ్మెంట్ కు దిశానిర్దేశం లభిస్తుంది.

ICC Champions Trophy News: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయానికి సంబంధించి అప్డేట్ మరి కొన్ని గంటల్లో తెలిసే అవకాశముంది. ఇప్పటికే చికిత్స కోసం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి చేరుకున్న బుమ్రాకు శుక్రవారం స్కాన్లు జరిగాయి. రిపోర్టులు మొత్తం ఒక్కరోజులో రెడీ అవుతాయని తెలుస్తోంది. ఈ రిపోర్టుల పరిశీలన అనంతరం బుమ్రా గాయంపై బీసీసీఐ మెడికల్ టీమ్ ఒక అవగాహనకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఆ తర్వాతే ఈ విషయంపై టీమ్ మేనేజ్మెంట్ కు దిశానిర్దేశం చేసే చాన్స్ ఉంది. మరోవైపు ఈ రిపోర్టులను న్యూజిలాండ్ కు చెందిన ఫేమస్ డాక్టర్ షౌటన్ కు పంపుతారు. గతంలో కూడా బుమ్రాకు చికిత్స అందించాడు. సిడ్నీలో బుమ్రా గాయపడినటప్పటి నుంచి తనను పర్యవేక్షిస్తున్నాడు.
ఈనెల 2న బెంగళూరుకు వచ్చిన బుమ్రా..
చికిత్స కోసం ఈనెల 2న ఎన్సీఏకు బుమ్రా వచ్చాడు. అప్పటి నుంచి నిపుణుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది. ఇక రిపోర్టుల అనంతరం తాజా స్థితిగతులపై బుమ్రాకు బ్రీఫ్ ఇవ్వనున్నారు. అందుకోసం మరొక్క రోజు తను ఎన్సీఏలోనే ఉండనున్నాడు. మరోవైపు ప్రతిష్టాత్మకు చాంపియన్స్ ట్రోఫీ కోసం తుదిజట్టును ప్రకటించేందుకు గడువు ముంచుకొస్తోంది. ఈనెల 11 లోపల తుది స్క్వాడ్ ను ప్రకటించాల్సి ఉంది. ఆలోగా బుమ్రా గాయంపై స్పష్టత రావాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఇంగ్లాండ్ తో మూడు వన్డేల సిరీస్ కు ఎంపికైన బుమ్రా.ను. గాయం కారణంగా పక్కన పెట్టారు. అతని స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేసినా, అతడిని తొలి వన్డేలో ఆడించలేదు. అయితే పేసర్ హర్షిత్ రాణాను ఆడించగా, తను మూడు వికెట్లతో సత్తా చాటాడు. ఒకవేళ మెగాటోర్నీకి బుమ్రా అందుబాటులో లేకపోతే ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలో అని టీమ్ మేనేజ్మెంట్ ఇబ్బందులు పడక తప్పదు.
సిడ్నీ టెస్టులో గాయం..
ఈనెల తొలి వారంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన ఐదో టెస్టులో సందర్భంగా బుమ్రా వెన్నుగాయానికి గురయ్యాడు. మ్యాచ్ మధ్యలో వెన్ను నొప్పికి గురి కావడంతో తను ఆస్పత్రికి వెళ్లి స్కాన్లు కూడా తీసుకొచ్చాడు. అప్పట్లో తను ఐదు వారాలు విశ్రాంతి తీసుకుంటుంటే సరిపోతుందని అన్నారు. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ కల్లా జట్టులోకి వస్తారని భావించినా, ఇప్పటికీ తన గాయంపై స్పష్టత లేదు. ఇక 2013లో చివరిసారగి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టు.. మరోసారి టోర్నీని గెలుచుకోవలని పట్టుదలగా ఉంది. అయితే ఒకవేళ బుమ్రా దూరమైతే అది పెద్ద దెబ్బేనని చెప్పుకోవచ్చు. బుమ్రా లేకపోతే టోర్నీ గెలిచే అవకాశాలు దాదాపు 30 శాతం వరకు దెబ్బ తింటాయని పలువురు మాజీలు అంచనా వేస్తున్నారు. ఇక 2017లో చివరిసారిగా ఈ టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించిన భారత్.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. ఈనెల 19 నుంచి ఈ టోర్నీ పాక్ లో ప్రారంభమవుతుండగా, ఈనెల 20 నుంచి తన మ్యాచ్ లను దుబాయ్ లో భారత్ ఆడనుంది. 20న బంగ్లాదేశ్, 23న పాక్, వచ్చేనెల 2న న్యూజిలాండ్ తో లీగ్ మ్యాచ్ లు ఆడుతుంది. ఒకవేళ భారత్ నాకౌట్ కు చేరితే సెమీస్, ఫైనల్ మ్యాచ్ లను కూడా దుబాయ్ లో నిర్వహిస్తారు.
Also Read: ICC Vs Srinath: చాంపియన్స్ టోర్నీ నుంచి తప్పుకున్న శ్రీనాథ్, మరో భారత అంపైర్ కూడా.. ఆ వివాదమే కారణమా..?




















