అన్వేషించండి

MS Dhoni: ధోనీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్‌- అసలు విషయం చెప్పేసిన మిస్టర్ కూల్

చెన్నై సూపర్ కింగ్స్ - సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ తర్వాత 'సీఎస్కే సారథి ధోని.. ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లేతో మాట్లాడుతూ తన కెరీర్‌పై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

MS Dhoni: ‘ఇదే లాస్ట్ సీజన్. ఇక  రిటైరైపోతాడు’, ‘సొంత అభిమానుల మధ్య  కెరీర్ ముగిస్తాడు’, ‘వయసైపోతంది. మునపటిలా షాట్లు ఆడటం  కష్టమే.  ఈ సీజన్‌తో గుడ్ బై చెప్తాడు’.. గత కొంతకాలంగా   చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ గురించి వినిపిస్తున్న  వాదనలివి.  ఇప్పుడే కాదు 2021 నుంచీ  ఇవే  గుసగుసలు.   కానీ ధోని వీటికి ఎప్పటికప్పుడూ తన ఆట, ఫిట్నెస్‌తోనే సమాధానం చెబుతున్నాడు. తాజాగా  ధోని తన కెరీర్, రిటైర్మెంట్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.  

శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్ - సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ లో  ధోని.. ప్రముఖ  క్రికెట్ కామెంటేటర్  హర్షా భోగ్లేతో మాట్లాడుతూ.. ‘నా కెరీర్ గురించి చాలామంది చాలారకాలుగా మాట్లాడుతున్నారు.  నేను ఎంతకాలం ఆడినా సరే. ఇప్పుడైతే కెరీర్ చివరి దశలో ఉన్నా. వయసు  పెరుగుతుంటే  అనుభవం  వచ్చినట్టే..’ అని  చెప్పాడు. ఈ సమయంలో హర్షా కల్పించుకుని   ‘యూ ఆర్ నాట్ ఓల్డ్’అని  అనగానే ధోని నవ్వుతూ.. ‘కచ్చితంగా  వయసు పెరిగింది. నా వయసు గురించి చెప్పడానిని నేనేమీ సిగ్గుపడను..’అని నవ్వుతూ సమాధానమిచ్చాడు.  

సచిన్ టెండూల్కర్  17 ఏండ్ల వయసు నుంచే క్రికెట్ ఆడుతూ రెండున్నర దశాబ్దాల పాటు  క్రికెట్‌కు సేవలందించాడని ధోని ఈ సందర్భంగా  చెప్పుకొచ్చాడు.  కాగా ధోని నిన్నటి మ్యాచ్ గురించి స్పందిస్తూ.. జట్టులోకి కొత్తగా చేరిన పతిరన, ఆకాశ్ సింగ్, తుషార్ దేశ్‌పాండే వంటి బౌలర్లు  క్రమంగా మెరుగవుతున్నారని కొనియాడాడు. ముఖ్యంగా పతిరన ఆర్సీబీతో మ్యాచ్ లోనే గాక  సన్ రైజర్స్ పైనా రాణించాడని తెలిపాడు.  స్పిన్నర్లు కూడా బాగా బౌలింగ్ చేశారని ప్రశంసలు కురిపించాడు. 

 

నాకు బెస్ట్ క్యాచ్ ఇవ్వలేదు : ధోని  

ఈ మ్యాచ్ లో హ్యారీ బ్రూక్ ఇచ్చిన  క్యాచ్ ను  షార్ట్ థర్డ్ కవర్ వద్ద  రుతురాజ్ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. ఈ సందర్భంగా అతడికి బెస్ట్ క్యాచ్ అవార్డు దక్కింది. దీని గురించి కూడా ధోని  స్పందించాడు.  తనకు అత్యుత్తమ క్యాచ్ ఇవ్వలేదని  నవ్వుతూ చెప్పాడు. ‘మేం  గ్లోవ్స్ వేసుకుంటాం  కాబట్టి ఇప్పటికీ అభిమానులు మాకు క్యాచ్ లు పట్టడం సులువని అనుకుంటారు. కానీ నేనైతే ప్రతీ క్యాచ్‌ను అద్భుతమైన క్యాచ్ అనే అనుకుంటా. మన ఎబిలిటీతోనే కాకుండా  సరైన ప్రాంతంలో లేకుండానే క్యాచ్‌లను అందుకోవడం జరుగుతుంటుంది..’అని చెప్పాడు. ఈ మ్యాచ్ లో ధోని.. తీక్షణ బౌలింగ్ లో మార్క్‌రమ్ ఇచ్చిన క్యాచ్ పట్టడమే గాక  మయాంక్ అగర్వాల్  ను స్టంపౌట్ చేశాడు. 

