By: Rama Krishna Paladi | Updated at : 18 Aug 2023 01:33 PM (IST)
భారత్ vs ఐర్లాండ్ ( Image Source : Twitter )
India vs Ireland 1st T20I:
ఐర్లాండ్‌తో మొదటి టీ20కి టీమ్‌ఇండియా రెడీ! కొత్త ఎంపికైన కుర్రాళ్లు అంతర్జాతీయ వేదికలో అదరగొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. దొరికిన ప్రతి అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసిపట్టాలన్న ఉత్సాహంతో ఉన్నారు. అయితే వరుణ దేవుడు వారి ఆశలపై నీళ్లు చల్లే అవకాశం కనిపిస్తోంది.
India vs Ireland 1st T20I Weather report: భారత్, ఐర్లాండ్ నేడు మొదటి టీ20లో తలపడుతున్నాయి. డబ్లిన్‌లోని మలహైడ్ ఇందుకు వేదిక. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. స్థానికంగా సాయంత్రం 3:30 గంటలకు అవుతుంది. అయితే నాలుగు గంటల ప్రాంతంలో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆక్యూవెదర్ వెబ్‌సైట్ ప్రకారం మ్యాచ్ ఆరంభంలోనే వర్షం కురిసేందుకు 67 శాతం అవకాశం ఉంది. పైగా అధికారులు డబ్లిన్ నగరంలో పసుపు రంగు హెచ్చరికలు జారీ చేశారు.
India vs Ireland head-to-head record: భారత్, ఐర్లాండ్ ఇప్పటి వరకు ఐదు టీ20లు ఆడాయి. వీటిల్లో అన్ని మ్యాచుల్లో టీమ్‌ఇండియాదే విజయం. 5-0తో తిరుగులేని ఆధిక్యంలో ఉంది. చివరిసారిగా ఈ రెండు జట్లు 2022లో రెండు మ్యాచుల సిరీసులో తలపడ్డాయి. మొదటి మ్యాచును 7 వికెట్లు, రెండో మ్యాచును 4 పరుగుల తేడాతో టీమ్‌ఇండియా కైవసం చేసుకుంది.
India vs Ireland 1st T20I pitch report: భారత్, ఐర్లాండ్ డబ్లిన్ స్టేడియంలో మ్యాచ్ ఆడుతున్నాయి. ఇది బ్యాటింగ్ ఫ్రెండ్లీ స్టేడియం. తొలి ఇన్నింగ్స్ సగటు 151 పరుగులు. ఇప్పటి వరకు ఇక్కడ 17 టీ20లు జరగ్గా మొదటి బ్యాటింగ్ చేసిన జట్టు 7, ఛేదన జట్టు 8 మ్యాచులు గెలిచాయి. చల్లని వాతావరణం, మబ్బులు ఉంటే బౌలర్లు ప్రభావం చూపిస్తారు.
రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యకు విశ్రాంతి ఇవ్వడంతో ఈ సిరీసులో టీమ్‌ఇండియాకు జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ సెన్సేషన్స్ రింకూ సింగ్, జితేశ్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేస్తున్నారు. బుమ్రా సైతం ఏడాదిన్నర తర్వాత పునరాగమనం చేస్తున్నాడు. శివమ్ దూబె, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌పై ఆసక్తి నెలకొంది.
IND vs IRE T20 సిరీస్ పూర్తి షెడ్యూలు
ఆగస్టు 18, 2023: డబ్లిన్‌లో మొదటి టీ20
ఆగస్టు 20, 2023: డబ్లిన్‌లో రెండో టీ20
ఆగస్టు 23, 2023: డబ్లిన్‌లో మూడో టీ20
IND vs IRE T20 సిరీస్‌కు భారత జట్టు
జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వీ జైశ్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్, జితేశ్ శర్మ, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్
IND vs IRE T20 సిరీస్‌కు ఐర్లాండ్ జట్టు
పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బాల్‌బిర్నే, రాస్ అడైర్, హ్ఆయరీ టెక్టార్, గరేత్ డిలానీ, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, ఫిన్ హ్యాండ్, లార్కన్ టక్కర్, మార్క్ అడైర్, జోషువా లిటిల్, బ్యారీ మెక్‌కార్తీ, థియో వాన్ వూర్‌కామ్, బెంజమిన్ వైట్, క్రెయిగ్ యంగ్
WPL Auction 2024: వేలంలో ఏ ప్రాంచైజీ ఎవరిని దక్కించుకుందంటే?
WPL Auction 2024: భారత అమ్మాయిలపై కాసుల వర్షం, కోట్లు దక్కించుకున్న అన్ క్యాప్‌డ్ ప్లేయర్లు
India vs England Women : సిరీస్ ఇంగ్లాండ్ మహిళలదే, రెండో టీ 20లోనూ భారత్ చిత్తు
India vs South Africa : సఫారీలతో తొలి సవాల్, యువ భారత్ సత్తా చాటేనా?
WPL Auction 2024: ఐపీఎల్ వేలంలో తెలంగాణ అమ్మాయి, గుజరాత్ టీమ్‌లోకి త్రిష
Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్
Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!
Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ
Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్
/body>