Kohli in IPL: కోహ్లీ మరో ఘనత - యాక్టివ్ ఐపీఎల్ టీమ్స్‌పై హాఫ్ సెంచరీ చేసిన రన్ మిషీన్
IPL 2023 RCB vs LSG: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఐపీఎల్ లో లెక్కకు మించి రికార్డులు ఉన్నాయి. తాజాగా అతడు మరో ఘనతను అందుకున్నాడు.
Kohli in IPL: రన్ మిషీన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ లీగ్ లో ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న 9 ఐపీఎల్ టీమ్స్‌పై హాఫ్ సెంచరీ చేసిన రెండో క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో అర్థ సెంచరీ చేయడం ద్వారా కోహ్లీ ఈ ఘనతను సాధించాడు. కోహ్లీ కంటే ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ పేరిట ఈ ఘనత ఉండేది. లక్నోతో మ్యాచ్ లో కోహ్లీ 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇన్నింగ్స్ మొదటి నుంచే లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డ కోహ్లీ.. బౌండరీలు, సిక్సర్లతో చిన్నస్వామి స్టేడియాన్ని హోరెత్తించాడు. అవేశ్ ఖాన్, మార్క్ వుడ్ వంటి పేసర్లను పవర్ ప్లే లో ఆటాడుకున్నాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ.. 44 బంతుల్లోనే 4 బౌండరీలు, 4 సిక్సర్ల సాయంతో 61 పరుగులు సాధించాడు.
అన్ని టీమ్స్‌పైనా బాదేశాడు..
కాగా 2022 సీజన్ కు ముందు ఐపీఎల్ లో యాక్టివ్ టీమ్స్‌గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ పై అర్థ సెంచరీలు చేసిన ఘనత ఉంది. గత సీజన్ లో లీగ్ లోకి గుజరాత్ టైటాన్స్ తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ ఎంట్రీ ఇచ్చాయి. 2022లోనే కోహ్లీ.. గుజరాత్ టైటాన్స్ పై హాఫ్ సెంచరీ చేశాడు. తాజాగా లక్నో పైనా అర్థ సెంచరీ చేయడంతో అన్ని టీమ్స్ పైనా 50 ప్లస్ స్కోరును చేసిన బ్యాటర్ గా రికార్డులకెక్కాడు.
ఐపీఎల్ టీమ్స్‌పై కోహ్లీ హయ్యస్ట్ స్కోర్లు..
ఐపీఎల్‌లో కోహ్లీ పేరిట లెక్కకు మిక్కిలి రికార్డులన్నాయి. ఈ లీగ్ లో కోహ్లీ మొత్తంగా 226 మ్యాచ్ లలో 218 ఇన్నింగ్స్ ఆడి 6,788 రన్స్ సాధించాడు. ఐపీఎల్ లో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్ కోహ్లీనే. ఈ క్రమంలో కోహ్లీ 46 హాఫ్ సెంచరీలు, 5 సెంచరీలు కూడా చేశాడు. వివిధ జట్లపై కోహ్లీ హయ్యస్ట్ స్కోరు జాబితా ఇదే..
సీఎస్కే : 90 నాటౌట్
ఢిల్లీ : 99
జీటీ : 73
కేకేఆర్ : 100
ముంబై : 92 నాటౌట్
పంజాబ్ : 113
రాజస్తాన్ : 72 నాటౌట్
ఎస్ఆర్‌హెచ్ : 93 నాటౌట్
లక్నో : 61
- ఐపీఎల్ లో ప్రస్తుతం ఉన్న జట్లే కాదు మధ్యలో కొన్నాళ్లు ఆడిన రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్, గుజరాత్ లయన్స్ తో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ పూర్వ ఫ్రాంచైజీ డెక్కన్ ఛార్జర్స్ పైనా కోహ్లీ అర్థ సెంచరీలు చేశాడు. ఒక్క కొచ్చి టస్కర్స్ పై మాత్రమే విరాట్ ఫిఫ్టీ చేయలేకపోయాడు.
ఇదిలాఉండగా లక్నోతో మ్యాచ్ లో 61 పరుగులు చేయడం ద్వారా కోహ్లీ టీ20 ఫార్మాట్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో ఆసీస్ మాజీ ఆటగాడు ఆరోన్ ఫించ్ రికార్డు బ్రేక్ చేశాడు.
Most runs in T20 history:
— Johns. (@CricCrazyJohns) April 10, 2023
Gayle - 14562
Malik - 12528
Pollard - 12175
Kohli - 11429*
Finch - 11392 pic.twitter.com/gJAFCpM8Hx
టీ20లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు..
- క్రిస్ గేల్ : 14,562 పరుగులు
- షోయభ్ మాలిక్ : 12,528
- కీరన్ పొలార్డ్ : 12,175
- విరాట్ కోహ్లీ : 11,429
- ఆరోన్ ఫించ్ : 11,392