 

ఇక నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. చెపాక్  స్టేడియంలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో  7 వికెట్లు కోల్పోయి  134 పరుగులు మాత్రమే చేసింది. జడేజా మూడు వికెట్లు తీశాడు.  స్వల్ప లక్ష్యాన్ని చెన్నై.. 18.4 ఓవర్లలోనే ఛేదించింది. డెవాన్ కాన్వే (77 నాటౌట్) రాణించాడు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Josh Inglis Smashes Fastest Fifty: చెపాక్ మైదానంలో జోష్ ఇంగ్లిస్ విధ్వంసం.. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన లక్నో హిట్టర్! సరికొత్త ఐపీఎల్ రికార్డు
చెపాక్ మైదానంలో జోష్ ఇంగ్లిస్ విధ్వంసం.. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన లక్నో హిట్టర్! సరికొత్త ఐపీఎల్ రికార్డు
Vaibhav Sooryavanshi World Record: వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం.. వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన 15 ఏళ్ల కుర్రాడు
వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం.. వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన 15 ఏళ్ల కుర్రాడు
Hardik Pandya News: ముంబై వర్సెస్ బెంగళూరు ఫైట్.. సూర్యకుమార్ యాదవ్ రీ ఎంట్రీ! హార్దిక్ పాండ్యా ఇంజ్యూరీ అప్డేట్
ముంబై వర్సెస్ బెంగళూరు ఫైట్.. సూర్యకుమార్ యాదవ్ రీ ఎంట్రీ! హార్దిక్ పాండ్యా ఇంజ్యూరీ అప్డేట్
IPL 2026 GT VS RR Result Update: జీటీకి వ‌రుస‌గా నాలుగో విక్ట‌రీ.. టోర్నీలోనే అతి పెద్ద విజ‌యం.. రాణించిన గిల్, సుద‌ర్శ‌న్, ర‌షీద్, హోల్డ‌ర్, రాయ‌ల్స్ చిత్తు
జీటీకి వ‌రుస‌గా నాలుగో విక్ట‌రీ.. టోర్నీలోనే అతి పెద్ద విజ‌యం.. రాణించిన గిల్, సుద‌ర్శ‌న్, ర‌షీద్, హోల్డ‌ర్, రాయ‌ల్స్ చిత్తు

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Josh Inglis Smashes Fastest Fifty: చెపాక్ మైదానంలో జోష్ ఇంగ్లిస్ విధ్వంసం.. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన లక్నో హిట్టర్! సరికొత్త ఐపీఎల్ రికార్డు
చెపాక్ మైదానంలో జోష్ ఇంగ్లిస్ విధ్వంసం.. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన లక్నో హిట్టర్! సరికొత్త ఐపీఎల్ రికార్డు
Who is S Keerthana: విజయ్ క్యాబినెట్‌లో లేడీ ప్రశాంత్ కిశోర్ - తెలుగు మాట్లాడే తమిళ మంత్రి రికార్డులు, ప్రత్యేకతలు ఇవే
విజయ్ క్యాబినెట్‌లో లేడీ ప్రశాంత్ కిశోర్ - తెలుగు మాట్లాడే తమిళ మంత్రి రికార్డులు, ప్రత్యేకతలు ఇవే
Tamil Nadu Cabinet Ministers: తమిళనాడు కేబినెట్ మంత్రుల ప్రత్యేకతలివే.. విజయ్ టీవీకే పార్టీ వారికే ఛాన్స్
తమిళనాడు కేబినెట్ మంత్రుల ప్రత్యేకతలివే.. విజయ్ టీవీకే పార్టీ వారికే ఛాన్స్
KTR: ప్రధాని మోదీ పర్యటన వేళ బీజేపీకి షాక్! బండి సంజయ్ కుమారుడ్ని అరెస్ట్ చేయకపోవడంపై కేటీఆర్ ఫైర్
ప్రధాని మోదీ పర్యటన వేళ బీజేపీకి షాక్! బండి సంజయ్ కుమారుడ్ని అరెస్ట్ చేయకపోవడంపై కేటీఆర్ ఫైర్
Tamil Nadu CM Vijay: విజయ్ సీఎం అయ్యాక రిలీజవుతున్న ఫస్ట్ తమిళ్ సినిమా... జన నాయగన్ కాదు - అయినా దళపతికి స్పెషల్
విజయ్ సీఎం అయ్యాక రిలీజవుతున్న ఫస్ట్ తమిళ్ సినిమా... జన నాయగన్ కాదు - అయినా దళపతికి స్పెషల్
CM Vijay: సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే 3 ఫైళ్లపై విజయ్ సంతకాలు.. అధికారులకు కీలక ఆదేశాలు
సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే 3 ఫైళ్లపై విజయ్ సంతకాలు.. అధికారులకు కీలక ఆదేశాలు
Agnimitra Paul: ఎవరీ అగ్నిమిత్ర పాల్? 23 క్రిమినల్ కేసులు... బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ నుంచి బెంగాల్ బీజేపీ క్యాబినెట్‌లోకి
ఎవరీ అగ్నిమిత్ర పాల్? 23 క్రిమినల్ కేసులు... బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ నుంచి బెంగాల్ బీజేపీ క్యాబినెట్‌లోకి
Anna Konidela : అమ్మతో పవన్ కల్యాణ్... బిడ్డతో అన్నా లెజినోవా - రేర్ ఫ్యామిలీ ఫోటో
అమ్మతో పవన్ కల్యాణ్... బిడ్డతో అన్నా కొణిదెల - రేర్ ఫ్యామిలీ ఫోటో
Embed widget